ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 24 గంటల్లో 1010 కరోనా కేసులు, 13 మరణాలు నమోదయ్యాయి. తాజాగా కరోనా నుంచి మరో 1,149 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11,503 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 58,054 నిర్థారణ పరీక్షలు చేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తాజా విడుదల చేసిన కరోనా బులెటిన్ లో ఈ వివరాలు తెలిపింది. కరోనాతో చిత్తూరు జిల్లాలో ఐదుగురు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. తూర్పు గోదావరి జిల్లాలో 244, చిత్తూరు జిల్లాలో 147 కరోనా కేసులు నమోదయ్యాయి.
Also Read: ‘నందా’ నాన్-లోకల్.. పరాయి నటులతో సినిమాలు, పదవులకు మాత్రం మనోళ్లు.. ఇదీ టాలీవుడ్ తీరు!
దేశంలో కొత్తగా కేసులు
గత రెండు రోజులుగా 20 వేలకు తగ్గిన కేసులు... మళ్లీ పెరిగాయి. 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 15.06లక్షల మందికి వైరస్ పరీక్షలు నిర్వహించగా 23,529 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మరణాలు కాస్త తగ్గాయి. మెున్న 378 మంది కరోనాతో మరణించగా.. నిన్న ఆ సంఖ్య 311గా ఉంది. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.37కోట్లు దాటగా ఇప్పటి వరకు 4,48,062 మంది వైరస్ కు బలయ్యారు. కొత్తగా నమోదైన మరణాల్లో సగం కేరళలోనే ఉన్నాయి. నిన్న కేరళలో 12,161 కొత్త కేసులు నమోదు కాగా 155 మంది కరోనాతో మరణించారు.
కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉన్నాయి. నిన్న మరో 28,718 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 3.30కోట్ల మంది కొవిడ్‌ను జయించారు. రికవరీ రేటు 97.85శాతానికి పెరిగింది. ఇక, కొత్త కేసులు తగ్గుముఖం పట్టడంతో క్రియాశీల కేసుల సంఖ్య 3 లక్షల దిగువకు పడిపోయింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,77,020 మంది వైరస్‌తో బాధపడుతున్నారు.
Also Read: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా 311 మంది వైరస్ కారణంగా మృతి