Padma Bhushan Mithun Chakraborty: గౌరంగ చక్రవర్త నుండి మిథున్ చక్రవర్తిగా సాగిన ఆయన ప్రయాణం ఒక బాలీవుడ్ సిచేసేవారుటుంది. అందులో చాలా ట్విస్టులు ఉంటాయి. సాధారణ స్థాయి నుండి దేశంలోని అత్యధిక ట్యాక్స్ కట్టేవారిలో ఒకరిగా నిలిచారు మిథున్. 80వ దశకంలో డిస్కో డ్యాన్సర్‌‌గా గుర్తింపు తెచ్చుకున్న మిథున్ చక్రవర్తికి ప్రభుత్వం.. పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది. దీంతో ఫ్యాన్స్ అంతా మరోసారి ఆయన బాలీవుడ్ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటున్నారు.


బీ గ్రేడ్ స్టార్..


మిథున్ చక్రవర్తికి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాలని ఆశ ఉన్నా.. మొదట్లో మేకర్స్ అంతా ఆయన కలర్‌ను చూసి వెటకారంగా మాట్లాడేవారు. అన్ని దాటి బాలీవుడ్‌లో మంచి పేరును దక్కించుకున్న తర్వాత కూడా బాలీవుడ్‌లోని కొందరు ఆయనను బీ గ్రేడ్ స్టార్, సీ గ్రేడ్ స్టార్ అంటూ తక్కువ చేసి మాట్లాడేవారు. కానీ అవేవి ఆయన ఎదుగుదలను ఆపలేకపోయాయి. 80ల్లో మిథున్ చక్రవర్తి బాలీవుడ్‌ను ఒక ఆట ఆడించారు. అంతే కాకుండా ఆయనకు ‘పేదవారి అమితాబ్ బచ్చన్’ అని పేరు కూడా వచ్చింది. అంటే అమితాబ్ బచ్చన్‌లాంటి పెద్ద స్టార్లను పెట్టి సినిమా తీయలేని నిర్మాతలు.. మిథున్ చక్రవర్తిని హీరోగా ఎంపిక చేసేవారు. ఇది మాత్రమే కాదు.. ప్రేక్షకులు ఇంకా ఆయనకు ఎన్నో పేర్లు పెట్టుకున్నారు. అంతే కాకుండా చాలాసార్లు ఆయనను ఫ్లాప్ హీరో అని ప్రకటించినా.. మళ్లీ కమ్ బ్యాక్ ఇస్తూనే వచ్చారు మిథున్.


డబ్బులు లేవు..


ముంబాయ్‌లో ఎక్కువగా పార్టీలు జరుగుతూ ఉండేవి. అలాంటి పార్టీలకు మిథున్ చక్రవర్తి ఎక్కువశాతం దూరంగానే ఉండేవారు. కానీ ఎప్పుడో ఒకసారి ఆయన పార్టీలకు వెళ్లినప్పుడు మాత్రం అమితాబ్ బచ్చన్, వినోద్ ఖన్నాలాంటి స్టార్ హీరోలను వదిలేసి మీడియా అంతా మిథున్ చుట్టూ చేరుకునేవారు. కెరీర్ మొదట్లో ఆయన సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసేవారు. దాని వల్ల వచ్చే డబ్బు కనీసం ఆయన రోజూవారీ అవసరాలకు కూడా సరిపోయేది కాదట. ఒకసారి ఒక జర్నలిస్ట్.. మిథున్ ఇంటర్వ్యూ కోసం వస్తే ఆయన లంచ్‌కు డబ్బులు ఇస్తేనే ఇంటర్వ్యూలో ఇస్తానని చెప్పారట. ‘సురక్ష’ అనే సినిమాలో ఇతర స్టార్లను ఇమిటేట్ చేస్తూ ఆయన చేసిన డ్యాన్స్ ఒక రేంజ్‌లో పాపులారిటీ తెచ్చిపెట్టింది. ఎన్నో ఆఫర్లు కూడా వచ్చాయి. కానీ అన్ని డ్యాన్సర్ పాత్రలే వచ్చాయి. దీంతో బాలీవుడ్‌లో మిథున్‌కు ‘నేషనల్ డ్యాన్సింగ్ సెన్సేషన్’ అని గుర్తింపు దక్కింది.


మణిరత్నం లాంటి దర్శకులు..


80ల్లో అమితాబ్ బచ్చన్, రాజేశ్ ఖన్నాలాంటి హీరోలు బాలీవుడ్‌ను ఏలుతున్న సమయంలో ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా, పెద్ద డైరెక్టర్లతో పనిచేయకుండా స్టార్‌గా ఎదిగి అందరినీ ఆశ్చర్యపరిచారు మిథున్ చక్రవర్తి. ఆయనను డైరెక్ట్ చేయడం వల్లే బీ గ్రేడ్ డైరెక్టర్స్ అంతా ఏ గ్రేడ్‌గా మారిపోయారు. తనతో పాటు పలు డైరెక్టర్ల కెరీర్ గ్రాఫ్ కూడా పెరిగిపోయింది. ‘తాహేదార్ కథ’, ‘స్వామి వివేకానంద’ వంటి చిత్రాలకు మిథున్‌కు నేషనల్ అవార్డ్ కూడా దక్కింది. ‘స్వామి వివేకానంద’ చిత్రంలో రామకృష్ణ పరమహంస అనే పాత్ర మిథున్ కెరీర్‌లోనే బెస్ట్ అని ఇప్పటికీ ప్రేక్షకులు మాట్లాడుకుంటారు. ఈ సినిమా తర్వాత మణిరత్నం లాంటి దర్శకులు సైతం ఆయనతో సినిమాలు చేయాలనుకున్నారు. పెద్ద దర్శకులతో సినిమాలు చేయడం కోసం మిథున్ ఎప్పుడూ తప్పుడు దారిలో వెళ్లేవారు కాదు. 80ల్లో రష్యాలో సైతం మిథున్ డిస్కో డ్యాన్స్‌కు ఫ్యాన్స్ ఉండేవారు. 


Also Read : ఒకే ఫ్రేంలో 'పద్మవిభూషణు'లు -  ఒకరికొకరు ఆత్మీయ అభినందన