Nindu Noorella Saavasam Serial Today Episode: ఎపిసోడ్ ప్రారంభంలో మనం అనుకున్నది వేరు అక్కడ జరుగుతున్నది వేరు. అందరూ ఆ బంటి గాడికే సపోర్ట్ చేస్తున్నారు వాడు ఎర్లీగా వచ్చి అందరితో మాట్లాడాడంట. వాడి వెనక ప్రిన్సిపల్ ఉండి ఇదంతా చేయిస్తుందట అంటాడు ఆనంద్.


అంజు: అదేంటి మనం అన్ని సెట్ చేసి పెట్టాం కదా అంటుంది. వెళ్లి బంటి గాడితో పోట్లాడతాను అంటుంది.


రామ్మూర్తి : వద్దమ్మా వాడితో పోట్లాడకు ఇదే అలుసుగా తీసుకొని ఆ ప్రిన్సిపాల్ నిన్ను స్కూల్ నుంచి బయటికి పంపించేస్తుంది. అసలే నీపై తనకి కోపం ఎక్కువ అంటాడు.


అమ్ము : పేరు ఇచ్చేటప్పుడే ఆలోచించి ఉంటే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు అని బాధపడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.


ఆనంద్ : చూడు అక్క నీవల్ల ఎంత బాధ పడుతుందో అని అంజు ని మందలించి వెళ్ళిపోతారు. అంజు కూడా బాధపడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.


రామ్మూర్తి: బాధపడుతూ ఈ తల్లి లేని పిల్లల్ని మోటివేట్ చేయడానికి ఎవరూ లేరా అని మనసులో అనుకుంటాడు.


అరుంధతి: నేనున్నాను నా పిల్లలకి ధైర్యం చెప్తాను ఎలాగైనా నా పిల్లని గెలిపించుకుంటాను అంటుంది. కానీ ఎప్పటిలాగే ఆమె మాటలు ఎవరికీ వినిపించవు.


మరోవైపు ఎవరో డోర్ కొట్టడంతో తమ్ముడిని వెళ్లి తలుపు తీయమంటుంది మంగళ. తలుపు తీసిన కాళీ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంట్రా అలా ఉండి పోయావు ఎవరు వచ్చారు అని మంగళ కూడా డోర్ దగ్గరికి వచ్చిచూసి ఎదురుగా మనోహరి ఉండడం చూసి షాక్ అవుతుంది.


మనోహరి : గుమ్మం దాకా వచ్చిన లక్ష్మీదేవిని ఇంట్లోకి రానివ్వరా ఏంటి అని అడుగుతుంది.


మంగళ: ఏం లక్ష్మీదేవి, అనుకోవడమే కానీ ఇప్పటివరకు ఏ లక్ష్మీదేవి చేతి వరకు రాలేదు అంటుంది.


మనోహరి : భాగమతితో నీ తమ్ముడు పెళ్లి చేసి ఆ ఇంటి నుంచి తీసుకువచ్చేస్తే 50 లక్షలు ఇస్తాను అని చెప్పి లక్ష రూపాయలు అడ్వాన్స్ మంగళ చేతిలో పెడుతుంది .


మంగళ: ఆనందపడిపోతూ డబ్బుతో కొట్టారు కదా ఇంక మీ పని అయిపోయినట్లే అంటుంది. దాంతో మనోహరి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.


మంగళ: మన ఊరికి వెళ్లి పచ్చి పసరు తీసుకురా అని చెప్పి తమ్ముడికి చెప్తుంది. అది ఎందుకు ఇప్పుడు, అది తింటే చచ్చిపోతారు అంటాడు కాళీ. చెప్పిన పని చేయు అని కసిరి పంపించేస్తుంది మంగళ. 50 లక్షలు చేతికి వస్తాయి అంటే ఏం చేయడానికైనా సిద్ధమే అని మనసులో అనుకుంటుంది.


మరోవైపు రోడ్డుపై నడుచుకుంటూ వస్తుంది మిస్సమ్మ. అప్పుడే అమర్ కి ఆర్ జె తో మాట్లాడాలనుకున్నాను మర్చిపోయాను అని చెప్పి ఆమెకి ఫోన్ చేస్తాడు. అయితే ఆర్ జె మిస్సమ్మ అని అమర్ కి తెలియదు. ఫోన్ లిఫ్ట్ చేసిన మిస్సమ్మ కి కూడా ఫోన్ చేసింది అమర్ అని తెలియదు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఎదురుపడతారు.


అమర్: ఫోన్ పక్కన పెట్టి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు.


మిస్సమ్మ : స్కూల్ కి వెళ్తున్నాను ఈరోజు ఎలక్షన్స్ కదా అమ్ము వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో అందుకే వెళ్తున్నాను అంటుంది.


అమర్: అయితే పద నేను డ్రాప్ చేస్తాను అంటాడు.


మిస్సమ్మ ఒక నిమిషం ఉండమని చెప్పి పక్కకు వెళ్లి ఫోన్లో మాట్లాడుతూ ఇప్పుడు నేను అర్జెంట్ పనిలో ఉన్నాను తర్వాత మాట్లాడతాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. అమర్ ఏంటి ఈ పిల్ల ఎప్పుడు మాట్లాడదామన్నా ఏదో ఒక బిజీగా ఉంటుంది అనుకుంటాడు. తర్వాత మిస్సమ్మ, అమర్ ఇద్దరు స్కూల్ కి వెళ్తారు.


ఆ తర్వాత అమ్ము గెలిచిందో లేదో అని టెన్షన్ పడుతూ ఉంటాడు అమర్ తండ్రి. ఇంతలో డల్ గా ఇంటికి వచ్చిన పిల్లల్ని అమర్ వాళ్ళని చూసి ఏం జరిగింది అని అడుగుతారు. ఎవరు ఏమీ మాట్లాడకపోవటంతో పోనీలే అమ్ము ఓడిపోతే వచ్చే నష్టం లేదు అనుభవం వస్తుంది అంటారు.


అంజలి: అప్పుడు అక్క గెలిచింది అని చెప్తుంది. అందరూ ఆనందంతో గంతులు వేస్తారు. 


అమర్ తండ్రి: మీరందరూ కలిసి మమ్మల్ని బురిడీ కొట్టించారన్నమాట అంటాడు.


ఆ మాటలకి అందరూ నవ్వుకుంటూ ఉంటారు ఇదంతా చూస్తున్న అరుంధతి నా కుటుంబాన్ని ఇలా చూసి ఎంత కాలం అయింది అని ఎమోషనల్ అవుతుంది. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.


Also Read: చిరంజీవికి ముందు పద్మ విభూషణ్ అందుకున్న హీరోలు ఎవరు... ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరెవరికి పద్మ విభూషణ్ పురస్కారాలు వచ్చాయో తెలుసా?