నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలకు ఇంకా ఎలాంటి షెడ్యూల్ , నోటిఫికేషన్ రాలేదు . కానీ రాజకీయ పార్టీలన్నీ అభ్యర్థుల్ని ఖరారు చేసుకుని ప్రచారం  బరిలోకి దిగడమే కాదు.. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల్ని వేధించడం కూడా ప్రారంభించేశాయి. స్థానిక సంస్థల ఎన్నికలు, గత మున్సిపల్ ఎన్నికల్లో అనేక చోట్ల ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులపై అక్రమ కేసులు పెట్టడం, వారి వ్యాపారాలను దెబ్బతీయడం వంటివి చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు నెల్లూరులో ఇంకా అధికారికంగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాక ముందే అవే రిపీట్ అవుతున్నాయి. ఇవి రాజకీయ వివాదానికి కారణం అవుతోంది.


Also Read : డబ్బుల కోసం ఓటర్ల ధర్నాలు ! ప్రజాస్వామ్యం పతనావస్థకు ఇదే సంకేతమా ?


నెల్లూరు కార్పొరేషన్‌ోల 11వ డివిజన్‌కు తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థిగా అల్లారెడ్డి విజయనిర్మలను ఖరారు చేసింది. అధికారికంగా ప్రకటించారు. దీంతో ఆమె ప్రచారం చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే అలా ప్రకటించిన తర్వాతి రోజే ఆమె ఇంటిపై  నెల్లూరు మున్సిపల్ అధికారులు దాడులు చేశారు. ఎందుకంటే ఆమె జీవనోపాధి క్యాటరిం‌గ్ సర్వీస్. వెంటనే ఫు్డ సేఫ్టీ పేరుతో అధికారులు అల్లారెడ్డి విజయనిర్మల ఇంటిపై దాడులు చేసి సోదాలు చేశారు. ఈ విషయం వెంటనే టీడీపీ నేతలందరికీ తెలియడంతో పెద్ద ఎత్తున విజయనిర్మల ఇంటికి చేరుకున్నారు.


Also Read : జగన్‌ది దోపిడీ సర్కార్ - రెండున్నరేళ్ల కంటే ముందే టీడీపీ ప్రభుత్వం ! కుప్పంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు !


నెల్లూరు నగర నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి హుటాహుటిన అభ్యర్థి ఇంటికి వచ్చి హెల్త్ ఆఫీసర్లతో వాగ్వాదానికి దిగారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే తమపై ఇలా దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హెల్త్ అధికారులు వెనక్కి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. టీడీపీ తరపున కార్పొరేషన్ ఎన్నికలలో పోటీచేస్తే ఇలా దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. టీడీపీ నేతలు, కార్యకర్తల జోలికి వస్తే తమ సత్తా చూపిస్తామని హెచ్చరించారు. రోడ్డుపై పడుకొని నిరసన తెలిపారు.


Also Read : వర్క్‌ ఫ్రం హోం కాన్సెప్ట్‌లో గ్రామాల నుంచే పనిచేసే పరిస్థితి రావాలి... వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీలపై సీఎం జగన్ సమీక్ష


నెల్లూరులో వైసీపీ గెలుపును మంత్రి అనిల్ కుమార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆయన నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. తన పరిధిలో క్లీన్ స్వీప్ చేయడమే కాదు.. జిల్లా మంత్రిగా నెల్లూరులో అత్యధిక స్థానాలను గెలిపించాలని లక్ష్యంగా పెట్టుకుని అక్కడే పని చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఓటర్ల కంటే పోటీ చేసే అభ్యర్థుల్ని టార్గెట్ చేసుకుంటే లక్ష్యం సులువు అవుతుందన్న అంచనాకు వచ్చినట్లుగా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 


 


Also Read: అమరావతి రైతుల మహాపాదయాత్రకు హైకోర్టు అనుమతి !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి