UPSC Civil Services Interviews: యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఆధ్వర్యంలో నిర్వహించిన సివిల్ సర్వీసెస్ 2023 ఫేజ్‌-2 ఇంటర్వ్యూ తేదీలను యూపీఎస్సీ జనవరి 25న వెల్లడించింది. ఫేజ్‌-2లో ఎంపికైన అభ్యర్థులకు ఫిబ్రవరి 19 నుంచి మార్చి 15 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. అభ్యర్థుల రోల్‌ నంబర్‌, ఇంటర్వ్యూ తేదీ, సమయం వివరాలను యూపీఎస్సీ ప్రకటించింది. త్వరలోనే ఇ-సమన్‌ లెటర్లు వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నట్లు కమిషన్‌ పేర్కొంది. మొత్తం 26 రోజుల్లో 1003 మందికి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.


యూపీఎస్సీ ఫేజ్‌-1 ఇంటర్వ్యూ షెడ్యూలును డిసెంబర్‌ 19న వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా ఫేజ్-2 షెడ్యూలును విడుదల చేసింది. జనవరి 2తో ప్రారంభమైన 'ఫేజ్-1' ఇంటర్వూలు ఫిబ్రవరి 16తో ముగియనున్నాయి. ఇక ఫేజ్-2 ఇంటర్వ్యూలు ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభంకానున్నాయి. మార్చి 15 వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. మొదటి దశలో 1026 మందికి, రెండో దశలో 1003 మందికి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.


 సెప్టెంబ‌ర్ 15వ తేదీ నుంచి 24వ తేదీ వ‌ర‌కు సివిల్స్‌ ప్రధాన పరీక్షల నిర్వహణ; డిసెంబర్‌ 8న ఫలితాలు విడుదలయ్యాయి. మెయిన్స్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇంటర్వ్యూ(పర్సనాలిటీ టెస్ట్‌)కు హాజరు కావాల్సి ఉంటుంది. రాత పరీక్ష(ప్రిలిమ్స్, మెయిన్స్), ఇంటర్వ్యూ, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.


ఫేజ్‌-1 (జనవరి 2 - ఫిబ్రవరి 16) ఇంటర్వ్యూ షెడ్యూలు


ఫేజ్‌-2 (ఫిబ్రవరి 19 - మార్చి 15) ఇంటర్వ్యూ షెడ్యూలు 


ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 15 నుంచి 24 వ‌ర‌కు సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మెయిన్ పరీక్ష ఫలితాలు డిసెంబరు 8న యూపీఎస్సీ విడుదల చేసింది. మెయిన్ పరీక్షలకు హాజరైన అభ్యర్థుల్లో మొత్తం 2,844 మంది ఇంటర్వ్యూలకు  అర్హత సాధించారు. మెయిన్ పరీక్ష ద్వారా ఎంపికైన అభ్యర్థుల‌ను ఇంట‌ర్వ్యూ (ప‌ర్సనాలిటీ టెస్ట్‌)కు షార్ట్ లిస్ట్ చేశారు. వీరికి ఢిల్లీలోని యూపీఎస్సీ కార్యాల‌యంలో ఇంట‌ర్వ్యూ నిర్వహిస్తారు. 


గత మే నెలలో జరిగిన ప్రాథమిక పరీక్షకు సుమారు 5.5 లక్షల మంది హాజరుకాగా.. అందులో 14,624 మంది ప్రధాన పరీక్షలకు అర్హత సాధించారు. వచ్చే జనవరిలో మొదలయ్యే ఇంటర్వ్యూలకు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 90 మంది వరకు ఎంపికయ్యారని అంచనా. గతేడాది ఏపీ, తెలంగాణ నుంచి మొత్తం 40 మంది వరకు సివిల్ సర్వీస్ కొలువులకు ఎంపికయ్యారు.


యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబరు 16, 17, 18, 24, 25 తేదీల్లో సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆయా తేదీల్లో రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించారు. ఉదయం 9 గం. నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. అంతకుముందు సివిల్‌ సర్వీసెస్‌–2022 ప్రిలిమ్స్ ప‌రీక్ష జూన్ 5న ఉద‌యం పేప‌ర్‌-1 (జ‌న‌ర‌ల్ స్డడీస్) ప‌రీక్షను యూపీఎస్సీ నిర్వహించింది. ఈ పేపర్‌–1 ప్రశ్నప‌త్రంలో 100 ప్రశ్నలు 200 మార్కుల‌కు నిర్వహించారు. అలాగే మ‌ధ్యాహ్నం పేపర్‌–2(అప్టిట్యూడ్‌ టెస్ట్‌–సీశాట్‌)ను 80 ప్రశ్నలతో 200 మార్కుల‌కు నిర్వహించారు. జులై 12న ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. మెయిన్స్ పరీక్షకు మొత్తం 11,845 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. 


యూపీఎస్‌సీ ఈ ఏడాది 1011 ఖాళీలను ప్రకటించింది. గత ఏడాది కంటే 300 ఎక్కువగా ఉన్నాయి. గత ఐదేళ్లతో పోలిస్తే 2021లో ప్రకటించిన ఖాళీలు చాలా తక్కువ. సివిల్ సర్వీసెస్ పరీక్ష నుంచి రైల్వే సర్వీసెస్‌ను తొలగించడం వల్ల ఇలా ఖాళీల సంఖ్య తగ్గింది. ఈ సంవత్సరం వాస్తవంగా ప్రకటించిన ఖాళీలు 861. ఆ తర్వాత రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీసెస్‌కు చెందిన 150 ఖాళీలను ప్రభుత్వం జోడించడంతో మొత్తం 1011 ఖాళీలు ఏర్పడ్డాయి. గత ఏడాదితో పోలిస్తే ఖాళీలు 42 శాతం పెరిగాయి.


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...