జవాద్ తుపాను బలహీన పడుతున్నట్టు భారత్ వాతావరణ శాఖ ప్రకటించింది. ముందస్తు జాగ్రత్తగా ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ బలగాలు మోహరించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. క్రమంగా బలహీన పడుతున్న తుపాను.. డిసెంబర్‌ ఐదున అల్పపీడనంగా మారి తీరం దాట వచ్చని స్పష్టం చేసింది. 


జవాద్ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో విశాఖపట్నానికి ఆగ్నేయంగా 230 కిలోమీటర్ల దూరంలో గోపాల్‌పూర్‌కు దక్షిణంగా 340 కిలోమీటర్లదూరంలో పూరికి నైరుతి దిశలో 410 కిలోమీటర్ల దూరంలో పారాదీప్‌కు నైరుతి దిశలో 490 కిలోమీటర్ల దూరంవో కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. 






జవాద్‌ తుపాను క్రమంగా బలహీనపడుతోంది. సుమారు 12 గంటల్లో ఉత్తరంవైపుగా కదులుతూ ఉత్తర ఈశాన్య దిశగా ఒడిశాలో తీరం దాటనుంది. డిసెంబరు 5 మధ్యాహ్నానికి తీవ్ర అల్పపీడనంగా పూరీ సమీపంలోకి చేరుకునే ఛాన్స్ ఉంది. ఇది మరింత బలహీనపడి ఉత్తర-ఈశాన్య దిశగా పశ్చిమ బెంగాల్ తీరం వైపు వెళ్లే అవకాశం ఉందని IMD ప్రకటించింది. 






తుపాను ముప్పు ఉన్న ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో ఎన్జీఆర్‌ఎఫ్‌ పటిష్ట చర్యలు చేపట్టింది. 11 ఎన్డీఆర్‌ఎఫ్‌, 5 ఎస్డీఆర్‌ఎఫ్‌, 6 కోస్ట్‌ గార్డు, 10 మెరైన్ పోలీస్ టీమ్‌లను రంగంలోకి దింపింది. జవాద్త్ కారణంగా ముందస్తు చర్యల్లో భాగంగా రెస్క్యూ టీంలను మోహరించింది. ఇప్పటికే 54వేల8 మంది లోతట్టు ప్రాంతాల నుంచి శిబిరాలకు తరలించారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ముందస్తు చర్యలు చేపట్టినట్టు అధికారులు ప్రకటించారు. 






Also Read: తరలిపోయిన ఉమ్మడి రాష్ట్ర దిగ్గజ నేత.. మాజీ సీఎం రోశయ్య కన్నుమూత !