Naga Chaitanya Sobhita Wedding Pic : నాగచైతన్య, శోభిత పెళ్లి ఫోటోలు ఇవే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న పర్సనల్ పిక్స్
శోభిత, నాగచైతన్య పెళ్లి ఫోటోల్లో చూడముచ్చటగా కనిపించారు. ట్రెడీషనల్ లుక్‌లో కపుల్ బాగున్నారంటూ సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ చేస్తున్నారు అక్కినేని అభిమానులు. (Image Source : Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనాగచైతన్య పెళ్లికొడుకుగా ముస్తాబై పెళ్లిపీఠలపై కూర్చొన్న ఫోటో బయటకి వచ్చింది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీరి వెడ్డింగ్ గ్రాండ్‌గా జరుగుతుంది. (Image Source : Instagram)
వదువుగా అందంగా ముస్తాబైంది శోభిత. గోల్డెన్ కలర్ కాంచీవరం శారీ కట్టుకుని అందంగా కనిపించింది. నిండుగా నగలు పెట్టుకుని, పూలు, గోరింటాకుతో ముస్తాబైంది. (Image Source : Instagram)
వీరి పెళ్లి నేపథ్యంలో గతంలో వెళ్లిన పర్సనల్ ట్రిప్‌లోని ఫోటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. శోభిత, చై చెట్టాపట్టాల్ వేసుకున్న ఈ ఫోటో చాలా స్టైలిష్‌గా ఉంది. (Image Source : Instagram)
మరో ఫోటోలో చై, శోభిత చేతులు పట్టుకోగా.. చై సెల్ఫీ తీస్తున్న ఈ ఫోటో కపుల్ గోల్స్ సెట్ చేస్తుంది. (Image Source : Instagram)
ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్తూ.. ఆగస్టు 8వ తేదీన వీరు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఈ విషయాన్ని నాగార్జునే అఫీషియల్‌గా తెలిపారు. (Image Source : Instagram)
శోభితను పెళ్లికి ముందే అక్కినేని కుటుంబం అన్ని ఫంక్షన్లకు తీసుకెళ్లింది. సాంప్రదాయమైన తెలుగు పద్ధతిలో వీరిద్దరూ పెళ్లితంతు చేసుకుంటున్నారు. (Image Source : Instagram)