వ్యాక్సినేషన్‌లో 100 కోట్ల మైలురాయిని చేరుకొని భారత్ ప్రపంచానికి తన సత్తా చాటిందని ప్రధాని నరేంద్ర మోదీ.. మన్ కీ బాత్‌లో అన్నారు. మన శక్తిసామర్థ్యాలు ప్రపంచానికి చాటిచెప్పామని కొనియాడారు.
అక్టోబర్ 31న జరగనున్న జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని ఈ సందర్భంగా ప్రధాని ప్రస్తావించారు మోదీ. సర్దార్ వల్లబ్‌భాయ్ పటేల్‌ను కీర్తించారు. ప్రపంచ శాంతి కోసం భారత్ విశేషంగా కృషి చేస్తోందన్నారు. ఐరాస శాంతి పరిరక్షక దళాలకు అందిస్తున్న సహకారాన్ని గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుందని చెప్పారు. మెరుగైన జీవన విధానం కోసం యోగాను పాటించేలా భారత్ ప్రోత్సహిస్తోందన్నారు.
వోకల్ ఫర్ లోకల్, మేడ్ ఇన్ ఇండియా నినాదాలతో భారత్ ముందుకు వెళ్తుందన్నారు. రానున్న పండుగల సమయంలో స్థానిక ఉత్పత్తులనే కొనాలని సూచించారు.
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 15 వేల కేసులు నమోదు, 561 మంది మృతి
Also Read: ఈ క్రికెటర్లు రిచ్చో రిచ్చు! టీ20 ప్రపంచకప్ ఆడేస్తున్న కోటీశ్వరులు వీరే!
Also Read: ఐపీఎల్ క్రేజ్‌కు ఫిదా! కొత్త ఫ్రాంచైజీపై 'మాంచెస్టర్ యునైటెడ్' ఆసక్తి!
Also Read: పాక్‌వి గంభీరమైన ప్రేలాపనలే! దాయాదిపై భారత జైత్రయాత్రకు కారణాలు చెప్పిన వీరూ