నీరు మన శరీరానికి జీవనాధారం. శరీరంలోని కణాలకు పోషకాలు అందించడానికి, ఆక్సిజన్‌ను తీసుకెళ్లడానికి, టాక్సిన్స్‌ను బయటకు పంపడానికి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి నీరు అత్యవసరం. పురాతన భారతీయ వైద్య విధానం అయిన ఆయుర్వేదం మాత్రం మనుషులు సరైన పద్ధతిలో నీళ్లు తాగడం లేదని చెబుతోంది. నీరు పద్దతి ప్రకారం తాగకపోతే జీర్ణక్రియకు తీవ్ర అంతరాయం కలుగుతుందని అంటోంది. నీరు తాగే ఆరోగ్యకరమైన పద్దతులను వివరిస్తోంది. 


ఇలా చేస్తే జీర్ణక్రియకు అంతరాయం
పోషకాల శోషణకు ఆహారం సరిగ్గా జీర్ణం కావడం చాలా అవసరం. భోజనాన్ని ప్రారంభించే ముందు అధికంగా తీరు తాగడం లేదా భోజనం మధ్యలో నీళ్లు, కూల్ డ్రింకులు తాగడం వంటివి చేయకూడదు. అంతేకాదు భోజనం తింటున్నప్పుడు మధ్యమధ్యలో నీటిని తాగుతుండడం వల్ల ఊబకాయం కూడా వచ్చే అవకాశం ఉంది. భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియలో ఉన్న శక్తి చల్లబడేలా చేస్తుంది. దీనివల్ల ఆహారం త్వరగా జీర్ణంకాదు. 


నీళ్లు తాగే పద్దతి ఇది
1. గ్లాసు నీటిని గటగటా తాగేయకూడదు. నెమ్మదిగా సిప్ చేయాలి. 
2. భోజనం తినడానికి ముందు, తిన్న వెంటనే  తాగకూడదు. ఇవి జీర్ణరసాలను పలుచన చేస్తుంది. దీనివల్ల జీర్ణ క్రియ సక్రమంగా సాగదు. ఆహారం నుంచి పోషకాలను జీర్ణం చేయడం లేదా గ్రహించడం కష్టమవుతుంది. 
3. భోజనానికి దాదాపు అరగంట ముందు నీళ్లు తాగాలి, భోజనం తిన్న అరగంట తరువాత నీళ్లు తాగాలి. మధ్యలో మరీ తాగాల్సి వస్తే కొంచెం సిప్ చేయాలి. 
4. గోరువెచ్చని నీటిని తాగితే జీర్ణం బాగా అవుతుంది.  


ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.


Read also: విశ్వసుందరిగా భారతీయ అందం హర్నాజ్ సంధు... 21 ఏళ్ల విరామం తరువాత తీరిన కల
Read also: బ్రౌన్ రైస్, వైట్ రైస్, బాస్మతి రైస్... డయాబెటిస్ ఉన్న వారికి ఏ బియ్యం బెటర్
Read also: కరోనా సోకితే ఈ ఆహారపదార్థాలు దూరం పెట్టాలి... తిన్నారో అంతే సంగతులు
Read also: పొట్ట నిండా లాగించాక అసౌకర్యంగా ఉందా... ఇలా చేయండి
Read also:  థర్డ్ వేవ్ ఒమిక్రాన్‌ రూపంలోనే రాబోతోందా? ఈ వేరియంట్‌ను తట్టుకోవాలంటే బూస్టర్ డోస్ అవసరమా.. అధ్యయనంలో ఏముంది!



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి