డబుల్ సెంచరీ అంటే మనందరికీ గుర్తొచ్చే పేరు రోహిత్ శర్మ! ఒకటీ రెండూ కాదు వన్డే క్రికెట్లో ఏకంగా మూడుసార్లు ద్విశతకాలు అందుకొన్నాడు. ప్రపంచ క్రికెట్లో మరెవ్వరికీ లేని ఘనత దక్కించుకున్నాడు. యాదృచ్ఛికంగా అతడి పెళ్లిరోజైన డిసెంబర్ 13నే మూడో డబుల్ సెంచరీ చేయడం గమనార్హం.
శ్రీలంక 2017లో భారత్‌లో పర్యటించింది. మొహాలి వేదికగా టీమ్‌ఇండియాతో రెండో వన్డేలో తలపడింది. ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఏకంగా 392/4 పరుగులు చేసింది. అందుకు ఓపెనర్ రోహిత్ శర్మ విధ్వంసకర ఇన్నింగ్సే కారణం. కేవలం 153 బంతుల్లోనే 13 బౌండరీలు, 12 సిక్సర్లు బాదేసి 208 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ పోరులో అతడికి దూకుడుకు లంకేయులు బిత్తరపోయారు! ఏడుగురు బౌలర్లను మార్చినా ఫలితమేమీ మారలేదు. హిట్‌మ్యాన్ ఊచకోతలో తేడా రాలేదు.
నిజానికి ఈ మ్యాచులో రోహిత్ కన్నా ముందు శిఖర్ ధావనే అర్ధశతకం అందుకున్నాడు. 47 బంతుల్లో 50 పరుగులు చేశాడు. రోహిత్ అర్ధశతకం అందుకోవడానికి 65 బంతులు తీసుకున్నాడు. తొలి వికెట్‌కు 115 పరుగుల భాగస్వామ్యం అందించాడు. వన్‌డౌన్‌లో శ్రేయస్ అయ్యర్ వచ్చాక హిట్‌మ్యాన్ మరింత రెచ్చిపోయాడు. 115 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్నాడు. అప్పటికి అతడు కొట్టిన సిక్సర్లు 1, బౌండరీలు 9. అక్కడి నుంచి మరో 1 బౌండరీ, 6 సిక్సర్లు బాదేసి మరో 18 బంతుల్లోనే 150 అందుకున్నాడు. ఆ తర్వాత ద్విశతకం అందుకోవడానికి ఎక్కువ టైం తీసుకోలేదు. అక్కడే స్టాండ్స్‌లో ఉన్న రితికా సజ్దెకు వెంటనే ఫ్లయింగ్ కిసెస్ పంపించి పెళ్లిరోజు గిఫ్ట్ ఇచ్చేశాడు!!
Also Read: Ganguly on IPL 2022:: ఒమిక్రాన్‌పై గంగూలీ కామెంట్స్..! వచ్చే ఐపీఎల్‌ను...?
Also Read: Rohit Sharma Update: బయటి మాటల్ని పట్టించుకోం.. బలమైన బంధమే ముఖ్యమన్న రోహిత్
Also Read: India's Tour Of South Africa: ఈ నలుగురూ ఆడితే దక్షిణాఫ్రికా టూర్‌లో భారత్‌కు తిరుగులేదు.. ఎవరంటే?
Also Read: Pushpa Event: పుష్ప ఈవెంట్లో ‘థ్యాంక్యూ వార్నర్’.. అల్లు అర్జున్ రియాక్షన్ ఏంటంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి