ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంకతో జరుగుతున్న మ్యాచులో బంగ్లాదేశ్‌ అదరగొట్టింది. 4 వికెట్లు నష్టోయి 171 పరుగులు చేసింది. ప్రత్యర్థి ముందు కాపాడుకోగల లక్ష్యం నిర్దేశించింది. ఒకవైపు వికెట్లను నిలుపుకుంటూ బంగ్లా పులులు బ్యాటింగ్‌ చేసిన తీరు ఆకట్టుకుంది. ఓపెనర్‌ మహ్మద్‌ నయీమ్‌ (62: 52 బంతుల్లో 6x4), నమ్ముకోదగ్గ ఆటగాడు ముష్ఫికర్‌ రహీమ్‌ (57*: 37 బంతుల్లో 5x4, 2x6) అర్ధశతకాలు చేశారు.


ఆరంభం అదుర్స్‌
టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాకు శుభారంభమే దక్కింది. ఓపెనర్లు నయీమ్‌, లిటన్‌ దాస్‌ (16) 40 పరుగుల ఓపెనింగ్‌ భాగస్వామ్యం అందించారు. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని 5.5వ బంతికి లిటన్‌ను ఔట్‌ చేయడం ద్వారా లాహిరు కుమార విడదీశాడు. వన్‌డౌన్‌లో వచ్చిన షకిబ్‌ అల్‌ హసన్‌ (10)ను కరుణరత్నె క్లీన్‌బౌల్డ్‌ చేయడంతో బంగ్లా 56కే రెండు వికెట్లు కోల్పోయింది.






ముషి, నయీమ్‌ సూపర్‌
అప్పుడే వచ్చిన ముష్ఫికర్‌తో నయీమ్‌ సూపర్ భాగస్వామ్యం నెలకొల్పాడు. చక్కని బౌండరీలు బాదుతూ ఈ జోడీ 51 బంతుల్లోనే 73 పరుగులు చేసింది. దాంతో వికెట్లు తీసేందుకు లంక కష్టపడింది. అర్ధశతకం చేసిన నయీమ్‌ను 16.1వ బంతికి కాట్‌ అండ్‌ బౌల్‌తో ఫెర్నాండో పెవిలియన్‌ పంపించాడు. అప్పటికి బంగ్లా స్కోరు 129. దాంతో అఫిఫ్‌ హుస్సేన్‌ (7), మహ్మదుల్లా (10*) అండతో ముష్ఫికర్‌ 32 బంతుల్లోనే అర్ధశతకం చేశాడు. ప్రత్యర్థికి మంచి లక్ష్యం నిర్దేశించాడు.






Also Read: ENG Vs WI, Match Highlights: వెస్టిండీస్‌పై ఇంగ్లండ్ విజయం.. ఆ రికార్డు బ్రేక్!


Also watch: T20 World Cup 2021: పదేళ్ల తర్వాత ప్రపంచకప్‌ గెలిచే సత్తా కోహ్లీసేనకు ఉందా? ధోనీ మెంటారింగ్‌తో లాభం ఏంటి?


Also Read: Virat Kohli Pressmeet: మంటలో పెట్రోల్ పోయను.. మాట్లాడటానికేమీ లేదు.. ప్రెస్‌మీట్‌లో కోహ్లీ ఏమన్నాడంటే?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి