ప్రతి ఐసీసీ ప్రపంచకప్‌ను టీమ్‌ఇండియానే గెలవలేదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అంటున్నాడు. కొన్నిసార్లు ప్రపంచకప్‌ల మధ్య ఎడబాటు రావడం సహజమేనని పేర్కొన్నాడు. 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత భారత్ మరో ఐసీసీ ట్రోఫీ గెలవలేదన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చాడు. ఏబీపీ న్యూస్‌కు దాదా ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చాడు.
'ప్రతిసారీ టీమ్‌ఇండియానే గెలుస్తుందని కాదు. సహజంగానే కొన్నిసార్లు ప్రపంచకప్ విజయాల మధ్య ఎడబాటు వస్తుంది. 2011, 2007 ప్రపంచకప్‌లను భారత్ గెలిచింది. 2003, 2014 ప్రపంచకప్ ఫైనళ్లు ఆడింది. 2017లోనూ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఆడాం. కానీ పాక్ చేతిలో ఓడాం. భారత క్రికెట్ జట్టు చాలా బలంగా ఉంది. మేం నిలకడగా ఫైనళ్లు చేరుకుంటున్నాం. ఈ ఏడాదీ మేం ఫైనల్ చేరగలం. టీమ్‌ఇండియా గట్టి పోటీదారు. కానీ ఏం జరుగుతుందో చూద్దాం' అని గంగూలీ అన్నాడు.
ఆటగాళ్లు ఒత్తిడి చెందొద్దని, తమను తాను ఆవిష్కరించుకోవాలని గంగూలీ సూచనలు ఇచ్చాడు. ఇక పాక్‌పై టీమ్‌ఇండియా ఆధిపత్యం ఐసీసీ ప్రపంచకప్పుల్లో 13-0కు చేరుకొనే అవకాశం ఉందన్నాడు. అప్రతిహతంగా విజయాలు సాధించాలని ధీమా వ్యక్తం చేశాడు. జట్టులో అంతా మ్యాచ్ విన్నర్లేనని, తమ పదేళ్ల ఎదురు చూపులకు ముగింపు పలకగలదని వెల్లడించాడు.
పాక్ జట్టునూ తక్కువ అంచనా వేయకూడదని గంగూలీ అంటున్నాడు. జట్టులో ఒకరిద్దరు క్లిక్ అయితే ఏదైనా జరగొచ్చని అంచనా వేశాడు. ఆట కన్నా ముందు మానసిక యుద్ధాన్ని జయించాలని సూచించాడు. భారత్, పాక్ మ్యాచ్ అద్భుతంగా ఉంటుందని పేర్కొన్నాడు.
Also Read: పాక్‌కు చుక్కలు చూపించే భారత ఆటగాడు అతడే.. మాథ్యూ హెడేన్ అంచనా
Also Read: ఈ క్రికెటర్లు రిచ్చో రిచ్చు! టీ20 ప్రపంచకప్ ఆడేస్తున్న కోటీశ్వరులు వీరే!
Also Read: ఐపీఎల్ క్రేజ్‌కు ఫిదా! కొత్త ఫ్రాంచైజీపై 'మాంచెస్టర్ యునైటెడ్' ఆసక్తి!
Also Read: పాక్‌వి గంభీరమైన ప్రేలాపనలే! దాయాదిపై భారత జైత్రయాత్రకు కారణాలు చెప్పిన వీరూ
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి