కాంగ్రెస్ పార్టీలో నెమ్మదిగా మొదలైన అంతర్గత విభేదాలు చివరికి రాష్ట్ర రాజకీయాల్లోనే పెను మార్పులు తెస్తున్నాయి. పంజాబ్ రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియడం లేదు. ఓవైపు మాజీ సీఎం అమరీందర్ సింగ్ వరుస భేటీలు.. మరోవైపు సిద్ధూతో కాంగ్రెస్ అధిష్ఠానం చర్చలు.. ఇలా పంజాబ్ రాజకీయం వేడెక్కింది. తాజాగా కాంగ్రెస్ పార్టీకి బైబై చెబుతున్నట్లు అమరీందర్ సింగ్ ప్రకటించారు. వాళ్లు చేసిన అవమానాన్ని భరించేందుకు తాను సిద్ధంగా లేనని అమరీందర్ అన్నారు. ఈ మేరకు ఎన్డీటీవీ పేర్కొంది.


భాజపాలోకి వెళ్తారా?


అమిత్ షాతో భేటీ అమరీందర్ సింగ్ భేటీ అనంతరం ఆయన భాజపాలోకి వెళ్తారనే వార్తలకు బలం చేకూరింది. నిన్న అమిత్ షాతో భేటీ అయిన అమరీందర్ సింగ్.. ఈరోజు జాతీయ భద్రత సలహాదారు అజిత్ డోభాల్‌తో భేటీ అయ్యారు. అయితే ఈ వార్తలను అమరీందర్ సింగ్ ఖండించారు. రైతుల సమస్యలపై మాత్రమే అమిత్ షాతో చర్చించినట్లు తెలిపారు.


పంజాబ్‌లో శాంతి భద్రతలపై కూడా అమరీందర్.. అమిత్ షాతో మాట్లాడినట్లు తెలుస్తోంది. పంజాబ్‌లో అస్థిర పరిస్థితులు ఏర్పడితే ఆ పరిస్థితిని పాకిస్థాన్ ఉపయోగించుకునే అవకాశం ఉందని అమిత్ షాకు చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.


నవజోత్ సింగ్ సిద్ధూకు పీసీసీ చీఫ్ పదవి ఇచ్చిన తర్వాతి నుంచి అమరీందర్ సింగ్ పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన మాట కూడా వినకుండా సిద్ధూకు ఆ పదవి అప్పజెప్పడంపై బహిరంగ విమర్శలు చేశారు. అనంతరం సీఎం పదవికి రాజీనామా చేశారు.


సిద్ధూతో చర్చలు..


మరోవైపు నవజోత్ సింగ్ సిద్ధూతో చర్చలు జరపడానికి కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించింది. ఇందులో భాగంగా సిద్ధూతో.. పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ చర్చలు జరపుతున్నారు. ఈ మేరకు సిద్ధూ ట్వీట్ చేశారు.






Also Read:Punjab Congress crisis: కాంగ్రెస్ అధిష్ఠానం బుజ్జగింపులు.. సిద్ధూతో పంజాబ్ సీఎం భేటీ!


Also Read: ISIS Terrorist: కబాబ్ మార్చిన కథ.. ఏకంగా ఐసిస్ ఉగ్రవాదినే పట్టించేసింది!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి