ఇరవైఒక్కేళ్ల తరువాత హర్నాజ్ సంధు భారతావనికి విశ్వసుందరి కిరీటాన్ని అందించింది. ఇప్పటికి మూడేసార్లు మన దేశం మిస్ యూనివర్స్ వేదికపై విజేతగా నిలిచింది. 1994లో తొలిసారి మనదేశం నుంచి సుస్మితాసేన్ మిస్ యూనివర్స్‌గా సత్తాచాటింది.  తరువాత 2000లో లారా దత్తా ఆ కిరీటాన్ని ధరించి భారతావని కీర్తిని పెంచింది. ఆ తరువాత 21 ఏళ్ల విరామం. ఇప్పుడు హర్నాజ్ కౌర్ సంధు మరోసారి విశ్వసుందరి కిరీటాన్ని స్వదేశానికి సాధించిపెట్టింది. ఇప్పుడు హర్నాజ్ పేరు మనదేశంలోనే కాదు ప్రపంచమంతా ట్రెండవుతోంది. 


అన్నగా గర్వపడుతున్నా...
హర్నాజ్ కుటుంబాన్ని ఇప్పటికే మీడియా కలిసింది. ఈ సందర్భంగా ఆమె అన్నయ్య హర్నూర్ మీడియాతో మాట్లాడుతూ తన చెల్లెలి విజయం సాధారణమైనది కాదని, అన్నగా గర్వపడుతున్నానని చెప్పారు. ‘ఆమెకు మోడలింగ్, నటన, డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని నాకు తెలుసు. ఇప్పుడు బ్యూటీ క్వీన్‌గా తన కలను నిజం చేసుకున్నందుకు ఆనందంగా ఉంది’ అని చెప్పారాయన. హర్నూర్ వీడియో, మ్యూజిక్ ప్రొడ్యూసర్ గా పనిచేస్తున్నాడు.


చెల్లికి అన్న పెట్టిన పేరు
‘హర్నాజ్ నా కన్నా చాలా చిన్నపిల్ల. మా ఇద్దరకీ ఏడేళ్ల తేడా. ఆమె ముద్దు పేరు క్యాండీ. ఆ పేరే నేనే పెట్టా. మా ముద్దుల క్యాండీ మమ్మల్ని గర్వపడేలా చేసింది’అంటూ మురిసిపోతున్నాడు. హర్నాజ్ చాలా ఫన్ లవింగ్ గర్ల్ అని ఈత, గుర్రపు స్వారీని కూడా చాలా ఇష్టపడుతుందని తెలిపారాయన. బాలీవుడ్లోని పాపులర్ పాటలకు అదరగొట్టేలా డ్యాన్సు వేస్తుందట ఈ విశ్వ సుందరి. ఆమె ఏం చేసినా తమ కుటుంబం నుంచి పూర్తి మద్దతు ఉంటుందని చెబుతున్నాడు హర్నూర్. . తన చెల్లి చక్కగా వంట కూడా చేస్తుందని, సమయం దొరికినప్పుడల్లా ఇంట్లోవారికి టేస్టీగా వండి పెడుతుందని చెప్పారు. ప్రస్తుతం హర్నాజ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో పీజీ చేస్తోంది. 


Read Also: అందమా అందమా.. టైటిల్ అందకుంటే న్యాయమా.. భారత్ నుంచి మిస్ వరల్డ్‌ విజేతలు వీరే..
Read Also: విశ్వ వేదికపై సత్తా చాటిన ఇండియన్ బ్యూటీస్ వీరే.. భారత్‌కు ముచ్చటగా మూడో మిస్ యూనివర్స్ టైటిల్
Read Also: విశ్వసుందరిగా భారతీయ అందం హర్నాజ్ సంధు... 21 ఏళ్ల విరామం తరువాత తీరిన కల
Read Also: హర్నాజ్ కౌర్ సంధు... విశ్వ వేదికపై మెరిసిన పంజాబీ అందం
Read Also: ఆ సమాధానమే 21 ఏళ్ల తర్వాత 'విశ్వసుందరి' టైటిల్ తెచ్చిపెట్టింది!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి