Tirumala Hundi Secrets:  తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం ఎందుకంత ఎక్కువగా ఉంటుందనగానే.. శంకరాచార్యులు శ్రీ చక్రాన్ని ప్రతిష్టించారు అందుకే అంత ఆదాయం అంటారు..అయితే..ఆదిశంకరాచార్యులు  కేవలం తిరుమలలో మాత్రమే కాదు..చాలా ఆలయాల్లో శ్రీ చక్రాన్ని ప్రతిష్టించారు. అక్కడ ఎక్కడా లేనంతగా తిరుమలలోనే హుండీ ఆదాయం ఎందుకంత ఎక్కువగా ఉంటుంది? ఇంకా హుండీ, ముడుపులు, స్వామివారి ఆదాయానికి సంబంధించి ఎన్నో ప్రశ్నలు..
 
'కలౌ వెంకటనాయకా' అని అని ఎందుకంటారు? 


పాపాలతో నిండే కలియుగంలో ధర్మం ఓపాదంలో నడుస్తుంటుంది. కలిపురుషుడి ప్రభావంతో ప్రజలంతా అధర్మాన్నే అనుసరిస్తారు. అందుకే కలియుగంలో ప్రజలకు అండగా ఉండేందుకు .. తనను స్మరించినంతనే పాపాలు పోయేలా తిరుమలలో కొలువయ్యాడు శ్రీవేంకటేశ్వరుడు. కలియుగంలో ప్రజల పాపాలను తొలగిస్తాడు కాబట్టే.. కలౌ వెంకటనాయకా అంటారు.  వేం అంటే పాపాలు, కట అంటే తొలగించడం అని అర్థం. 


Also Read: తిరుమల వెళుతున్నారా.. ఈ తప్పులు ఎప్పుడూ చేయకండి! 


ఇక స్వామివారి హుండీ గురించి, అందులో వేసే సొమ్ము గురించి మొత్తం పద్మపురాణంలో ఉంది. 


లక్ష్మీదేవి పక్కనుండగా అప్పెందుకు?


అసలు లక్ష్మీదేవి పక్కనుండగా కుబేరుడి దగ్గర్నుంచి శ్రీనివాసుడు అప్పు ఎందుకు తీసుకున్నాడు? కలియుగాంతం వరకూ ఎందుకు వడ్డీ చెల్లిస్తున్నాడు అనే సందేహం వచ్చి ఉండొచ్చు. అమ్మవారికి కూడా ఇదే సందేహం వచ్చి అడిగిందట.. స్వయంగా నీ వక్షస్థలంపై కొలువై నేనున్నప్పుడు కలియుగాంతం వరకూ వడ్డీ ఎందుకు కట్టాలి అని అడిగింది. నువ్వు ఉన్నప్పుడు అసలు అప్పు తీసుకోవాల్సిన అవసరమే లేదు. అయినా అప్పు తీసుకున్నానంటే దానివెనుకున్న ఆంతర్యం వేరే అని వివరించారు శ్రీవారు.  పుట్టుకే లేని భగవంతుడు భూమిపై అవతరించాలంటే ఏదో ఒక కర్మనో, కారణమో సృష్టించుకోవాలి..అందులో భాగమే నేను తీసుకున్న ఈ అప్పు అని వివరించాడు శ్రీ వేంకటేశ్వరుడు. కలియుగం చివరి వరకూ కుబేరుడికి వడ్డీ చెల్లించడం వెనుకున్న ఆంతర్యం ఇదే. 


శ్రీవారి సొమ్ము, స్థలాలను అక్రమార్కులు దోచేస్తున్నా ఆయన చూస్తూ ఊరుకుంటారా? ...అసలు హుండీలో సొమ్ములేస్తే కోర్కెలు తీరిపోతాయా? ఈ ప్రశ్నలన్నీ స్వయంగా అమ్మవారు అడిగితే స్వామివారు చెప్పిన విషయాలివి. 


సాధారణంగా హుండీలో వేసే సొమ్ములను స్వామివారు మూడు భాగాలుగా చేస్తారట... 


నిష్కామ పుణ్యధనం 


ధనాన్ని పుణ్యమార్గంలో, ఎలాంటి పాపాలు చేయకుండా సంపాదించడం..కానీ హుండీలో వేసేటప్పుడు ఎలాంటి కోర్కె లేకుండా వేస్తే దాన్ని నిష్కామ పుణ్యధనం అంటారు.


పుణ్యధనం


న్యాయంగా సంపాదించిన సొమ్మే కానీ...ఏదో ఒక ప్రతి ఫలం ఆశించి వేయడం. వివాహం, సంతానం, ఉద్యోగం, వ్యాపారానికి సంబంధించి ఏవో కోర్కెలతో వేసిన ధనం. ఈ భాగాన్ని స్వామివారు అన్నదానం, విద్యాదానం, వేద పఠనాననికి ఖర్చు చేయిస్తాడట. వేసినవారి పాపం కరిగి వీళ్ల కోర్కె వెంటనే తీరుతుంది. సనాతన ధర్మం పేరుతో టీటీడీ చేసే సేవాకార్యక్రమాలు కూడా ఈకోవకు చెందినవే...


అన్యాయపు సొమ్ము


దేవాలయాలను మోసం చేసి, లంచాలు తీసుకుని, పాపపు పనులు చేసి, ఆలయ సంపదను దోచేసి చేసేవారు వేసే ధనాన్ని అన్యాయపు సొమ్ము అంటారు. వీళ్ల కోర్కె కూడా తీరిపోతోంది. ఇవన్నీ స్వామివారు చూస్తూ ఊరుకుంటారా? అంటే..స్వామి హుండీలో మూడో భాగం అయిన పాపపు సొమ్ముతో సంపాదించిన ఆస్తులపైనే మళ్లీ పాపుల కన్ను పడుతుంది. ఆ సొమ్మునే హుండీలో వేస్తారు. అయితే స్వామివారు ఆస్తులు దోచేసేవారు తరతరాలుగా ఆ పాపాన్ని అనుభవించి తీరుతారు. వంశం నాశనం అయిపోతుందంటారు..


Also Read: అరుణాచలంలో నిత్యం గిరిప్రదక్షిణ చేసే టోపీ అమ్మ ఎవరు.. ఆమెను చూస్తే భక్తులకు ఎందుకంత పూనకం!


హుండీలో డబ్బులేస్తే పాపాలు తీరుతాయా?


పాపపు సొమ్ము సంపాదించేవాడి పాపం మొత్తం ఆ సొమ్ముపైనే తిష్టవేసుకుని కూర్చుంటుంది. ముడుపులు కట్టి పాపపు సొమ్ము, వెంట్రుకలను అంటుకున్న పాపాలకు గుర్తుగా జుట్టు ఇచ్చేసిన తర్వాత...ఆ పాపాన్ని కడిగేసుకున్నవారు అవుతారు. అందుకే మొక్కులు చెల్లించకుండా ఉండకూడదంటారు. ఇంకా చెప్పాలంటే భయాన్ని కలిగించేది..ఆ భయాన్ని నాశనం చేసేది కూడా భగవంతుడే. 


తిరుమల హుండీలో మొదటి రెండు మార్గాల్లో వేసిన సొమ్ము మాత్రమే భగవంతుడి సేవలో వినియోగిస్తారని ఈ కథనం వెనుకున్న ఆంతర్యం. అందుకే మీరు హుండీలో ఎలాంటి సొమ్ము వేస్తున్నారో ఆలోచించుకోండి...