Mercury Mars Venus Transit: ఫిబ్రవరిలో మూడు గ్రహాలు ఒకేసారి మకర రాశిలో సంచరిస్తాయి...
బుధుడు - ఫిబ్రవరి 1 నుంచి 18 వరకు మకర రాశిలో సంచరిస్తాడు
కుజుడు- ఫిబ్రవరి 5 నుంచి మార్చి 14 వరకూ మకర రాశిలో ఉంటాడు
శుక్రుడు- ఫిబ్రవరి 12 నుంచి మార్చి 07 వరకూ మకర రాశిలో సంచరిస్తాడు


ఫిబ్రవరి ప్రారంభంలో బుధుడు...ఆ తర్వాత కుజుడు..ఆ తర్వాత శుక్రుడు వరుసగా ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి మారుతున్నారు. 
అంటే మూడు గ్రహాలు ఫిబ్రవరి 12 నుంచి వారం రోజుల పాటు మకర రాశిలోనే ఉంటాయి. ఈ 3 పెద్ద గ్రహాల రాశిమార్పు ఒక్కో గ్రహం ప్రభావం 12 రాశులపైనా ఉంటుంది. కొన్ని రాశులవారికి అనుకూల ఫలితాలుంటే మరికొన్ని రాశులవారికి ప్రతికూల ఫలితాలుంటాయి. మరి బుధుడు , కుజుడు , శుక్రుడు కలసి మకరరాశిలో సంచరించే సమయంలో ముఖ్యంగా మూడు రాశులవారికి యోగకాలం అనే చెబుతున్నారు పండితులు. ఆ రాశులేంటో చూద్దాం..


Also Read: అనవసర చర్చల్లో పాల్గొనవద్దు, తొందరపాటు నిర్ణయాలు వద్దు - జనవరి 26 రాశిఫలాలు


మేష రాశి (Aries)


బుధుడు, శుక్రుడు , అంగారక గ్రహాల కలయిక మేషరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారి కల నెరవేరే అవకాశం ఉంది. ఆర్థికంగా బలపడతారు. ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమచారం వింటారు. అయితే ఆదాయంతో పాటూ ఖర్చులు నియంత్రణపైనా దృష్టి సారించాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. 


Also Read: పంచభూత శివలింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయి- శివరాత్రి సందర్భంగా ప్లాన్ చేసుకుంటున్నారా!


ధనుస్సు రాశి (Sagittarius)


మకరరాశిలో 3 గ్రహాల కలయిక ధనుస్సు రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. గత కొన్నాళ్లుగా మీరు కెరీర్లో ఎదుర్కొంటున్న సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఆస్తి వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. ముఖ్యమైన నిర్ణయం తీసుకునేముందు మరోసారి ఆలోచించుకోవడం మంచిది. కుటుంబానికి సమయం కేటాయించాలి. అనవసర ఆలోచనకు దూరంగా ఉండడం,నిరాశకు దూరంగా ఉండడం ద్వారా మరింత ప్రయోజనం పొందుతారు.


Also Read: మీరు చేసే కర్మలకు ఫలితం మీరు ఎప్పుడు అనుభవిస్తారో తెలుసా!


మకర రాశి (Capricorn)


3 గ్రహాలు కలుస్తున్నది మీ రాశిలోనే కావడంతో ఈ టైమ్ లో మీరు ఓ వెలుగు వెలుగుతారు. నష్టాల్లో ఉన్న వ్యాపారం అనూహ్యంగా పుంజుకుంటుంది. నూతన అవకాశాలు వస్తాయి..కొత్త పెట్టుబడులు పెట్టాలనే ఆలోచనను అమలు చేయడం మంచిదే. ఆర్థకి పరిస్థితి బలంగా ఉన్నప్పటికీ కొన్ని హెచ్చుతగ్గులు ఉంటాయి. ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకోవడం మంచిది. ఆరోగ్యం జాగ్రత్త.


Also Read: మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో మీ రాశి చెప్పేస్తుంది!


కుజుడు
ధరణీగర్భ సంభూతం | విద్యుత్కాంతి సమప్రభమ్
కుమారం శక్తిహస్తం | తం మంగళం ప్రణమామ్యహం ||


బుధుడు 
ప్రియంగు కలికాశ్యామం | రూపేణా ప్రతిమం బుధం
సౌమ్యం సత్వగుణోపేతం | తం బుధం ప్రణమామ్యహం ||


శుక్రుడు
హిమకుంద మృణాళాభం | దైత్యానాం పరమం గురుం
సర్వ శాస్త్ర ప్రవక్తారం | భార్గవం ప్రణమామ్యహం ||


గమనిక


ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.