ముంబయి టెస్టులో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (146 బ్యాటింగ్‌; 306 బంతుల్లో 16x4, 4x6) అదరగొడుతున్నాడు. డబుల్‌ సెంచరీ వైపు దూసుకుపోతున్నాడు. న్యూజిలాండ్‌ బౌలర్లను ఆటాడుకుంటున్నాడు! అతడికి అక్షర్‌ పటేల్‌ (32 బ్యాటింగ్‌; 98 బంతుల్లో 4x4) అండగా నిలవడంతో రెండో రోజు లంచ్‌ విరామానికి కోహ్లీసేన 285/6తో నిలిచింది.


ఓవర్‌నైట్‌ స్కోరు 221/4తో టీమ్‌ఇండియా రెండో రోజు బ్యాటింగ్‌ ఆరంభించింది. కానీ కివీస్‌ హీరో అజాజ్‌ పటేల్‌ మళ్లీ చెలరేగాడు. ఓకే ఓవర్లో వరుస బంతుల్లో జట్టు స్కోరు 224 వద్ద రెండు వికెట్లు తీశాడు. 71.4వ బంతికి నైట్‌ వాచ్‌మన్‌ వృద్ధిమాన్‌ సాహా (27; 62 బంతుల్లో 3x4, 1x6)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ తర్వాతి బంతికి క్రీజులోకి వచ్చిన రవిచంద్రన్‌ అశ్విన్‌ (0)ను క్లీన్‌బౌల్డ్‌ చేసి షాకిచ్చాడు. అక్కడి నుంచి అక్షర్‌ పటేల్‌తో కలిసి మయాంక్‌ నిలకడగా ఆడాడు. స్పిన్‌ను చక్కగా ఎదుర్కొన్నాడు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు అజేయంగా 61 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దాంతో కోహ్లీసేన కాస్త పుంజుకొంది.






Also Read: Kohli ODI Captaincy: మోదీ ప్రభుత్వం ఓకే అనేస్తే..! కోహ్లీ వన్డే కెప్టెన్సీకి గుడ్‌బై!


Also Read: India South Africa Tour: అమ్మో.. భయం! ఒమిక్రాన్‌ భయంతో దక్షిణాఫ్రికా వెళ్లేందుకు జంకుతున్న క్రికెటర్లు!


Also Read: Ind vs NZ, 2nd Test Match Highlights: పటేల్‌ స్పిన్‌ దెబ్బకు.. మయాంక్‌ 'ప్రతిఘాత్‌'! టీమ్‌ఇండియా 221/4


Also Read: Ind vs NZ, 2nd Test: థర్డ్ అంపైరా.. థర్డ్ క్లాస్ అంపైరా.. కోహ్లీ అవుట్ కావడంపై మండిపడుతున్న నెటిజన్లు


Also Read: Ganguly on Laxman: హైదరాబాద్‌ను వదిలేస్తున్న వీవీఎస్‌.. మా లక్ష్మణ్‌ బంగారం అంటున్న గంగూలీ!


Also Read: Srikanth Kidambi: గత మూడువారాల్లో ఎంతో నేర్చుకున్నా.. తర్వాతి లక్ష్యం అదే :కిడాంబి శ్రీకాంత్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి