ప్రతి ఏడాది ఎన్నో వింతైన రికార్డులు గిన్నిస్ బుక్ లో రికార్డు అవుతూనే ఉన్నాయి. అలాంటి ఓ వింతైన రికార్డే ‘టోపీలో అత్యధిక గుడ్లు బ్యాలెన్స్’ చేయడం. ఈ రికార్డును సృష్టించాడు ఆఫ్రికాకు చెందిన గ్రెగరీ డాసిల్వా. ఇతను తన టోపీపై ఏకంగా 735 గుడ్లను పెట్టుకుని బ్యాలెన్స్ చేశాడు. ఇంతవరకు ఈ రికార్డును ఎవరూ సాధించలేదు. ఈ ఫీట్ ను గ్రెగరీ చైనాలో ఓ స్పెషల్ షోలో నిర్వహించాడు. దాన్ని వీడియో తీసి గిన్నిస్ వారికి పంపించాడు.
ఒక చిన్న టోపీలో అన్ని గుడ్లు ఎలా పట్టాయని అందరికీ సందేహం రావచ్చు. గ్రెగరీ ఉపయోగించింది చిన్న టోపీ కాదు. చాలా పెద్ద టోపీని తయారుచేసుకుని, ఆ టోపీకి గుడ్లును అతికించాడు గ్రెగరీ. ఇలా గుడ్లను జాగ్రత్తగా అతికించడానికే అతనికి మూడు రోజులు పట్టిందట. గుడ్లను అతికించుకున్న ఆ టోపీని తలపై పెట్టుకుని కాసేపు బ్యాలెన్స్ చేశాడు గ్రెగరీ. ఆ వీడియోను ఇన్ స్టాలో పోస్టు చేస్తే నిమిషాల్లోనే 60 వేలకు పైగా లైకులు, అయిదున్నర లక్షల వ్యూస్ వచ్చాయి. దీన్ని గిన్నిస్ వారు రికార్డుగా గుర్తించి గ్రెగరీ పేరును తమ బుక్ లో నమోదు చేశారు. గత ఏడాది మేలో జాక్ హారిస్ అనే లండన్ వాసి తన చేతి వెనుక 18 గుడ్లను బ్యాలెన్స్ చేసి రికార్డు సృష్టించాడు.
Also read: రోజూ ఇలా పసుపు నీళ్లు తాగితే... ఊహించని ప్రయోజనాలు
Also read: రుచి, వాసనా గుర్తించలేకపోతున్నారా? తేలికగా తీసుకోకండి, కారణాలు ఇవి కావచ్చు
Also read: ఒకే కాన్పులో తొమ్మిది మంది పిల్లలు... రోజుకు వంద డైపర్లు, ఆరు లీటర్ల పాలు
Also read: ఐఫోన్ ఆర్డర్ ఇస్తే... గిన్నెలు తోమే విమ్ సబ్బు పంపించారు, అక్కడే మరో ట్విస్టు కూడా
Also read: రోజూ స్నానం చేయడం అత్యవసరమా? హార్వర్డ్ వైద్యులు ఏం చెబుతున్నారు?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి