What Is Karma and How Does It Work:  హిందూ మతం ప్రకారం మనిషి ఆధీనంలో కర్మ..భగవంతుని ఆధీనంలో కర్మ ఫలం ఉంటాయి.  ప్రతి మనిషి  పుట్టిన దగ్గర నుంచి చనిపోయేవరకు కర్మలు చేస్తూనే ఉంటారు. చేసే ప్రతి కర్మకు ఫలితం అనుభవించే తీరాలి. చేసిన కర్మలకు అనుభవించే ఫలాన్నే కర్మఫలం అంటారు. వాస్తవానికి జీవితంలో ప్రతి అడుగులో ఎదురయ్యే సంఘటనలన్నీ కర్మఫలమే అంటారు పండితులు. ఇంతకీ కర్మ అంటే ఏంటి? వాటిలో ఎన్ని రకాలున్నాయో...ఏ ఫలితాన్ని ఎప్పుడు అనుభవిస్తారో తెలుసా?


Also Read: మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో మీ రాశి చెప్పేస్తుంది!


కర్మలు 3 రకాలు....
1.ఆగామి కర్మలు
2.సంచిత కర్మలు
3.ప్రారబ్ద కర్మలు


ఆగామి కర్మలు  


ప్రస్తుతం మనం చేస్తున్న ప్రతి కర్మ ఆగామి కర్మల క్రిందకే వస్తాయి. వాటిలో కొన్ని వెంటనే ఫలితాన్నిస్తాయి. మరికొన్ని తరువాత కాలంలో, కొన్ని మరు జన్మల్లో ఫలితాన్నిస్తాయి. అసలు కొన్ని  కర్మలు ఎలాంటి ఫలితాలను ఇవ్వకపోవచ్చు కూడా. మనం భోజనం చేస్తాం.. ఆ కర్మ ద్వారా వెంటనే ఆకలి తీరుతుంది. దానధర్మాలు చేస్తాం, పుణ్యకార్యాలు చేస్తాం..వాటి ఫలితం కొన్నాళ్ళకు తెలుస్తుంది. ఇలా కొన్ని కర్మలు అప్పుడే ఫలితం ఇవ్వకుండా ఆ తర్వాత ఎప్పుడో ఇస్తాయన్నమాట.


Also Read: మహా శివరాత్రి ఎప్పుడొచ్చింది - ఆ రోజు విశిష్టత, పాటించాల్సిన నియమాలు


సంచిత కర్మలు 


సంచిత కర్మలంటే  పితృదేవతల ద్వారా ప్రాప్తించిన కర్మలు. తల్లి దండ్రులు చేసిన అప్పులు కొడుకు తీర్చడం లాంటి కర్మ అన్నమాట. పూర్వ జన్మల్లో చేసిన ఆగామి కర్మల ఫలాలను వివిధ కారణాల వల్ల అనుభవించలేకపోతే అవి సంచిత కర్మలుగా మారుతాయి. అంటే వాటిని ఒక జన్మ నుంచి మరొక జన్మకి, అక్కడి నుంచి వేరొక జన్మకు బదిలీ అవుతాయి. అంటే ఈ శరీరాన్ని వదిలిపెట్టిన జీవుడు మరో శరీరాన్ని వెతుక్కున్నా కర్మ ఫలాన్ని మాత్రం మూటగట్టుకుని తీసుకెళ్తాడట. ఇవే సంచిత కర్మలు.


Also Read: ఈ రాశివారి మేధో సామర్థ్యం అద్భుతం, జనవరి 25 రాశిఫలాలు


ప్రారబ్ధ కర్మలు


ప్రారబ్ద కర్మలు అంటే పూర్వ జన్మలో మనం చేసుకున్న పాప పుణ్యాల వల్ల కలిగే కర్మలు. సంచితంలో కూడబెట్టిన కర్మలు పక్వానికి వచ్చినప్పుడు అవిచ్చే ఫలితమే ప్రారబ్ధ కర్మలు. ప్రారబ్ద కర్మఫలాన్ని అనుభవించటం పూర్తయ్యేవరకు ఆ శరీరం ఉంటుంది. ఈ కర్మలన్నీ వదిలించుకుని పరిపూర్ణులమైతే మరో జన్మే లేదంటారు. అందుకే అంటారు అంతా మా ప్రారబ్ధం అంటారు. 


ప్రారబ్ధం అంటే


ఎవరెవరు ఏ కర్మలు అనుభవించాలో, అందుకు అనువైన తల్లి గర్భాన్ని వారే ఎంచుకుంటారట. కూతురు, కొడుకు అనే బంధాలు లేవు..పూర్వ జన్మ కర్మఫలమే ఇదంతా అంటారు. కొంతమంది మానసిక వికలాంగులు చాలా ఆరోగ్యవంతమైన ,జన్యుపర సమస్యలు లేని తల్లిదండ్రులకు పుడుతుంటారు..అంటే పిల్లల నుంచి తల్లిదండ్రులు అనుభవించాల్సిన ప్రారబ్ధ కర్మ అది అని అర్థం. 


ఏ కర్మనుంచి తప్పించుకోవచ్చా!


పూజలు, యజ్ఞ యాగాదులు, దైవ దర్శనం, మహాత్ముల సందర్శనంతో ఆగామి కర్మల నుంచి విమోచనం పొందవచ్చు
మనకు తెలియకుండా ఎన్నో సూక్ష్మజీవులు చంపుతుంటాం. ఆ పాపం నుంచి విమోచనం కోసమే పూజలు, వ్రతాలు, పుష్కర స్నానాలు చేయాలంటారు
పితృదేవతలకు తర్పణం ఆరాధన, యజ్ఞం, హోమంతో కొంతవరకు సంచిత కర్మల నుంచి విమోచనం పొందొచ్చు 
ప్రారబ్ద కర్మలను మాత్రం ఎక్కుపెట్టిన బాణం లాంటివి..అనుభవించి తీరాల్సిందే. దాన్నుంచి తప్పించుకోవాలంటే నిరంతరం భగవత్ నామస్మరణలో ఉండాలి


Also Read: కలియుగం అంతమై మళ్లీ సత్యయుగం ఎప్పుడు ప్రారంభమవుతుంది!


కృష్ణుడు చెప్పింది ఇదే


కర్మణ్యేవాధి కరస్తే మాఫలేషు కదాచన |
మకర్మఫలహేతుర్భు, మాతే సంగోస్త్వకర్మణి ||   
కర్మలను ఆచరించుట యందె నీకు అధికారము కలదు కానీ, వాటి ఫలితముపైన లేదు. నీవు కర్మఫలమునకు కారణమూ కారాదు. అట్లని కర్మలను చేయుట మానరాదని అర్థం