ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆట పరంగానే కాకుండా వ్యూయర్‌షిప్‌లోనూ రికార్డులు బద్దలు కొడుతోంది. గతేడాదికి మించి వ్యూయరషిప్ లభిస్తోందని స్టార్ ఇండియా ఆనందం వ్యక్తం చేసింది. ఇప్పటికే టీవీ వ్యూయర్ల సంఖ్య 40 కోట్ల మైలురాయి దాటేందుకు సిద్ధంగా ఉందని తెలిసింది.
Also Read: కోహ్లీతో ముగ్గురు ఆటగాళ్ల ఢీ! రోహిత్ మద్దతు! సయోధ్య కోసమే ధోనీ మెంటార్‌షిప్?
బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బార్క్) ప్రకారం ఐపీఎల్ 14వ సీజన్ వీక్షణలో రికార్డుల దుమ్ము దులపనుంది. 35 మ్యాచులు ముగిసే సరికే 380 మిలియన్ల వ్యూయర్లు నమోదయ్యారు. 2020లో ఇదే దశతో పోలిస్తే 12 మిలియన్ల వ్యూయార్లు ఎక్కువే అన్న మాట. 2018 నుంచి టీవీల్లో మ్యాచులు చూస్తున్న వారి సంఖ్య ఏటా పెరుగుతోందని స్టార్ అంటోంది.
Also Read: ఎవరు మంచోడు? ఎవరు చెడ్డోడు? క్రీడాస్ఫూర్తిపై విమర్శించిన వారికి అశ్విన్ ఘాటు సందేశం!
స్టార్ స్పోర్ట్స్ ప్రి మ్యాచ్ ప్రోగ్రామ్‌తో కలిపి 242 బిలియన్ నిమిషాలు వివో ఐపీఎల్‌ను చూశారని స్టార్ తెలిపింది. ఇక రెండో అంచెలో వ్యూయర్ ఎంగేజ్‌మెంట్ స్థాయి సగటున ఒక్కో మ్యాచుకు 32 శాతంగా ఉందని పేర్కొంది. ఐపీఎల్ తొలి అంచెలో ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచును ఏకంగా 9.7 బిలియన్ నిమిషాల పాటు చూశారు. వివో ఐపీఎల్ 2021 ఆరంభ మ్యాచుకు 323 మిలియన్ల ఇంప్రెషన్స్ లభించాయి. 12వ సీజన్‌తో పోలిస్తే 14వ సీజన్ తొలి మ్యాచ్‌కు 42 శాతం అధిక వ్యూయర్‌షిప్ రావడం గమనార్హం.
Also Read: తిరుగులేని ధోనీసేనపై సన్‌రైజర్స్ నిలవగలదా? జేసన్ రాయ్‌పైనే ఆశలన్నీ!
గతేడాది ఐపీఎల్ టీవీ వ్యూయర్‌షిప్‌లో 23 శాతం పెరుగుదల నమోదైంది. దాదాపుగా 31.57 మిలియన్ల అభిమానులు మ్యాచులను వీక్షించారు. ఇక గత సీజన్‌లో మహిళా వీక్షకులు 24 శాతం పెరగ్గా పిల్లల్లో 20 శాతం పెరిగింది. గతేడాది టీవీ వీక్షించే ప్రతి ముగ్గురిలో ఒకరు, టీవీలున్న 86 మిలియన్ల ఇళ్లలో 44 శాతం ఐపీఎల్ చూశారు. 15 నుంచి 21 ఏళ్ల వయసు వారు ఐపీఎల్‌ను ఎక్కువగా చూస్తున్నారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి