Telangana culture Nagoba Jaathara : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లో ఐదురోజుల పాటూ జరిగే గిరిజన జాతర 'నాగోబా' 



  • లోకమంతా చీకటిలో నిండిఉండే అమావాస్య అర్థరాత్రి జాతర ప్రారంభం...

  • ఏటా పుష్యమాసంలో వచ్చే అమావాస్య రోజు నాగోబాకి అభిషేకం చేసి జాతరకు శ్రీకారం చుడతారు

  • ఐదు రోజుల పాటూ కన్నులపండువగా జరిగే జాతర ఇది2024 లో ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభం..ఫిబ్రవరి 11న దర్బార్

  • పుష్యమాస పౌర్ణమి నుంచి జాతర సందడి మొదలైపోతుంది

  • మేస్రం వంశీయులు కెస్లాపూర్ నుంచి కలమడుగు పాదయాత్రగా వెళ్లి గోదావరి నీళ్లు తీసుకొచ్చి నాగదేవతకి అభిషేకం నిర్వహిస్తారు

  • ఐదు రోజులు వైభవంగా జరిగే జాతరలో మూడోరోజు నిర్వహించే దర్బార్ చాలా చాలా ప్రత్యేకం


Also Read:  నాగోబా జాతర చరిత్ర ఏంటి - ఇందులో నిర్వహించే 'భేటి కొరియాడ్' గురించి తెలుసా!


అమావాస్య అర్థరాత్రి జాతర మొదలు


2024 ఫిబ్రవరి 9 పుష్యమాస అమావాస్య అర్థరాత్రి నాగదేవతకి పవిత్ర గోదావరి నదీజలాభిషేకంతో జాతర ప్రారంభమవుతుంది.  తొలినుంచి వస్తున్న ఆచారాలకి అనుగుణంగా జన్నారం మండలం కలమడుగుకు సమీపంగా పారే గోదావరి నుంచి ప్రత్యేకమైన కుండలలో జలాన్ని తీసుకువస్తారు మేస్రం కులస్తులు! వాటితో నాగోబా దైవానికి అభిషేకం జరపడంతో జాతర మొదలవుతుంది. రాత్రంతా నాగదేవతకి మహాపూజ నిర్వహిస్తారు. అది మొదలు వరుసగా 5 రోజులపాటు కోలాహలంగా జాతర కొనసాగుతుంది. ఫిబ్రవరి 11న ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. దీనికి స్థానిక ఎంపీ, మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు జిల్లా అధికారులందరూ హాజరవుతారు. ఈ దర్బార్‌లో గిరిజనులు తమ సమస్యలను అధికారుల దష్టికి తీసుకెళ్లి అక్కడికక్కడే పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది.


Also Read:  నాగోబా జాతరలో నిర్వహించే దర్బార్ కు ఎందుకంత ప్రాధాన్యం!


పౌర్ణమి నుంచి జాతర సందడి


పుష్యమాసంలో వచ్చే పౌర్ణమిరోజు మేస్రం వంశీయులు గిరిజనులతో కలసి కొత్త కుండలతో కెస్లాపూర్ నుంచి కలమడుగు దాదాపు 80 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారు. స్నానమాచరించి గోదారమ్మకి ప్రత్యేక పూజలు చేసి  అక్కడే దంపుడు బియ్యంతో ప్రత్యేక వంటకాలు చేసి నైవేద్యం సమర్పస్తారు. పవిత్ర జలం కోసం కళశ పూజ చేసి..కుండలలో గోదావరి జలాలు సేకరించి కేస్లాపూర్ కు తిరుగు పయనం అవుతారు. తెల్లని దుస్తులు ధరించి కాలినడనకన చేపట్టిన మెస్రం వంశీయుల పాదయాత్ర రహదారిలో చెట్టు గుట్టల మధ్యలో చీమల దారలా కనిపిస్తుంది. పవిత్ర గంగాజలంతో బయలుదేరిన పాదయాత్ర తిరిగి ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లికి చేరుకుని ఇంద్రాదేవి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. పుష్యమాస అమావాస్య అర్థరాత్రి ఫిబ్రవరి 9 న నాగోబాకి అభిషేకంతో జాతర ప్రారంభమవుతుంది. 


Also Read: భర్త దగ్గర భార్య కామన్ గా దాచే 6 ముఖ్యమైన విషయాలు!


22 పొయ్యిల మీదే వంట


జాతరకు వచ్చే మెస్రం వంశీయులు వేల మంది ఉన్నా వారు వంట చేసుకునేది మాత్రం 22 పొయ్యిల మీదే. ఈ పొయ్యిలు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రహరీ గోడ లోపల, గోడకు చుట్టూ దీపాలు వెలిగించేందుకు ప్రత్యేక అరలు ఉన్నాయి. ఆ దీపాల కాంతుల వెలుగులో 22 పొయ్యిల్లో మెస్రం వంశీయుల వంతుల వారిగా వంట చేసుకుంటారు. మిగిలిన వారు ఎక్కడైనా వంట చేసుకోవచ్చు. 


1946 లో మొదటి  దర్బార్


నాగోబా జాతర సందర్భంగా ఏర్పాటయ్యే దర్బార్‌కు ఒక ప్రత్యేకత, చరిత్ర ఉన్నాయి. 63 ఏడేళ్ల క్రితం మారుమూల గ్రామాలకు ఎలాంటి సౌకర్యాలు లేవు. నాగరికులంటేనే ఆదివాసులు చూసి భయపడే పరిస్థితులు. అందుకే ఆ గిరిజనుల వద్దకు అధికారులెవరు వెళ్లేవారు కాదు. అప్పుడే భూమి కోసం  విముక్తి కోసం సాయుధ పోరాటం చేసి కొమురం భీం మరణించిన సంఘటన జరిగింది. దీంతో ఉలిక్కిపడ్డ నిజాం ప్రభువులు గిరిజన ప్రాంతాల పరిస్థితులు, గిరిజనుల స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ హైమన్‌డార్ఫ్ ను ఆదిలాబాద్‌ జిల్లాకు పంపారు. ఆయన దృష్టి జాతరపై పడింది. కొండలు, కోనలు దాటి వచ్చే గిరిజనుల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు ఇదే సరైన వేదిక అని భావించారాయన. అప్పటి నుంచి గిరజనులంతా ఓ చోట చేరే నాగోబా జాతరలో దర్బార్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు.ప్రొఫెసర్‌ హైమన్‌డార్ఫ్ 1946లో మొదట సారి దర్బార్ నిర్వహించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో ఈ దర్బార్  కొనసాగిస్తున్నారు. జాతర చివరి రోజున జరిగే ఈ దర్బార్‌కు గిరిజన పెద్దలు, తెగల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరవుతారు. 


Also Read: మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో మీ రాశి చెప్పేస్తుంది!


ఈ జాతరకు మన రాష్ట్రం నుంచే కాక మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి భక్తులు హాజరై మొక్కులు తీర్చుకుంటారు.