IND vs PAK LIVE Score: ఐదు వికెట్లు తీసిన కుల్దీప్ - పాకిస్తాన్‌పై 228 పరుగులతో భారత్ విజయం
భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న ఆసియా కప్ 2023 సూపర్-4 మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్
32 ఓవర్లు అయ్యే సరికి పాకిస్తాన్ ఎనిమిది వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. కానీ నసీం షా, హరీస్ రౌఫ్ గాయపడటంతో బ్యాటింగ్‌కు రాలేదు. దీంతో భారత్ 228 పరుగులతో భారీ విజయం సాధించింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ ఐదు వికెట్లు తీసుకున్నాడు.
31 ఓవర్లు అయ్యే సరికి పాకిస్తాన్ ఏడు వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. శార్దూల్ ఠాకూర్ వేసిన ఈ ఓవర్లో రెండు పరుగులు వచ్చాయి. క్రీజులో షహీన్ షా అఫ్రిది, ఫహీం అష్రాఫ్ ఉన్నారు.
ఫహీం అష్రాఫ్ (4: 9 బంతుల్లో)
షహీన్ షా అఫ్రిది (0: 3 బంతుల్లో)
శార్దూల్ ఠాకూర్ : 4-0-16-1
ఇఫ్తికర్ అహ్మద్‌ను అవుట్ చేసి కుల్దీప్ భారత్‌కు ఏడో వికెట్ అందించాడు. 30 ఓవర్లు అయ్యే సరికి పాకిస్తాన్ ఏడు వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. కుల్దీప్ యాదవ్ వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. క్రీజులో షహీన్ షా అఫ్రిది, ఫహీం అష్రాఫ్ ఉన్నారు.
ఫహీం అష్రాఫ్ (2: 3 బంతుల్లో)
షహీన్ షా అఫ్రిది (0: 3 బంతుల్లో)
ఇఫ్తికర్ అహ్మద్ (సి అండ్ బి) కుల్దీప్ యాదవ్ (23: 35 బంతుల్లో, ఒక ఫోర్)
కుల్దీప్ యాదవ్ : 7-0-18-4
29 ఓవర్లు అయ్యే సరికి పాకిస్తాన్ ఆరు వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. క్రీజులో ఇఫ్తికర్ అహ్మద్, ఫహీం అష్రాఫ్ ఉన్నారు.
ఇఫ్తికర్ అహ్మద్ (19: 32 బంతుల్లో)
ఫహీం అష్రాఫ్ (2: 3 బంతుల్లో)
రవీంద్ర జడేజా : 5-0-26-0
కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి షాదాబ్ ఖాన్ అవుటయ్యాడు. 28 ఓవర్లు అయ్యే సరికి పాకిస్తాన్ ఆరు వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. కుల్దీప్ యాదవ్ వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి. క్రీజులో ఇఫ్తికర్ అహ్మద్, ఫహీం అష్రాఫ్ ఉన్నారు.
ఇఫ్తికర్ అహ్మద్ (16: 28 బంతుల్లో)
ఫహీం అష్రాఫ్ (1: 1 బంతి)
షాదాబ్ ఖాన్ (సి) శార్దూల్ ఠాకూర్ (బి) కుల్దీప్ యాదవ్ (6: 10 బంతుల్లో)
కుల్దీప్ యాదవ్ : 6-0-14-3
27 ఓవర్లు అయ్యే సరికి పాకిస్తాన్ ఐదు వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. క్రీజులో ఇఫ్తికర్ అహ్మద్, షాదాబ్ ఖాన్ ఉన్నారు.
ఇఫ్తికర్ అహ్మద్ (15: 26 బంతుల్లో)
షాదాబ్ ఖాన్ (5: 7 బంతుల్లో)
రవీంద్ర జడేజా : 4-0-22-0
26 ఓవర్లు అయ్యే సరికి పాకిస్తాన్ ఐదు వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. కుల్దీప్ యాదవ్ వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి. క్రీజులో ఇఫ్తికర్ అహ్మద్, షాదాబ్ ఖాన్ ఉన్నారు.
ఇఫ్తికర్ అహ్మద్ (14: 22 బంతుల్లో)
షాదాబ్ ఖాన్ (2: 5 బంతుల్లో)
కుల్దీప్ యాదవ్ : 5-0-11-2
25 ఓవర్లు అయ్యే సరికి పాకిస్తాన్ ఐదు వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. క్రీజులో ఇఫ్తికర్ అహ్మద్, షాదాబ్ ఖాన్ ఉన్నారు.
ఇఫ్తికర్ అహ్మద్ (11: 18 బంతుల్లో)
షాదాబ్ ఖాన్ (2: 3 బంతుల్లో)
రవీంద్ర జడేజా : 3-0-18-0
అఘా సల్మాన్‌ను కుల్దీప్ యాదవ్ పెవిలియన్ బాట పట్టించాడు. 24 ఓవర్లు అయ్యే సరికి పాకిస్తాన్ ఐదు వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. కుల్దీప్ యాదవ్ వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి. క్రీజులో ఇఫ్తికర్ అహ్మద్ ఉన్నాడు.
ఇఫ్తికర్ అహ్మద్ (7: 13 బంతుల్లో)
అఘా సల్మాన్ (బి) కుల్దీప్ యాదవ్ (23: 32 బంతుల్లో, రెండు ఫోర్లు)
కుల్దీప్ యాదవ్ : 4-0-8-2
23 ఓవర్లు అయ్యే సరికి పాకిస్తాన్ నాలుగు వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా వేసిన ఈ ఓవర్లో తొమ్మిది పరుగులు వచ్చాయి. క్రీజులో ఇఫ్తికర్ అహ్మద్, అఘా సల్మాన్ ఉన్నారు.
అఘా సల్మాన్ (22: 29 బంతుల్లో, రెండు ఫోర్లు)
ఇఫ్తికర్ అహ్మద్ (7: 13 బంతుల్లో)
రవీంద్ర జడేజా : 2-0-13-0
22 ఓవర్లు అయ్యే సరికి పాకిస్తాన్ నాలుగు వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. కుల్దీప్ యాదవ్ వేసిన ఈ ఓవర్లో ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. క్రీజులో ఇఫ్తికర్ అహ్మద్, అఘా సల్మాన్ ఉన్నారు.
అఘా సల్మాన్ (15: 25 బంతుల్లో, ఒక ఫోర్)
ఇఫ్తికర్ అహ్మద్ (4: 10 బంతుల్లో)
కుల్దీప్ యాదవ్ : 3-0-5-1
21 ఓవర్లు అయ్యే సరికి పాకిస్తాన్ నాలుగు వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. క్రీజులో ఇఫ్తికర్ అహ్మద్, అఘా సల్మాన్ ఉన్నారు.
అఘా సల్మాన్ (15: 23 బంతుల్లో, ఒక ఫోర్)
ఇఫ్తికర్ అహ్మద్ (3: 6 బంతుల్లో)
రవీంద్ర జడేజా : 1-0-4-0
క్రీజులో కుదురుకున్న ఫఖర్ జమాన్‌ను కుల్దీప్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. 20 ఓవర్లు అయ్యే సరికి పాకిస్తాన్ నాలుగు వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. కుల్దీప్ యాదవ్ వేసిన ఈ ఓవర్లో రెండు పరుగులు వచ్చాయి. క్రీజులో ఇఫ్తికర్ అహ్మద్, అఘా సల్మాన్ ఉన్నారు.
అఘా సల్మాన్ (13: 20 బంతుల్లో, ఒక ఫోర్)
ఇఫ్తికర్ అహ్మద్ (1: 3 బంతుల్లో)
ఫఖర్ జమాన్ (బి) కుల్దీప్ యాదవ్ (27: 50 బంతుల్లో, రెండు ఫోర్లు)
కుల్దీప్ యాదవ్ : 2-0-4-1
19 ఓవర్లు అయ్యే సరికి పాకిస్తాన్ మూడు వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా వేసిన ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. క్రీజులో ఫఖర్ జమాన్, అఘా సల్మాన్ ఉన్నారు.
ఫఖర్ జమాన్ (27: 49 బంతుల్లో, రెండు ఫోర్లు)
అఘా సల్మాన్ (12: 19 బంతుల్లో, ఒక ఫోర్)
హార్దిక్ పాండ్యా : 5-0-17-0
18 ఓవర్లు అయ్యే సరికి పాకిస్తాన్ మూడు వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది. కుల్దీప్ యాదవ్ వేసిన ఈ ఓవర్లో ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. క్రీజులో ఫఖర్ జమాన్, అఘా సల్మాన్ ఉన్నారు.
ఫఖర్ జమాన్ (22: 44 బంతుల్లో, ఒక ఫోర్)
అఘా సల్మాన్ (11: 17 బంతుల్లో, ఒక ఫోర్)
కుల్దీప్ యాదవ్ : 1-0-2-0
17 ఓవర్లు అయ్యే సరికి పాకిస్తాన్ మూడు వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా వేసిన ఈ ఓవర్లో ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. క్రీజులో ఫఖర్ జమాన్, అఘా సల్మాన్ ఉన్నారు.
ఫఖర్ జమాన్ (21: 40 బంతుల్లో, ఒక ఫోర్)
అఘా సల్మాన్ (10: 15 బంతుల్లో, ఒక ఫోర్)
హార్దిక్ పాండ్యా : 4-0-11-1
16 ఓవర్లు అయ్యే సరికి పాకిస్తాన్ మూడు వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసింది. శార్దూల్ ఠాకూర్ వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు లభించాయి. క్రీజులో ఫఖర్ జమాన్, అఘా సల్మాన్ ఉన్నారు.
ఫఖర్ జమాన్ (20: 35 బంతుల్లో, ఒక ఫోర్)
అఘా సల్మాన్ (10: 14 బంతుల్లో, ఒక ఫోర్)
శార్దూల్ ఠాకూర్ : 3-0-14-1
15 ఓవర్లు అయ్యే సరికి పాకిస్తాన్ మూడు వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా వేసిన ఈ ఓవర్లో తొమ్మిది పరుగులు లభించాయి. క్రీజులో ఫఖర్ జమాన్, అఘా సల్మాన్ ఉన్నారు.
ఫఖర్ జమాన్ (18: 31 బంతుల్లో, ఒక ఫోర్)
అఘా సల్మాన్ (9: 12 బంతుల్లో, ఒక ఫోర్)
హార్దిక్ పాండ్యా : 3-0-10-1
14 ఓవర్లు అయ్యే సరికి పాకిస్తాన్ మూడు వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. శార్దూల్ ఠాకూర్ వేసిన ఈ ఓవర్లో ఎనిమిది పరుగులు లభించాయి. క్రీజులో ఫఖర్ జమాన్, అఘా సల్మాన్ ఉన్నారు.
ఫఖర్ జమాన్ (17: 28 బంతుల్లో, ఒక ఫోర్)
అఘా సల్మాన్ (7: 9 బంతుల్లో, ఒక ఫోర్)
శార్దూల్ ఠాకూర్ : 2-0-11-1
13 ఓవర్లు అయ్యే సరికి పాకిస్తాన్ మూడు వికెట్ల నష్టానికి 48 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా వేసిన ఈ ఓవర్లో ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. క్రీజులో ఫఖర్ జమాన్, అఘా సల్మాన్ ఉన్నారు.
ఫఖర్ జమాన్ (16: 25 బంతుల్లో, ఒక ఫోర్)
అఘా సల్మాన్ (0: 6 బంతుల్లో)
హార్దిక్ పాండ్యా : 2-0-2-1
శార్దూల్ ఠాకూర్ భారత్‌కు మూడో వికెట్ అందించాడు. మహ్మద్ రిజ్వాన్‌ను పెవిలియన్ బాట పట్టించాడు. 12 ఓవర్లు అయ్యే సరికి పాకిస్తాన్ మూడు వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది. శార్దూల్ ఠాకూర్ వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు మాత్రమే వచ్చాయి. క్రీజులో ఫఖర్ జమాన్, అఘా సల్మాన్ ఉన్నారు.
ఫఖర్ జమాన్ (14: 22 బంతుల్లో, ఒక ఫోర్)
అఘా సల్మాన్ (0: 2 బంతుల్లో)
మహ్మద్ రిజ్వాన్ (సి) కేఎల్ రాహుల్ (బి) శార్దూల్ ఠాకూర్ (2: 5 బంతుల్లో)
శార్దూల్ ఠాకూర్ : 1-0-3-1
వర్షం కాస్త తెరిపిని ఇవ్వడంతో పిచ్‌పై కవర్లను తొలగించారు. మరి కాసేపట్లో ఆట ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. డక్‌వర్త్ లూయిస్ ద్వారా ఫలితం రావాలంటే పాకిస్తాన్ కనీసం 20 ఓవర్లు ఆడాల్సి ఉంటుంది.
మ్యాచ్‌లో భారత్ పైచేయి సాధించిన దశలో వరుణ దేవుడు మళ్లీ తన ప్రతాపం చూపించాడు. స్టేడియంలో వర్షం కారణంగా ఆటను నిలిపివేశారు.
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంను హార్దిక్ పాండ్యా క్లీన్ బౌల్డ్ చేశాడు. 11 ఓవర్లు అయ్యే సరికి పాకిస్తాన్ రెండు వికెట్ల నష్టానికి 44 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా వేసిన ఈ ఓవర్లో ఒక్క పరుగు మాత్రమే వచ్చాయి. క్రీజులో ఫఖర్ జమాన్, మహ్మద్ రిజ్వాన్ ఉన్నారు.
ఫఖర్ జమాన్ (14: 22 బంతుల్లో, ఒక ఫోర్)
మహ్మద్ రిజ్వాన్ (1: 2 బంతుల్లో)
బాబర్ ఆజం (బి) హార్దిక్ పాండ్యా (10: 24 బంతుల్లో, రెండు ఫోర్లు)
హార్దిక్ పాండ్యా : 1-0-1-1
10 ఓవర్లు అయ్యే సరికి పాకిస్తాన్ వికెట్ నష్టానికి 43 పరుగులు చేసింది. మహ్మద్ సిరాజ్ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. క్రీజులో ఫఖర్ జమాన్, బాబర్ ఆజం ఉన్నారు.
ఫఖర్ జమాన్ (14: 22 బంతుల్లో, ఒక ఫోర్)
బాబర్ ఆజం (10: 20 బంతుల్లో, రెండు ఫోర్లు)
మహ్మద్ సిరాజ్ : 5-0-23-0
తొమ్మిది ఓవర్లు అయ్యే సరికి పాకిస్తాన్ వికెట్ నష్టానికి 38 పరుగులు చేసింది. జస్‌ప్రీత్ బుమ్రా వేసిన ఈ ఓవర్లో ఎనిమిది పరుగులు వచ్చాయి. క్రీజులో ఫఖర్ జమాన్, బాబర్ ఆజం ఉన్నారు.
ఫఖర్ జమాన్ (14: 22 బంతుల్లో, ఒక ఫోర్)
బాబర్ ఆజం (5: 15 బంతుల్లో, ఒక ఫోర్)
జస్‌ప్రీత్ బుమ్రా : 5-1-18-1
ఎనిమిది ఓవర్లు అయ్యే సరికి పాకిస్తాన్ వికెట్ నష్టానికి 30 పరుగులు చేసింది. మహ్మద్ సిరాజ్ వేసిన ఈ ఓవర్లో తొమ్మిది పరుగులు వచ్చాయి. క్రీజులో ఫఖర్ జమాన్, బాబర్ ఆజం ఉన్నారు.
ఫఖర్ జమాన్ (11: 20 బంతుల్లో)
బాబర్ ఆజం (0: 10 బంతుల్లో)
మహ్మద్ సిరాజ్ : 4-0-18-0
ఏడు ఓవర్లు అయ్యే సరికి పాకిస్తాన్ వికెట్ నష్టానికి 21 పరుగులు చేసింది. జస్‌ప్రీత్ బుమ్రా వేసిన ఈ ఓవర్లో ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. క్రీజులో ఫఖర్ జమాన్, బాబర్ ఆజం ఉన్నారు.
ఫఖర్ జమాన్ (4: 15 బంతుల్లో)
బాబర్ ఆజం (0: 9 బంతుల్లో)
జస్‌ప్రీత్ బుమ్రా : 4-1-10-1
ఆరు ఓవర్లు అయ్యే సరికి పాకిస్తాన్ వికెట్ నష్టానికి 20 పరుగులు చేసింది. మహ్మద్ సిరాజ్ వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి. క్రీజులో ఫఖర్ జమాన్, బాబర్ ఆజం ఉన్నారు.
ఫఖర్ జమాన్ (3: 14 బంతుల్లో)
బాబర్ ఆజం (0: 4 బంతుల్లో)
మహ్మద్ సిరాజ్ : 3-0-11-0
జస్ప్రీత్ బుమ్రా భారత్‌కు మొదటి వికెట్ అందించాడు. జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఇమామ్ ఉల్ హక్ అవుటయ్యాడు. దీంతో బాబర్ ఆజం క్రీజులోకి వచ్చాడు. ఐదు ఓవర్లు అయ్యే సరికి పాకిస్తాన్ వికెట్ నష్టానికి 17 పరుగులు చేసింది. జస్‌ప్రీత్ బుమ్రా వేసిన ఈ ఓవర్లో ఒక్క పరుగు కూడా రాలేదు. క్రీజులో ఫఖర్ జమాన్, బాబర్ ఆజం ఉన్నారు.
ఫఖర్ జమాన్ (0: 8 బంతుల్లో)
బాబర్ ఆజం (0: 4 బంతుల్లో)
ఇమామ్ ఉల్ హక్ (సి) శుభ్‌మన్ గిల్ (బి) జస్‌ప్రీత్ బుమ్రా (9: 18 బంతుల్లో, ఒక ఫోర్)
జస్‌ప్రీత్ బుమ్రా : 3-1-9-1
నాలుగు ఓవర్లు అయ్యే సరికి పాకిస్తాన్ వికెట్ నష్టపోకుండా 17 పరుగులు చేసింది. మహ్మద్ సిరాజ్ వేసిన ఈ ఓవర్లో రెండు పరుగులు వచ్చాయి. క్రీజులో ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్ ఉన్నారు.
ఫఖర్ జమాన్ (0: 8 బంతుల్లో)
ఇమామ్ ఉల్ హక్ (9: 16 బంతుల్లో, ఒక ఫోర్)
మహ్మద్ సిరాజ్ : 2-0-8-0
మూడు ఓవర్లు అయ్యే సరికి పాకిస్తాన్ వికెట్ నష్టపోకుండా 15 పరుగులు చేసింది. జస్‌ప్రీత్ బుమ్రా వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. క్రీజులో ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్ ఉన్నారు.
ఫఖర్ జమాన్ (0: 8 బంతుల్లో)
ఇమామ్ ఉల్ హక్ (8: 10 బంతుల్లో, ఒక ఫోర్)
జస్‌ప్రీత్ బుమ్రా : 2-0-9-0
రెండు ఓవర్లు అయ్యే సరికి పాకిస్తాన్ వికెట్ నష్టపోకుండా 11 పరుగులు చేసింది. మహ్మద్ సిరాజ్ వేసిన ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. క్రీజులో ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్ ఉన్నారు.
ఫఖర్ జమాన్ (0: 7 బంతుల్లో)
ఇమామ్ ఉల్ హక్ (5: 5 బంతుల్లో)
మహ్మద్ సిరాజ్ : 1-0-6-0
మొదటి ఓవర్ అయ్యే సరికి పాకిస్తాన్ వికెట్ నష్టపోకుండా ఐదు పరుగులు చేసింది. జస్‌ప్రీత్ బుమ్రా వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. క్రీజులో ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్ ఉన్నారు.
ఫఖర్ జమాన్ (0: ఆరు బంతుల్లో)
ఇమామ్ ఉల్ హక్ (0: 0 బంతుల్లో)
జస్‌ప్రీత్ బుమ్రా : 1-0-5-0
50 ఓవర్లు అయ్యే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది. ఫహీం అష్రాఫ్ వేసిన ఈ ఓవర్లో 18 పరుగులు వచ్చాయి.
విరాట్ కోహ్లీ (122: 94 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, మూడు సిక్సర్లు)
కేఎల్ రాహుల్ (111: 106 బంతుల్లో, 12 ఫోర్లు, రెండు సిక్సర్లు)
ఫహీం అష్రాఫ్ : 10-0-74-0
49 ఓవర్లు అయ్యే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. ఓవర్ మధ్యలో నసీం షా గాయపడటంతో ఇఫ్తికర్ అహ్మద్ ఓవర్ పూర్తి చేశాడు. నసీం షా, ఇఫ్తికర్ అహ్మద్ వేసిన ఈ ఓవర్లో ఎనిమిది పరుగులు వచ్చాయి. క్రీజులో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఉన్నారు.
విరాట్ కోహ్లీ (107: 89 బంతుల్లో, ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు)
కేఎల్ రాహుల్ (109: 104 బంతుల్లో, 12 ఫోర్లు, రెండు సిక్సర్లు)
ఇఫ్తికర్ అహ్మద్ : 5.4-0-52-0
విరాట్ కోహ్లీ ఈ ఓవర్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 48 ఓవర్లు అయ్యే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. షహీన్ షా అఫ్రిది వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. క్రీజులో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఉన్నారు.
విరాట్ కోహ్లీ (100: 84 బంతుల్లో, ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు)
కేఎల్ రాహుల్ (108: 103 బంతుల్లో, 12 ఫోర్లు, రెండు సిక్సర్లు)
షహీన్ షా అఫ్రిది : 10-0-79-1
47 ఓవర్లు అయ్యే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. నసీం షా వేసిన ఈ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. క్రీజులో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఉన్నారు.
విరాట్ కోహ్లీ (97: 81 బంతుల్లో, ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు)
కేఎల్ రాహుల్ (100: 100 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లు)
నసీం షా : 9-1-51-0
46 ఓవర్లు అయ్యే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది. షహీన్ షా అఫ్రిది వేసిన ఈ ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. క్రీజులో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఉన్నారు.
విరాట్ కోహ్లీ (88: 77 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్)
కేఎల్ రాహుల్ (97: 98 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లు)
షహీన్ షా అఫ్రిది : 9-0-68-1
45 ఓవర్లు అయ్యే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. ఫహీం అష్రాఫ్ వేసిన ఈ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. క్రీజులో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఉన్నారు.
విరాట్ కోహ్లీ (83: 73 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్)
కేఎల్ రాహుల్ (95: 96 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లు)
ఫహీం అష్రాఫ్ : 9-0-56-0
44 ఓవర్లు అయ్యే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. నసీం షా వేసిన ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. క్రీజులో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఉన్నారు.
విరాట్ కోహ్లీ (80: 71 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్)
కేఎల్ రాహుల్ (84: 92 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లు)
నసీం షా : 8-1-39-0
విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ మూడో వికెట్‌కు 150 పరుగుల భాగస్వామ్యం పూర్తి చేశారు. 43 ఓవర్లు అయ్యే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 280 పరుగులు చేసింది. ఇఫ్తికర్ అహ్మద్ వేసిన ఈ ఓవర్లో తొమ్మిది పరుగులు వచ్చాయి. క్రీజులో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఉన్నారు.
విరాట్ కోహ్లీ (76: 68 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్)
కేఎల్ రాహుల్ (82: 89 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లు)
ఇఫ్తికర్ అహ్మద్ : 5-0-46-0
42 ఓవర్లు అయ్యే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. షహీన్ షా అఫ్రిది వేసిన ఈ ఓవర్లో తొమ్మిది పరుగులు వచ్చాయి. క్రీజులో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఉన్నారు.
విరాట్ కోహ్లీ (63: 64 బంతుల్లో, ఐదు ఫోర్లు)
కేఎల్ రాహుల్ (79: 87 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లు)
షహీన్ షా అఫ్రిది : 8-0-61-1
41 ఓవర్లు అయ్యే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ఇఫ్తికార్ 4 పరుగులు ఇచ్చాడు. క్రీజులో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఉన్నారు.
విరాట్ కోహ్లీ (59: 61 బంతుల్లో, నాలుగు ఫోర్లు)
కేఎల్ రాహుల్ (74: 84 బంతుల్లో, ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు)
40 ఓవర్లు అయ్యే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. ఫహీమ్ 8 పరుగులు ఇచ్చాడు. క్రీజులో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఉన్నారు.
విరాట్ కోహ్లీ (57: 58 బంతుల్లో, నాలుగు ఫోర్లు)
కేఎల్ రాహుల్ (72: 81 బంతుల్లో, ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు)
39 ఓవర్లు అయ్యే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. షాదాబ్ 6 పరుగులు వచ్చాయి. క్రీజులో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఉన్నారు.
విరాట్ కోహ్లీ (50: 78 బంతుల్లో, నాలుగు ఫోర్లు)
కేఎల్ రాహుల్ (71: 78 బంతుల్లో, ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు)
38 ఓవర్లు అయ్యే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. ఈ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. క్రీజులో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఉన్నారు.
విరాట్ కోహ్లీ (49: 73 బంతుల్లో, నాలుగు ఫోర్లు)
కేఎల్ రాహుల్ (66: 73 బంతుల్లో, ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు)
36 ఓవర్లు అయ్యే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ఫహీమ్ వేసిన ఈ ఓవర్లో 3 పరుగులు వచ్చాయి. క్రీజులో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఉన్నారు.
విరాట్ కోహ్లీ (42: 49 బంతుల్లో, మూడు ఫోర్లు)
కేఎల్ రాహుల్ (64: 66 బంతుల్లో, ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు)
35 ఓవర్లు అయ్యే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. షాదాబ్ వేసిన ఈ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. క్రీజులో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఉన్నారు.
విరాట్ కోహ్లీ (40: 44 బంతుల్లో, మూడు ఫోర్లు)
కేఎల్ రాహుల్ (63: 65 బంతుల్లో, ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు)
34 ఓవర్లు అయ్యే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. అఫ్రాప్ వేసిన ఈ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. క్రీజులో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఉన్నారు. రాహుల్ హాఫ్ సెంచరీ అందుకున్నాడు.
విరాట్ కోహ్లీ (38: 42 బంతుల్లో, రెండు ఫోర్లు)
కేఎల్ రాహుల్ (51: 61 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్స్)
33 ఓవర్లు అయ్యే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. ఇఫ్తికార్ వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. క్రీజులో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఉన్నారు.
విరాట్ కోహ్లీ (33: 38 బంతుల్లో, రెండు ఫోర్లు)
కేఎల్ రాహుల్ (49: 59 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్స్)
32 ఓవర్లు అయ్యే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. షాహిన్ అఫ్రీది వేసిన ఈ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. క్రీజులో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఉన్నారు.
విరాట్ కోహ్లీ (28: 35 బంతుల్లో, ఒక ఫోర్)
కేఎల్ రాహుల్ (43: 56 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్స్)
షహీన్ షా అఫ్రిది : 7-0-52-1
31 ఓవర్లు అయ్యే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఇఫ్తికార్ వేసిన ఈ ఓవర్లో పదకొండు పరుగులు వచ్చాయి. క్రీజులో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఉన్నారు.
30 ఓవర్లు అయ్యే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. షహీన్ షా అఫ్రిది వేసిన ఈ ఓవర్లో ఎనిమిది పరుగులు వచ్చాయి. క్రీజులో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఉన్నారు.
విరాట్ కోహ్లీ (22: 30 బంతుల్లో, ఒక ఫోర్)
కేఎల్ రాహుల్ (37: 50 బంతుల్లో, మూడు ఫోర్లు)
షహీన్ షా అఫ్రిది : 6-0-45-0
29 ఓవర్లు అయ్యే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఇఫ్తికర్ అహ్మద్ వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. క్రీజులో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఉన్నారు.
విరాట్ కోహ్లీ (20: 27 బంతుల్లో, ఒక ఫోర్)
కేఎల్ రాహుల్ (25: 46 బంతుల్లో, రెండు ఫోర్లు)
ఇఫ్తికర్ అహ్మద్ : 1-0-4-0
28 ఓవర్లు అయ్యే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. నసీం షా వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి. క్రీజులో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఉన్నారు.
విరాట్ కోహ్లీ (19: 26 బంతుల్లో, ఒక ఫోర్)
కేఎల్ రాహుల్ (22: 41 బంతుల్లో, రెండు ఫోర్లు)
నసీం షా : 7-1-33-0
27 ఓవర్లు అయ్యే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఫహీం అష్రాఫ్ వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి. క్రీజులో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఉన్నారు.
విరాట్ కోహ్లీ (12: 21 బంతుల్లో)
కేఎల్ రాహుల్ (21: 40 బంతుల్లో, రెండు ఫోర్లు)
ఫహీం అష్రాఫ్ : 4-0-18-0
26 ఓవర్లు అయ్యే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. నసీం షా వేసిన ఈ ఓవర్లో రెండు పరుగులు వచ్చాయి. క్రీజులో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఉన్నారు.
విరాట్ కోహ్లీ (10: 19 బంతుల్లో)
కేఎల్ రాహుల్ (20: 36 బంతుల్లో, రెండు ఫోర్లు)
నసీం షా : 6-1-25-0
25 ఓవర్లు అయ్యే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. షాదాబ్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. క్రీజులో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఉన్నారు.
విరాట్ కోహ్లీ (9: 17 బంతుల్లో)
కేఎల్ రాహుల్ (19: 32 బంతుల్లో, రెండు ఫోర్లు)
షాదాబ్ ఖాన్ : 7-1-48-1
భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ 4:40కి ప్రారంభం కానుంది. ఓవర్లలో ఎటువంటి తగ్గింపు లేదు. పూర్తి 50 ఓవర్ల మ్యాచ్ జరగనుంది. కానీ మళ్లీ వరుణుడు ఆటంకం కలిగిస్తాడా లేదా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.
భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌ను వరుణుడు వెంటాడుతూనే ఉన్నాడు. వర్షం కారణంగా ఆదివారం కేవలం 24.1 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యం అయింది. మ్యాచ్‌ను రిజర్వ్‌డే అయిన సోమవారానికి వాయిదా వేశారు. కానీ సోమవారం కూడా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో ఆట ఇంకా ప్రారంభం కాలేదు.
అంపైర్లు పిచ్ ఇన్‌స్పెక్షన్‌కు వెళ్లే సరికి తిరిగి వర్షం ప్రారంభం అయింది. దీని కారణంగా ఆదివారం ఆట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. దీంతో మ్యాచ్ రిజర్వ్ డే రోజు తిరిగి జరగనుంది. ఆట ఆగే సమయానికి 24.1 ఓవర్లకు రెండు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (17 బ్యాటింగ్: 28 బంతుల్లో, రెండు ఫోర్లు), కేఎల్ రాహుల్ (8 బ్యాటింగ్: 16 బంతుల్లో) క్రీజులో ఉన్నారు.
8:30 గంటలకు అంపైర్లు మరోసారి పిచ్‌ను పరీక్షించనున్నారు. పిచ్ పరిస్థితి సరిగ్గా లేని కారణంగా ఆట ప్రారంభించడానికి అంపైర్లు సంకోచిస్తున్నారు.
ఎనిమిది గంటలకు అంపైర్లు పిచ్‌ను పరిశీలించనున్నారు. ఒకవేళ 20 ఓవర్ల మ్యాచ్ సాధ్యం అయితే పాక్ టార్గెట్ 181 పరుగులుగా ఉండవచ్చు.
భారత్, పాకిస్తాన్ ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగింది. వాన కారణంగా ఆట ఆగే సమయానికి భారత్ 24.1 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. వర్షం చాలా భారీగా పడుతుంది.
24 ఓవర్లు అయ్యే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. హరీస్ రౌఫ్ వేసిన ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. క్రీజులో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఉన్నారు.
విరాట్ కోహ్లీ (7: 15 బంతుల్లో)
కేఎల్ రాహుల్ (17: 28 బంతుల్లో, రెండు ఫోర్లు)
హరీస్ రౌఫ్ : 5-0-27-0
23 ఓవర్లు అయ్యే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. షాదాబ్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో ఒక్క పరుగు కూడా రాలేదు. క్రీజులో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఉన్నారు.
విరాట్ కోహ్లీ (6: 13 బంతుల్లో)
కేఎల్ రాహుల్ (13: 24 బంతుల్లో, ఒక ఫోర్)
షాదాబ్ ఖాన్ : 6-1-44-1
22 ఓవర్లు అయ్యే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. హరీస్ రౌఫ్ వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి. క్రీజులో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఉన్నారు.
విరాట్ కోహ్లీ (6: 13 బంతుల్లో)
కేఎల్ రాహుల్ (13: 18 బంతుల్లో, ఒక ఫోర్)
హరీస్ రౌఫ్ : 4-0-21-0
21 ఓవర్లు అయ్యే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. షాదాబ్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో రెండు పరుగులు వచ్చాయి. క్రీజులో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఉన్నారు.
విరాట్ కోహ్లీ (6: 11 బంతుల్లో)
కేఎల్ రాహుల్ (10: 14 బంతుల్లో, ఒక ఫోర్)
షాదాబ్ ఖాన్ : 5-0-44-1
20 ఓవర్లు అయ్యే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. షహీన్ షా అఫ్రిది వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. క్రీజులో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఉన్నారు.
విరాట్ కోహ్లీ (5: 8 బంతుల్లో)
కేఎల్ రాహుల్ (9: 11 బంతుల్లో, ఒక ఫోర్)
షహీన్ షా అఫ్రిది : 5-0-37-1
19 ఓవర్లు అయ్యే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. షాదాబ్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. క్రీజులో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఉన్నారు.
విరాట్ కోహ్లీ (5: 8 బంతుల్లో)
కేఎల్ రాహుల్ (5: 5 బంతుల్లో)
షాదాబ్ ఖాన్ : 4-0-42-1
భారత్ వరుసగా రెండో ఓవర్లో రెండో వికెట్ కోల్పోయింది. షహీన్ షా అఫ్రిది స్లోబాల్‌తో గిల్‌ను బోల్తా కొట్టించాడు. ఇంతకు ముందు ఓవర్లో రోహిత్ శర్మను షాదాబ్ ఖాన్ పెవిలియన్ బాట పట్టించాడు. 18 ఓవర్లు అయ్యే సరికి భారత్ వికెట్ నష్టానికి 124 పరుగులు చేసింది. షహీన్ షా అఫ్రిది వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. క్రీజులో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఉన్నారు.
విరాట్ కోహ్లీ (2: 6 బంతుల్లో)
కేఎల్ రాహుల్ (1: 1 బంతికి)
శుభ్‌మన్ గిల్ (సి) అఘా సల్మాన్ (బి) షహీన్ షా అఫ్రిది (58: 52 బంతుల్లో, 10 ఫోర్లు)
షహీన్ షా అఫ్రిది : 3-0-35-1
భారత్ తన మొదటి వికెట్ కోల్పోయింది. రోహిత్ శర్మను షాదాబ్ ఖాన్ పెవిలియన్ బాట పట్టించాడు. 17 ఓవర్లు అయ్యే సరికి భారత్ వికెట్ నష్టానికి 122 పరుగులు చేసింది. హరీస్ రౌఫ్ వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. క్రీజులో విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ ఉన్నారు.
శుభ్‌మన్ గిల్ (58: 51 బంతుల్లో, 10 ఫోర్లు)
విరాట్ కోహ్లీ (1: 2 బంతుల్లో)
రోహిత్ శర్మ (సి) ఫహీమ్ అష్రాఫ్ (బి) షాదాబ్ ఖాన్ (56: 49 బంతుల్లో, ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లు)
హరీస్ రౌఫ్ : 3-0-35-1
16 ఓవర్లు అయ్యే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా 118 పరుగులు చేసింది. హరీస్ రౌఫ్ వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి. క్రీజులో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఉన్నారు.
శుభ్‌మన్ గిల్ (55: 48 బంతుల్లో, 10 ఫోర్లు)
రోహిత్ శర్మ (56: 48 బంతుల్లో, ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లు)
హరీస్ రౌఫ్ : 3-0-18-0
కేవలం 42 బంతుల్లోనే భారత కెప్టెన్ రోహిత్ శర్మ అర్థసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 15 ఓవర్లు అయ్యే సరికి భారత్ వికెట్ల నష్టపోకుండా 115 పరుగులు చేసింది. షాదాబ్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. క్రీజులో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఉన్నారు.
శుభ్‌మన్ గిల్ (53: 44 బంతుల్లో, 10 ఫోర్లు)
రోహిత్ శర్మ (55: 46 బంతుల్లో, ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లు)
షాదాబ్ ఖాన్ : 2-0-31-0
14 ఓవర్లు అయ్యే సరికి భారత్ వికెట్ల నష్టపోకుండా 103 పరుగులు చేసింది. హరీస్ రౌఫ్ వేసిన ఈ ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. క్రీజులో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఉన్నారు.
శుభ్‌మన్ గిల్ (52: 43 బంతుల్లో, 10 ఫోర్లు)
రోహిత్ శర్మ (44: 41 బంతుల్లో, ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు)
హరీస్ రౌఫ్ : 2-0-15-0
ఈ ఓవర్లో శుభ్‌మన్ గిల్ అర్థ సెంచరీ సాధించాడు. రోహిత్ రెండు సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టాడు. 13 ఓవర్లు అయ్యే సరికి భారత్ వికెట్ల నష్టపోకుండా 96 పరుగులు చేసింది. షాదాబ్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో 19 పరుగులు వచ్చాయి. క్రీజులో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఉన్నారు.
శుభ్‌మన్ గిల్ (50: 37 బంతుల్లో, 10 ఫోర్లు)
రోహిత్ శర్మ (44: 41 బంతుల్లో, ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు)
షాదాబ్ ఖాన్ : 1-0-19-0
12 ఓవర్లు అయ్యే సరికి భారత్ వికెట్ల నష్టపోకుండా 77 పరుగులు చేసింది. హరీస్ రౌఫ్ వేసిన ఈ ఓవర్లో ఎనిమిది పరుగులు వచ్చాయి. క్రీజులో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఉన్నారు.
శుభ్‌మన్ గిల్ (48: 35 బంతుల్లో, 10 ఫోర్లు)
రోహిత్ శర్మ (27: 34 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్)
హరీస్ రౌఫ్ : 1-0-8-0
11 ఓవర్లు అయ్యే సరికి భారత్ వికెట్ల నష్టపోకుండా 69 పరుగులు చేసింది. ఫహీం అష్రాఫ్ వేసిన ఈ ఓవర్లో ఎనిమిది పరుగులు వచ్చాయి. క్రీజులో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఉన్నారు.
శుభ్‌మన్ గిల్ (47: 34 బంతుల్లో, 10 ఫోర్లు)
రోహిత్ శర్మ (20: 32 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్)
ఫహీం అష్రాఫ్ : 3-0-15-0
భారత ఓపెనర్లు మొదటి 10 ఓవర్లలో ఎంతో సాధికారతతో ఆడారు. ముఖ్యంగా శుభ్‌మన్ గిల్ పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 10 ఓవర్లు అయ్యే సరికి భారత్ వికెట్ల నష్టపోకుండా 61 పరుగులు చేసింది. నసీం షా వేసిన ఈ ఓవర్లో ఎనిమిది పరుగులు వచ్చాయి. క్రీజులో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఉన్నారు.
శుభ్‌మన్ గిల్ (41: 30 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు)
రోహిత్ శర్మ (18: 30 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్)
నసీం షా : 5-1-23-0
భారత ఓపెనర్లు మొదటి వికెట్‌కు అర్థ సెంచరీ భాగస్వామ్యం అందించారు. తొమ్మిది ఓవర్లు అయ్యే సరికి భారత్ వికెట్ల నష్టపోకుండా 53 పరుగులు చేసింది. ఫహీం అష్రాఫ్ వేసిన ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. క్రీజులో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఉన్నారు.
శుభ్‌మన్ గిల్ (41: 30 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు)
రోహిత్ శర్మ (10: 24 బంతుల్లో, ఒక ఫోర్ ఒక సిక్సర్)
ఫహీం అష్రాఫ్ : 2-0-7-0
ఎనిమిది ఓవర్లు అయ్యే సరికి భారత్ వికెట్ల నష్టపోకుండా 47 పరుగులు చేసింది. నసీం షా వేసిన ఈ ఓవర్లో తొమ్మిది పరుగులు వచ్చాయి. క్రీజులో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఉన్నారు.
శుభ్‌మన్ గిల్ (35: 24 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు)
రోహిత్ శర్మ (10: 24 బంతుల్లో, ఒక ఫోర్ ఒక సిక్సర్)
నసీం షా : 4-1-15-0
ఏడు ఓవర్లు అయ్యే సరికి భారత్ వికెట్ల నష్టపోకుండా 38 పరుగులు చేసింది. ఫహీం అష్రాఫ్ వేసిన ఈ ఓవర్లో ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. క్రీజులో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఉన్నారు.
శుభ్‌మన్ గిల్ (26: 18 బంతుల్లో, ఆరు ఫోర్లు)
రోహిత్ శర్మ (10: 24 బంతుల్లో, ఒక ఫోర్ ఒక సిక్సర్)
ఫహీం అష్రాఫ్ : 1-0-1-0
ఆరు ఓవర్లు అయ్యే సరికి భారత్ వికెట్ల నష్టపోకుండా 37 పరుగులు చేసింది. నసీం షా వేసిన ఈ ఓవర్లో ఒక్క పరుగు కూడా రాలేదు. క్రీజులో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఉన్నారు.
శుభ్‌మన్ గిల్ (25: 13 బంతుల్లో, ఆరు ఫోర్లు)
రోహిత్ శర్మ (10: 23 బంతుల్లో, ఒక ఫోర్ ఒక సిక్సర్)
నసీం షా : 3-1-6-0
షహీన్ షా వేసిన ఐదో ఓవర్లో గిల్ మళ్లీ మూడు ఫోర్లు కొట్టాడు. ఐదు ఓవర్లు అయ్యే సరికి భారత్ వికెట్ల నష్టపోకుండా 37 పరుగులు చేసింది. షహీన్ షా అఫ్రిది వేసిన ఈ ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. క్రీజులో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఉన్నారు.
శుభ్‌మన్ గిల్ (25: 13 బంతుల్లో, ఆరు ఫోర్లు)
రోహిత్ శర్మ (10: 18 బంతుల్లో, ఒక ఫోర్ ఒక సిక్సర్)
షహీన్ షా అఫ్రిది : 3-0-31-0
నాలుగు ఓవర్లు అయ్యే సరికి భారత్ వికెట్ల నష్టపోకుండా 24 పరుగులు చేసింది. నసీం షా వేసిన ఈ ఓవర్లో ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. క్రీజులో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఉన్నారు.
శుభ్‌మన్ గిల్ (13: ఏడు బంతుల్లో, మూడు ఫోర్లు)
రోహిత్ శర్మ (10: 17 బంతుల్లో, ఒక ఫోర్ ఒక సిక్సర్)
నసీం షా : 2-0-6-0
శుభ్‌మన్ గిల్ ఈ ఓవర్లో మూడు ఫోర్లతో చెలరేగాడు. మూడు ఓవర్లు అయ్యే సరికి భారత్ వికెట్ల నష్టపోకుండా 23 పరుగులు చేసింది. షహీన్ షా అఫ్రిది వేసిన ఈ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. క్రీజులో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఉన్నారు.
శుభ్‌మన్ గిల్ (13: ఏడు బంతుల్లో, మూడు ఫోర్లు)
రోహిత్ శర్మ (10: 11 బంతుల్లో, ఒక ఫోర్ ఒక సిక్సర్)
షహీన్ షా అఫ్రిది : 2-0-18-0
రెండు ఓవర్లు అయ్యే సరికి భారత్ వికెట్ల నష్టపోకుండా 11 పరుగులు చేసింది. నసీం షా వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. క్రీజులో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఉన్నారు.
శుభ్‌మన్ గిల్ (1: 1 బంతికి)
రోహిత్ శర్మ (10: 11 బంతుల్లో, ఒక ఫోర్ ఒక సిక్సర్)
నసీం షా : 1-0-5-0
మొదటి ఓవర్ అయ్యే సరికి భారత్ వికెట్ల నష్టపోకుండా ఆరు పరుగులు చేసింది. రోహిత్ శర్మ భారీ సిక్సర్‌తో ఇన్నింగ్స్ ఓపెన్ చేశాడు. షహీన్ షా అఫ్రిది వేసిన ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. క్రీజులో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఉన్నారు.
శుభ్‌మన్ గిల్ (0: 0 బంతుల్లో)
రోహిత్ శర్మ (6: 6 బంతుల్లో, ఒక సిక్సర్)
షహీన్ షా అఫ్రిది : 1-0-6-0
ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), అఘా సల్మాన్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
ఆసియాకప్ 2023లో సూపర్ 4 దశ జరుగుతోంది. ప్రేమ దాస స్టేడియం వేదికగా భారత్, పాకిస్థాన్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ టాస్ వేశారు. టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు.
ప్రస్తుతం శ్రీలంకలో వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే లీగు దశలో భారత్, పాక్ మ్యాచ్ వర్షంతో రద్దైంది. దాంతో నేటి మ్యాచుపై ఆందోళన నెలకొంది. ఇప్పటికైతే కొలంబో వాతావరణం ప్రశాంతంగా ఉంది. ఆకాశంలో మబ్బులేమీ లేవు. సూర్యుడు స్పష్టంగా కనిపిస్తున్నాడు.
ఆసియా కప్‌లో భారత్ - పాకిస్తాన్‌లు 17 సార్లు (14 వన్డేలు, 3 టీ20లు) తలపడ్డాయి. ఇందులో భారత్ 9 (ఏడు వన్డేలు, రెండు టీ20లు) మ్యాచ్‌లలో గెలిచింది. పాకిస్తాన్ ఆరు మ్యాచ్‌లలో నెగ్గగా రెండు మ్యాచ్‌లలో ఫలితాలు తేలలేదు.
ఐసీసీ టోర్నీలలో పాకిస్తాన్‌పై భారత్‌కు తిరుగులేని రికార్డు ఉంది. వన్డే ప్రపంచకప్ పోటీలలో ఇంతవరకూ భారత్.. పాకిస్తాన్‌కు తలవంచలేదు. 1992 నుంచి ఆడిన ప్రతి ప్రపంచకప్‌లో (మొత్తం ఏడు)నూ భారత్‌దే విజయం. వన్డే ప్రపంచకప్‌లో భారత్ రికార్డు 7-0గా ఉంది. ఇక ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీలలో కూడా భారత్‌కు పాకిస్తాన్‌పై ఘనమైన రికార్డే ఉంది. మినీ వరల్డ్ కప్‌లలో దాయాదులు ఏడు సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్ ఆరు మ్యాచ్‌లను గెలుచుకోగా పాకిస్తాన్ ఒక్కసారి (2021 వరల్డ్ కప్‌లో) మాత్రమే నెగ్గింది.
ఐసీసీ తొలిసారి ప్రవేశపెట్టిన టీ20 వరల్డ్ కప్‌లోనే భారత్ -పాక్ లు తలపడ్డాయి. ఈ ఫార్మాట్‌లో మాత్రం భారత్ ఆధిక్యం స్పష్టంగా ఉంది. దాయాదుల మధ్య ఇప్పటివరకూ 12 మ్యాచ్‌లు జరుగగా అందులో భారత్ ఏకంగా 9 మ్యాచ్‌లలో గెలిచింది. పాకిస్తాన్ గెలిచినవి మూడు మాత్రమే..
క్రికెట్ అభిమానులకు అత్యంత ఆసక్తిని, అసలైన మజాను పంచింది భారత్ - పాక్ వన్డే పోరే అని చెప్పక తప్పదు. ఇరు జట్లు తొలి వన్డేను 1978లో ఆడాయి. నాటి నుంచి మొన్నటి ఆసియా కప్ గ్రూప్ స్టేజ్‌లో వర్షం పుణ్యమా అని తుడుచుపెట్టుకుపోయిన మ్యాచ్ వరకూ ఇప్పటివరకూ ఇరు జట్ల మధ్య 133 వన్డేలు జరిగాయి. ఇందులో భారత్ గెలిచినవి 55 అయితే పాకిస్తాన్ ఏకంగా 73 వన్డేలలో విజయాలను సొంతం చేసుకుంది. ఐదు మ్యాచ్‌లలో ఫలితం తేలలేదు.
ఇరు దేశాల మధ్య సరిహద్దులు గీసుకున్న తర్వాత 1952 నుంచి ఈ రెండు జట్ల మధ్య వైరం మొదలైంది. ఇరు జట్ల మధ్య తొలి టెస్టు జరిగింది 1952లో.. 2007 నుంచి భారత్ - పాక్‌లు టెస్టులు ఆడలేదు కానీ గతంలో ఈ రెండు జట్ల మధ్య తరుచూ మ్యాచ్‌లు జరిగేవి. మొత్తంగా దాయాదుల మధ్య 59 టెస్టులు జరిగితే అందులో ఏకంగా 38 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. పాకిస్తాన్ 12 నెగ్గగా భారత్ 9 మాత్రమే గెలిచింది.
Background
2023 ఆసియా కప్‌లో నేడు (ఆదివారం) భారత్, పాకిస్తాన్ మధ్య సూపర్-4 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం పాకిస్తాన్ తన తుది జట్టును ఇప్పటికే ప్రకటించింది. ఈ సారి ఏకంగా నలుగురు ఫాస్ట్ బౌలర్లతో పాకిస్తాన్ జట్టు బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్‌లో బాబర్ ఆజం స్పిన్ ఆల్ రౌండర్ మహ్మద్ నవాజ్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు కల్పించలేదు. అతని స్థానంలో ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ ఫహీమ్ అష్రాఫ్‌కు అవకాశం లభించింది.
భారత్‌తో జరగనున్న మ్యాచ్‌లో పాకిస్తాన్ ప్లేయింగ్ ఎలెవన్ ఇదే
బాబర్ ఆజం (కెప్టెన్), ఫఖర్ జమాన్, షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఇమామ్ ఉల్ హక్, సల్మాన్ అలీ అఘా, ఇఫ్తీకర్ అహ్మద్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), ఫహీమ్ అష్రాఫ్, నసీమ్ షా, షహీన్ షా ఆఫ్రిది, హరీస్ రౌఫ్
భారత్‌తో జరిగే మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ ఫహీమ్ అష్రాఫ్‌కు అవకాశం ఇవ్వడంపై పాక్ కెప్టెన్ బాబర్ ఆజం నమ్మకం వ్యక్తం చేశాడు. ఫాస్ట్ బౌలింగ్‌తో పాటు లోయర్ ఆర్డర్‌లో కూడా ఫహీమ్ అష్రాఫ్ బాగా బ్యాటింగ్ చేయగలడని పేర్కొన్నాడు. బంగ్లాదేశ్‌పై అద్భుతంగా బౌలింగ్ కూడా చేశాడు.
నలుగురు ఫాస్ట్ బౌలర్లతో దిగనున్న పాకిస్తాన్
భారత్‌పై నలుగురు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగాలని పాకిస్తాన్ నిర్ణయించింది. ప్లేయింగ్ ఎలెవన్‌లో షహీన్ షా ఆఫ్రిది, నసీమ్ షా, హరీస్ రౌఫ్‌లతో పాటు ఫహీమ్ అష్రాఫ్ బౌలింగ్ యాక్షన్‌లో కనిపిస్తారు. షాదాబ్ ఖాన్ లీడ్ స్పిన్నర్‌గా వ్యవహరించనున్నాడు. అతనికి మద్దతుగా సల్మాన్ అఘా, ఇఫ్తికర్ అహ్మద్ కూడా తుది జట్టులో ఉన్నారు. బంగ్లాదేశ్‌తో జరిగిన సూపర్-4 తొలి మ్యాచ్‌లో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు ప్లేయింగ్ ఎలెవెన్‌పై బాబర్ ఆజం విశ్వాసం ఉంచాడు. ఆ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను పాకిస్తాన్ చాలా ఘోరంగా ఓడించింది.
- - - - - - - - - Advertisement - - - - - - - - -