టీమ్‌ఇండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంకా బెట్టు వీడలేదా? వన్డే సారథ్యం నుంచి తొలగించిన బాధలోనే ఉన్నాడా? అందుకే బీసీసీఐ అధికారుల కాల్స్‌కు బదులివ్వడం లేదా? ఉద్దేశపూర్వకంగానే ముంబయిలోని క్వారంటైన్ కేంద్రానికి రావడం లేదా? అంటే ఆటగాళ్లు, అధికారులు ఏమంటున్నారంటే..!
డిసెంబర్ 16 టీమ్‌ఇండియా దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరనుంది. ఈ లోపు ఆటగాళ్లకు బీసీసీఐ ముంబయిలోనే మూడు రోజుల క్వారంటైన్ శిబిరం ఏర్పాటు చేసింది. ఆటగాళ్లంతా దీనికి హాజరైనా విరాట్ మాత్రం ఇంకా రాలేదు. నిజానికి అతడు ఆదివారం నాటి ప్రాక్టీస్ సెషన్‌కు హాజరవ్వాల్సింది. కానీ రాలేదు. సోమవారం నుంచి క్వారంటైన్ శిబిరం మొదలవ్వగా దానికీ రాలేదు. కెప్టెన్సీ తొలగించిన బాధలోంచి అతడింకా తేరుకోలేదని సోషల్ మీడియాలో అంటున్నారు. మరికొందరేమో అతడు బెట్టవీడలేదని పేర్కొంటున్నారు.
సోషల్ మీడియాలో వస్తున్నదంతా అవాస్తవమేనని ఆటగాళ్లు, బీసీసీఐ అధికారులు స్పష్టత ఇస్తున్నారు. 'విరాట్ కోహ్లీ సోమవారమే క్వారంటైన్ శిబిరానికి రావాల్సింది. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల మంగళవారం నుంచి వస్తానని అతడు మాకు సమాచారం ఇచ్చాడు' అని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. ఇక విరాట్, రోహిత్ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆటగాళ్లు చెబుతున్నారు.
'వివాదమా? వారిద్దరి మధ్య ఎలాంటి సమస్యల్లేవు. బయట వచ్చేవన్నీ వండివార్చినవే! వారిద్దరూ ప్రొఫెషనల్‌గా ఉంటారు. పరస్పరం గౌరవించుకుంటారు. జట్టు సభ్యులంతా విరాట్ భాయ్‌ని గౌరవిస్తారు. అతడింకా శిబిరానికి రావాల్సి ఉంది' అని ముంబయిలోని హోటల్లోని ఉన్న ఓ ఆటగాడు పేర్కొన్నాడు.
'విరాట్ కచ్చితంగా సమాచారం ఇస్తాడు. కానీ అతడింకా శిబిరానికి రాలేదు. బహుశా మంగళవారం వస్తాడు. జోహనెస్ బర్గ్‌కు బయల్దేరే ముందు జట్టంతా మూడు రోజులు క్వారంటైన్‌లో ఉంటారు. అయినా కోహ్లీ మా కాల్స్‌ను ఎందుకు ఇగ్నోర్ చేస్తాడు? అతడో ప్రొఫెషనల్ క్రికెటర్. త్వరలోనే శిబిరానికి వస్తాడు. మరో విషయం.. అతడు మా కాల్స్‌కు సమాధానం ఇస్తాడు' అని బీసీసీఐ అధికారి తెలిపారు.
Also Read: Ganguly on IPL 2022:: ఒమిక్రాన్‌పై గంగూలీ కామెంట్స్..! వచ్చే ఐపీఎల్‌ను...?
Also Read: Rohit Sharma Update: బయటి మాటల్ని పట్టించుకోం.. బలమైన బంధమే ముఖ్యమన్న రోహిత్
Also Read: India's Tour Of South Africa: ఈ నలుగురూ ఆడితే దక్షిణాఫ్రికా టూర్‌లో భారత్‌కు తిరుగులేదు.. ఎవరంటే?
Also Read: Pushpa Event: పుష్ప ఈవెంట్లో ‘థ్యాంక్యూ వార్నర్’.. అల్లు అర్జున్ రియాక్షన్ ఏంటంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి