భారతీయ అందం, పంజాబ్‌కు చెందిన హర్నాజ్ కౌర్ సంధు విశ్వవేదికపై సత్తా చాటారు. 21 ఏళ్ల అనంతరం భారతీయుల కలను సాకారం చేశారు. ఇజ్రాయెల్ వేదికగా జరిగిన మిస్ యూనివర్స్ పోటీలలో హర్నాజ్ సంధు విజేతగా నిలిచారు. 80 దేశాలకు చెందిన అందగత్తెలను వెనక్కి నెట్టి మరీ మిస్ యూనివర్స్ 2021 టైటిల్ సాధించారు ఈ పంజాబీ బ్యూటీ హర్నాజ్ సంధు.
పంజాబీ బ్యూటీ హర్నాజ్ 2019లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ ను గెలుచుకున్నారు. 2021లో ప్రతిష్థాత్మకమైన ‘మిస్ దివా 2021’ అవార్డును సాధించడంతో ఆమె కాన్ఫిడెన్స్ ఓ రేంజ్‌కు వెళ్లింది. అందంతో పాటు ఆత్మవిశ్వాసం, మంచి చేయాలన్న ఆలోచన, సమాజం పట్ల బాధ్యతతో మిస్ యూనివర్స్ 2021 టైటిల్ గెలిచేందుకు హర్నాజ్ సంధుకు దోహదం చేశాయి. విశ్వసుందరిగా నిలిచిన హర్నాజ్ ఇకపై న్యూయార్క్ లో నివాసం ఉండబోతున్నారు.
విశ్వ వేదికపై ముచ్చటగా మూడోసారి..
భారత్‌కు విశ్వ సుందరి కిరీటం దక్కడం ఇదే తొలిసారి కాదు. గతంలో 2000 సంవత్సరంలో బాలీవుడ్ నటి లారాదత్తా మిస్ యూనివర్స్ టైటిల్ కేవలం చేసుకున్నాక భారత్‌కు 21 ఏళ్ల అనంతరం 21 ఏళ్ల మోడల్, నటి హర్నాజ్ సంధు రూపంలో మరోసారి ఈ టైటిల్ వరించింది. భారత్‌కు ఇప్పటివరకూ మూడు విశ్వసుందరి కిరీటాలు వచ్చాయి. తొలిసారి సుస్మితా సేన్ రూపంలో భారత్‌కు మిస్ యూనివర్స్ టైటిల్ లభించింది. 1994లో 18 ఏళ్ల వయసులో సుస్మితా సేన్ భారత్ నుంచి తొలి మిస్ యూనివర్స్‌గా నిలిచారు. 2000లో లారా దత్తా, తాజాగా హర్నాజ్ కౌర్ సంధు విశ్వసుందరి కిరీటాన్ని కైవసం చేసుకున్నారు.
- 1994: మిస్ యూనివర్స్‌గా నటి సుస్మితా సేన్
- 2000: మిస్ యూనివర్స్‌గా లారాదత్తా
- 2021: మిస్ యూనివర్స్‌గా నటి హర్నాజ్ సంధు
Also Read: Miss Universe 2021: విశ్వసుందరిగా భారతీయ అందం హర్నాజ్ సంధు... 21 ఏళ్ల విరామం తరువాత తీరిన కల
Also Read: Miss Universe2021: హర్నాజ్ కౌర్ సంధు... విశ్వ వేదికపై మెరిసిన పంజాబీ అందం