ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో సూపర్ 12లో దక్షిణాఫ్రికా అద్భుతం చేసింది. శ్రీలంకపై నాలుగు వికెట్ల తేడాతో విజయ దుందుభి మోగించింది. ఆఖరి వరకు గెలుపు ఆశల్లేని సఫారీ జట్టును కిల్లర్ మిల్లర్ (23*: 13 బంతుల్లో 2x6) వరుసగా రెండు సిక్సర్లు బాదేసి గెలిపించాడు. మొదట పాతుమ్ నిసాంక (72), చరిత్ అసలంక (21) రాణించడంతో లంకేయులు 142 పరుగులు చేశారు. ఛేదనలో తెంబా బవుమా (46: 46 బంతుల్లో 1x4, 1x6) ఆకట్టుకున్నాడు.
మిల్లర్ 'కిల్లింగ్'
షార్జా బౌలింగ్‌కు అనుకూలించడంతో సఫారీలు లక్ష్యం ఛేదించేందుకు కష్టపడ్డారు. ఓపెనర్లు రెజా హెండ్రిక్స్ (11), క్వింటన్ డికాక్ (12)ను ఒకే ఓవర్లో బంతి వ్యవధిలో చమీరా ఔట్ చేశాడు. అప్పటికి స్కోరు 26/2. మరికాసేపటికే డుసెన్ (16) రనౌట్ అవ్వడంతో కెప్టెన్ తెంబా బవుమా గెలుపు భారం మోశాడు. లంకేయుల బౌలింగ్‌లో ఆచితూచి ఆడుతూ బంతికో పరుగు చేశాడు. డుసెన్‌తో మూడో వికెట్‌కు 23, మార్‌క్రమ్ (19)కు నాలుగో వికెట్‌కు 47 పరుగుల భాగస్వామ్యాలు నమోదు చేశాడు. 14.6వ బంతికి మార్క్‌క్రమ్, 17.1కి బవుమా, 17.2కు ప్రిటోరియస్ (0)ను హసరంగ ఔట్ చేసి హ్యాట్రిక్ నమోదు చేశాడు. దాంతో సఫారీలు 12 బంతుల్లో 25 పరుగులు చేయాల్సి వచ్చింది. రబాడ (13*) ఓ సిక్సర్, ఆఖరి ఓవర్లో మిల్లర్ వరుసగా రెండు సిక్సర్లు బాదడంతో దక్షిణాఫ్రికా రెండో విజయం నమోదు చేసింది.
నిసాంక ఒక్కడే!
మొదట బ్యాటింగ్ చేసిన లంకేయులను శంషి (3), ప్రిటోరియస్ (3), నార్జ్ (2) వణికించారు. దాంతో ముగ్గురు తప్ప మిగతా బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. కానీ ఓపెనర్ పాథుమ్ నిసాంక మాత్రం అద్భుతంగా ఆడాడు. మరో వైపు వికెట్లు పడుతున్నా కీలక భాగస్వామ్యాలు నమోదు చేశాడు. తొలి వికెట్‌కు 20, రెండో వికెట్‌కు 40, నాలుగో వికెట్‌కు 15, ఐదో వికెట్‌కు 14, ఐదో వికెట్‌కు 19, ఆరో వికెట్‌కు 21 పరుగుల భాగస్వామ్యాలు అందించాడు. చరిత్ అసలంక, దసున్ శనక (11) అతడికి తోడుగా నిలిచారు.
Also Read: IPL 2022 Retention Rules: కొత్త రూల్స్ ఇవే! ఐపీఎల్ జట్లు ఎంతమందిని అట్టిపెట్టుకోవచ్చంటే..?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి