Sri Padmavathi Ammavari Brahmotsavalu: సూర్యప్రభ వాహనంపై వెలిగిపోతున్న సిరులతల్లి ..రాత్రి చంద్రప్రభ వాహనంపై పద్మావతి అమ్మవారు!
సూర్యప్రభ వాహనంపై గోవర్ధన గిరిధారిఅయిన శ్రీ కృష్ణుడి రూపంలో శ్రీ పద్మావతి అమ్మవారు మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ మాడ వీధుల్లో భక్తులను అనుగ్రహించారు.
బుధవారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు వాహనసేవ కన్నులపండువగా సాగింది
లక్ష్మీ సమేతుడైన శ్రీమన్నారాయణుడు సూర్యమండలాంతర్గతుడై వెలుగుతున్నాడని పురాణాల్లో ఉంది. సూర్యుడి కిరణాలు తాకి పద్మాలు వికలిస్తాయి.. ఆ పద్మాలే లక్ష్మీ నివాసాలు
సూర్యప్రభ వాహనంలో అమ్మవారిని దర్శించుకుంటే ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆయుష్షు సిద్ధిస్తుందని పండితులు చెబుతారు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు బుధవారం రాత్రి 7 నుంచి 9 వరకూ శ్రీ పద్మావతి అమ్మవారు చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు
శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన గురువారం ఉదయం 8 గంటలకు అమ్మవారి రథోత్సవం వైభవంగా జరుగనుంది.
సర్వాలంకార సంశోభితమైన రథంలో ప్రకాశించే అలమేలు మంగ సకలదేవతా పరివారంతో వైభవోపేతంగా తిరువీధులలో విహరిస్తారు.
ఎనిమిదో రోజు రాత్రి పద్మావతి అమ్మవారు అశ్వవాహనంపై విహరిస్తారు