బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం తుపానుగా మారే అవకాశాలున్నాయని అంచనా వేస్తుంది. అల్పపీడనం ఫలితంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చని తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. తమిళనాడు, శ్రీలంక తీరప్రాంతానికి సమీపంలో అల్పపీడనంతో కొనసాగుతుందని, దీంతో పాటు బంగాళాఖాతంలో నవంబర్ 6న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని ఐఎండీ తెలిపింది. అల్పపీడనం 3-4 రోజుల్లో పశ్చిమ దిశగా ప్రయాణించి బలహీనపడేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
Also Read: రూ.14 వేలలోపే 5జీ ఫోన్.. 108 మెగాపిక్సెల్ కెమెరా వంటి సూపర్ ఫీచర్లు!
మరో అల్పపీడనం
తమిళనాడు తీరానికి దగ్గరగా శ్రీలంక ప్రాంతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఇది సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని తెలిపింది. రాగల 3-4 రోజులలో ఈ అల్పపీడనం పశ్చిమ దిశలో ప్రయాణించే అవకాశం ఉందని పేర్కొంది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు ఉపరితల ద్రోణి కొనసాగి శనివారం బలహీనపడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Also Read: ఎలాన్ మస్క్ బ్రాడ్‌బ్యాండ్ వచ్చేస్తుంది.. తెలుగు రాష్ట్రాల్లో మొదట ఆ పట్టణంలోనే!
వచ్చే మూడు రోజుల్లో భారీ వర్షాలు
ఇవాళ, రేపు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రా, దక్షిణ ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించింది. రాయలసీమలో ఇవాల, రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
Also Read: గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన పసిడి ధర, వెండి కూడా.. మీ ప్రాంతంలో తాజా ధరలివే..