ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ట్రిపుల్ ఐటీ (IIIT) కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఆర్జీయూకేటీ సెట్‌ (AP RGUKT CET)- 2021 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఒంగోలులోని ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆర్జీయూకేటీ సెట్‌ ఫలితాలను విడుదల చేశారు. సెప్టెంబర్‌ 26న ఆర్జీయూకేటీ సెట్‌ పరీక్ష నిర్వహించారు. ఆఫ్‌లైన్ విధానంలో జరిగిన ఈ పరీక్షకు 75,283 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్ష జరిగిన 10 రోజుల్లోనే ఏపీ విద్యాశాఖ ఫలితాలు విడుదల చేయడం విశేషం. ఆర్జీయూకేటీ సెట్‌ పరీక్ష రాసిన అభ్యర్థులు https://www.rgukt.in/ వెబ్‌సైట్‌ ద్వారా తమ మెరిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 


టాప్ 5 ర్యాంకర్లు వీరే..


ఏపీ ఆర్జీయూకేటీ సెట్‌ ఫలితాల్లో అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన ఎం.గుణశేఖర్ మొదటి ర్యాంకు సాధించాడు. వైఎస్ఆర్ జిల్లా మైదుకూరుకు చెందిన శ్రీచక్రధరణి రెండో ర్యాంకు, విజయనగరం జిల్లాకు చెందిన ఎం. చంద్రిక మూడో ర్యాంకును దక్కించుకున్నారు. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగుకు చెందిన వెంకటసాయి సుభాష్‌ నాలుగో ర్యాంకు, తూర్పు గోదావరి జిల్లా మండపేటకు చెందిన జి. మనోజ్ఞ ఐదో ర్యాంకునే కైవసం చేసుకున్నారు. 


Also Read: పీజీ చదివే వారి కోసం యూజీసీ స్కాలర్‌షిప్‌‌లు.. నవంబర్ 30లోగా దరఖాస్తు చేసుకోండి..


మార్కుల ఆధారంగా కౌన్సెలింగ్..
సాధారణంగా ప్రతి సంవత్సరం పదో తరగతి పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా విద్యార్థులకు ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అయితే ఈ ఏడాది కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం టెన్త్ పరీక్షలు నిర్వహించలేదు. దీంతో ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం ప్రత్యేక పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహించి విద్యార్థులకు సీట్లు కేటాయిస్తామని ప్రకటించింది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ఏపీలోని నూజివీడు, ఒంగోలు, ఇడుపులపాయ, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలు కల్పిస్తుంది. అర్హులైన వారు 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించిన.. ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశం పొందుతారు. 


ఫలితాల డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..


Also Read: విద్యార్థుల కోసం స్కాల‌ర్‌షిప్స్.. వచ్చే నెలతో ముగియనున్న గడువు..


ఏపీలో పాఠశాలలకు 9 రోజులు దసరా సెలవులు.. 
ఏపీలో పాఠశాలలకు అక్టోబర్ 11 నుంచి 16వ తేదీ వరకు దసరా సెలవులు ఇవ్వనున్నారు. తిరిగి అక్టోబర్ 18న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. గతంలో స్కూళ్లకు దసరా సెలవులను 6 రోజులుగా ప్రభుత్వం ప్రకటించగా.. 9వ తేదీ రెండో శనివారం, ఆ తర్వాత ఆదివారం రావడంతో సెలవుల సంఖ్య పెరిగింది. దీంతో అక్టోబర్ 8 వరకే పాఠశాలలు పని చేయనున్నాయి. అక్టోబర్ 17 ఆదివారం కావడంతో పాఠశాలలు 18వ తేదీన పున:ప్రారంభం కానున్నాయి. అంటే అక్టోబర్ 9 నుంచి 17వ తేదీ వరకు (9 రోజులు) పాఠశాలలకు దసరా సెలవులు ఉంటాయి. 


Also Read: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. బీటెక్‌లో బ్రేక్‌ స్టడీ.. జేఎన్‌టీయూ కీలక నిర్ణయం..


Also Read: ఏపీ గ్రూప్ -1 అభ్యర్ధులకు గుడ్ న్యూస్.. మెయిన్ పేపర్లు మాన్యువల్ పద్దతిలో దిద్ది ఫలితాలు ప్రకటించాలన్న హైకోర్టు ! 



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి