The legend of Nagoba 2024:  2024 ఫిబ్రవరి 9 పుష్యమాస అమావాస్య అర్థరాత్రి నాగదేవతకి పవిత్ర గోదావరి నదీజలాభిషేకంతో జాతర ప్రారంభమవుతుంది. అసలీ జాతర ఎప్పటి నుంచి ప్రారంభమైంది? దీని చరిత్ర ఏంటంటే...


Also Read: అమావాస్య అర్థరాత్రి ప్రారంభమయ్యే అద్భుతమైన జాతర - నాగోబా నమోనమః!


నాగోబా జాతర ఎప్పటి నుంచి మొదలైంది


క్రీ.శ 740.. కేస్లాపూర్‌లో పడియేరు శేషసాయి అనే నాగభక్తుడుండేవాడు. నాగదేవతను దర్శించుకునేందుకు ఓసారి నాగలోకానికి వెళ్లాడు. నాగలోక ద్వారపాలకులు శేషసాయిని అడ్డుకున్నారు. నిరుత్సాహంతో వెనుతిరిగిన శేషసాయి పొరపాటున నాగలోకం ద్వారాలను తాకుతాడు. తన ద్వారాలను సామాన్య మానవుడు తాకిన విషయం తెలుకున్న నాగరాజు కోపంతో రగిలిపోతాడు. అప్పటి నుంచి ప్రాణభయంతో వణికిపోయిన శేషసాయి తనకు తెలిసిన పురోహితుడిని కలసి..నాగదేవతను శాంతింపజేసే మార్గం చెప్పమన్నాడు. ఏడు కడవల ఆవుపాలతో పాటు పెరుగు, నెయ్యి, తేనె, బెల్లం, పెసరపప్పు తదితర ఏడురకాల నైవేద్యాలు సమర్పించి 125 గ్రామాలమీదుగా పయనిస్తూ, పవిత్ర గోదావరి జలాలు తీసుకొచ్చి నాగరాజుకు అభిషేకం చేశాడు. భక్తికి మెచ్చిన నాగరాజు కేస్లాపూర్‌లో శాశ్వత నివాసమేర్పరుచుకున్నాడు. ఆ స్థలమే నాగోబాగా ప్రసిద్ధికెక్కింది. అప్పటి నుంచి ఏటా నాగరాజు విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు గిరిపుత్రులు


Also Read: మకరంలో 3 గ్రహాలు - ఈ 3 రాశులవారికి ఊహించనంత ప్రయోజనం!


కుండలు చాలా ప్రత్యేకం


ఈ జాతరకు గుగ్గిల్ల వంశీయులు మాత్రమే కుండలు తయారుచేస్తారు. ఇదికూడా ఆచారంలో భాగమే! గుగ్గిల్ల వంశీయులకు మెస్రం వంశీయులమధ్య తరతరాలుగా సంబంధాలు కొనసాగుతున్నాయి! పుష్యమాసంలో నెలవంక కనిపించిన తర్వాత మెస్రం వంశీయులు ...గుగ్గిల్ల వంశస్థుల వద్దకు వెళ్లి కుండల తయారు చేయమని చెబుతారు. వంటల కోసం పెద్ద కుండలు, కాగులు, వాటిపై మూతపెట్టే పాత్ర, నీటికుండలు కలిపి సుమారు 130కి పైగా కుండల తయారీకి ఆర్డర్ ఇస్తారు. మేస్రం వంశీయులు ఈ కుండల్లోనే గంగా జలాన్ని తీసుకురావడమే కాకుండా, వంట చేసి జాతరలో భక్తులకు భోజనం పెడతారు.


Also Read: మరణం తర్వాత కొన్ని గంటలపాటూ గుండె కొట్టుకోవడం వెనుక కారణం ఇదే!


భేటింగ్ కీయ్‌వాల్ చాలా ప్రత్యేకం


మెస్రం వంశస్థుల్లో వివాహమైన నూతన వధువులను కేస్లాపూర్‌లో నాగోబా దేవుని వద్దకు తీసుకెళతారు. దేవుడికి పరిచయం చేసి ఆమెతో ప్రత్యేక పూజలు చేయిస్తారు. దీనినే ‘భేటింగ్ కీయ్‌వాల్’ అంటారు. ఎప్పటి వరకైతే మెస్రం తెగ వధువు ఈ పరిచయ వేదికలో పాల్గోదో అప్పటి వరకూ వారు నాగోబాని చూడడం, పూజించడం నిషిద్ధం. వధువులు ఇద్దరు చొప్పున జతలుగా ఏర్పడి ముఖం నిండా తెల్లటి దుస్తులతో ముసుగు ధరిస్తారు. పూజా కార్యక్రమానికి ముందు నాగోబాకి పరిచయం చేస్తారు. అప్పటి నుంచి వాళ్లు ఆ కుటుంబంలో పూర్తిస్థాయిలో భాగం అయినట్టుగా భావిస్తారు. 


Also Read: పంచభూత శివలింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయి- శివరాత్రి సందర్భంగా ప్లాన్ చేసుకుంటున్నారా!


అల్లుళ్లకు నజరానా


నాగోబా పూజల అనంతరం నాగోబా ఆలయ ఆవరణలో ఉన్న పుట్టను మట్టితో మెత్తడంలో మెస్రం వంశీయుల అల్లుళ్లకు పెద్దపీట వేస్తారు. అల్లుళ్లు మట్టిని కాళ్లతో తొక్కి మెత్తగా చేస్తే కూతుళ్లు ఆ మట్టితో పుట్టను మెత్తి  మొక్కులు తీర్చుకుంటారు. అల్లుళ్లు మట్టిని తొక్కినందుకు వారికి ప్రత్యేక నజరానా అందజేయడం సంప్రదాయం.