Tirumala Prasadam: కలియుగవైకుంఠం తిరుమలలో స్వయం వ్యక్త స్వరూపంలో కొలువయ్యాడు శ్రీ వేంకటేశ్వరుడు. విష్ణు స్వరూపంగా చెప్పే సాలగ్రామశిల ద్వారా స్వయంభువుగా వెలసిన శ్రీ వేంకటేశ్వరుణ్ణి శ్రీనివాసుడని, తిరుమలేశుడని, సప్తగిరీశుడని, ఏడుకొండలవాడని, కలియుగ దైవం అని ఎన్నో పేర్లతో పిలుచుకుంటారు భక్తులు. ఆనందనిలయుడైన శ్రీ వేంకటేశ్వరుడు కొలువున్న బంగారు మందిరానికి ‘ఆనంద నిలయం’ అని పిలుస్తారు. శ్రీవాల అలంకార ప్రియుడు, అర్చన ప్రియుడు, ఉత్సవ ప్రియుడు మాత్రమే కాదు..నైవేద్య ప్రియుడు కూడా. వేంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన ప్రసాదం లడ్డూ..ఈ లడ్డూ కోసమే భక్తజనం పోటీపడతారు. అయితే లడ్డూతో పాటూ శ్రీవారికి నివేదించే ప్రసాదాలు కొన్ని ఉన్నాయి. ఈ ప్రసాదాల వితరణ కోసమే ఏ ఏ రాజులు ఎంతిచ్చారో ఆలయ గోడలపై ఉండే శాసనాలు తెలియజేస్తున్నాయి. స్వామివారి  నైవేద్య వితరణ నిష్టగా  క్రమ పద్ధతిలో సాగుతుంది. 


Also Read: తిరుమలలో మహిళలు తలలో పూలు పెట్టుకుంటే ఏమవుతుంది ..అసలెందుకు పూలు పెట్టుకోరు!


నిత్యం 3 సార్లు శ్రీవారికి నైవేద్యం సమర్పిస్తారు


నైవేద్య సమర్పణ సమయాన్ని మొదటి గంట, రెండో గంట, మూడో గంట అని పిలుస్తారు


గురువారం, శుక్రవారం మినహా మిగిలిన అన్ని రోజుల్లో నైవేద్య సమయాల్లో ఎలాంటి మార్పు ఉండదు


గురువారం, శుక్రవారాల్లో కూడా రెండో గంట సమయంలో మాత్రమే మార్పు ఉంటుంది...
 
శ్రీ వేంకటేశ్వరుడికి తొలి నివేదన ఉదయం 5.30 గంటలకు ప్రారంభమవుతుంది. రెండో గంట ఉదయం 10గంటలకు, మూడో గంట రాత్రి 7.30కు ఉంటుంది. అదే గురువారం, శుక్రవారాల్లో  రెండో గంట రెండున్నర గంటల ముందుగా ఉదయం 7.30 నిమిషాలకు ఉంటుంది. 


శ్రీవారికి సమర్పించే ప్రసాదాలు నిత్యం ఒకేలా ఉంటాయి కానీ ప్రతి నివేదనలోనూ వైవిధ్యం ఉంటుంది


Also Read: తిరుమల భోజనశాలలో ఉన్న ఈ పెయింటింగ్ ఏంటో తెలుసా!
 
మొదటి గంట నైవేద్యం


ఉదయం 5.30నిమిషాలకు సమర్పించే నివేదనలో చక్రపొంగలి, కదంబం, పులిహోర, దద్ధ్యోజనం , మాత్ర ప్రసాదాలు, లడ్డూలు, వడలు నివేదిస్తారు..ఈ ప్రసాదాలనే బేడి ఆంజనేయస్వామితో పాటు ఇతర ఉపాలయాలకు పంపిస్తారు. 


రెండో గంట నైవేద్యం


ఉదయం 10 గంటలకు నివేదించే ప్రసాదాలలో పెరుగన్నం, చక్రపొంగలి, పులిహోర, మిర్యాల పొంగలి, సీర, సేకరబాద్‌ సమర్పిస్తారు. 


మూడో గంట నైవేద్యం


రాత్రి 7.30 నిమిషాలకు పెట్టే మూడో నైవేద్యంలో భాగంగా కదంబం, మొలహోర, వడలు, తోమాల దోశలు, లడ్డూలతో పాటు .. ఆదివారం రోజు ప్రత్యేకంగా గరుడ ప్రసాదంగా చెప్పే పిండిని శ్రీవారికి నివేదిస్తారు. 


Also Read: తిరుమల హుండీలో సొమ్ము 3 భాగాలు - మీరు ఏ భాగంలో వేస్తున్నారు , ఎలాంటి ముడుపులు చెల్లిస్తున్నారు?
 
వారంలో ఒక్కరోజు ప్రసాదాల సంఖ్య పెరుగుతూ వస్తుంది


సోమవారం విశేష పూజ సందర్భంగా 51 పెద్ద దోశలు, 51 చిన్న దోశలు, 51 పెద్ద అప్పాలు, 102 చిన్న అప్పాలను నైవేద్యంగా సమర్పిస్తారు
 
మంగళవారం సమర్పించే ప్రసాదంలో ప్రత్యేకంగా చెప్పుకోదగినది ‘మాత్ర ప్రసాదం’... మిగిలినవన్నీ నిత్యం సమర్పించేవే ఉంటాయి


బుధవారం సమర్పించే ప్రసాదాల్లో  ప్రత్యేకంగా పాయసం, పెసరపప్పు శ్రీవారికి నైవేద్యంగా సమర్పిస్తారు


గురువారం సమర్పించే ప్రసాదాల్లో నిత్యం సమర్పించే వాటితో పాటూ తిరుప్పావడ సేవ సందర్భంగా జిలేబి, మురుకు, పాయసాలు  నివేదిస్తారు. ట


శుక్రవారం రోజు శ్రీవారి అభిషేక సేవ జరిగుతుంది.. ఈ రోజు స్వామివారికి  ప్రత్యేకంగా పోళీలు సమర్పిస్తారు.


శనివారం నివేదనలో కదంబం, చక్రపొంగలి, లడ్డూలు, వడలు, పులిహోర, దద్యోజనం, మిర్యాల పొంగలి,  సీర, సేకరాబాద్‌,  కదంబం, మొలహోర, తోమాల దోశలు సమర్పిస్తారు.


Also Read: తిరుమల వెళుతున్నారా.. ఈ తప్పులు ఎప్పుడూ చేయకండి!