Trinayani Today Episode: తిలోత్తమ ఆ పెట్టె తీసుకొని రమ్మంటే ఎందుకు వచ్చావని నయని విశాల్ ప్రశ్నిస్తుంది. తిలోత్తమ గాయత్రీ దేవి చీరను పాప మీద వేయాలి అనుకుంటే హాసిని ఎందుకు అమ్మవారు పూనినట్లు నటించాల్సి వచ్చిందని విక్రాంత్ విశాల్‌ని ప్రశ్నిస్తాడు. ఇక విక్రాంత్ విశాలే తమ దగ్గర చాలా విషయాలు దాస్తున్నాడు అని తన వదిన నయనితో చెప్తాడు.
తిలోత్తమ: (సుమన నగలు ముందు వేసుకొని వాటి గురించి పేపర్‌లో రాసుకుంటే చూసి) చిన్న కోడలా..
వల్లభ: చిన్న కోడలా అనకు మమ్మీ స్వర్ణ కోడలా అను. ఎంత బంగారం ఉందో చూడు.
సుమన: దిష్టి పెట్టకండి బావగారు.
తిలోత్తమ: సర్లేకాని ఎందుకు ఇలా పెట్టుకున్నావ్.
సుమన: కొన్ని కోట్లు విలువ చేసే బంగారు నగలు నా దగ్గర ఉన్నాయి కదా అత్తయ్య ధర పెరిగి 25 లక్షలు లాభమే వచ్చి ఉంటుంది.
తిలోత్తమ: అమ్మేస్తావా ఏంటి.
సుమన: కాదు. ఎంత జాగ్రత్త చేసినా ఎవరైనా తీసేస్తారు ఏమో అని భయంగా ఉంది అత్తయ్య. నెల దాటాకా పండగలు ఏం లేవు కదా. బ్యాంక్ లో పెడదాం అనుకుంటున్నాను.
వల్లభ: నీ ఎకౌంట్‌లో డబ్బులు ఏం లేనప్పుడు లాకర్ సదుపాయం ఇవ్వరు సుమన.
సుమన: అలాగా బావగారు.
తిలోత్తమ: మరేం పర్లేదు సుమన నా లాకర్‌లో పెట్టుకో.
సుమన: నీ దగ్గర పెట్టుకుంటే నావి ఎలా అవుతాయి అత్తయ్య.
తిలోత్తమ: వీడి మాటలకు ఏం కానీ ఆ నగలు నా లాకర్‌లో పెడతాను మూట కట్టు. సుమన: ఇక్కడ సంతకం పెట్టు. నా నగలు మీరు తీసుకొని మీ లాకర్‌లో పెడుతున్నా అని రాసి సంతకం పెట్టండి. మరోవైపు బయట నుంచి గాయత్రీ పాప చూస్తూ ఉంటుంది. ఇక వల్లభ సంతకం కూడా పెడుతుంది. ఇక ఆ నగలను వల్లభ మూట కడతాడు.
వల్లభ: అవును మారి మాకు ఏంటి అంట.
సుమన: మీ రుణం ఉంచుకోను బావగారు. లాభం వస్తే పావలా వాటా అత్తయ్యకు ఇస్తాను.
తిలోత్తమ: ఆ మాట చాలు సుమన.
సుమన: తేడా వస్తే ఆరు కోట్లు వసూలు చేస్తాను అని వీళ్లకు తెలీదు కాబోలు..
మరోవైపు వల్లభ ఆ నగలు తన గదికి తీసుకొస్తాడు. వాటిని చూసి అవి తనకే అన్నట్లు ఫీలవుతాడు. ఇంతలో బయట నుంచి గాయత్రీ పాప, గానవి పాప చూస్తూ ఉంటారు. వల్లభకు డౌట్ వచ్చి బయట చూస్తే ఎవరూ ఉండరు. ఇక ఫోన్ రావడంతో వల్లభ మాట్లాడుకుంటూ దూరంగా వెళ్లిపోతాడు. నగలు బెడ్ మీద ఉండగా గాయత్రీ పాప మరో పాప వాటి దగ్గరకు వస్తారు. వాటిని పట్టుకోవడం ఎద్దులయ్య చూస్తాడు. ఇద్దరూ కలిసి నగలను తమ బట్టల్లో దాచుకొంటారు.
ఎద్దులయ్య: గాయత్రీ అమ్మ ఏంటి ఈ చిలిపి పనులు. గత జన్మలో మీరు కొన్ని వందల మందికి దానం చేశారు. ఈ పునర్జన్మలో నగలు దొంగిలించడం ఏంటి తల్లీ. నా మాట వినకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తున్నావు అంటే ఈ కార్యం వెనుక ఏదో కారణమే ఉంటుంది. సరే నీ ఇష్టం వచ్చినట్లు చేయు అమ్మ. ఈ మిగిలిన నగలు చిట్టి మాత గదిలో ఉండాలి.
విక్రాంత్: ఎద్దులయ్య నువ్వు ఈ గదిలో ఉన్నావే.. వీళ్లు ఇక్కడ ఉన్నారేంటి. ఇద్దరినీ విక్రాంత్ తీసుకొని బయటకు వెళ్తాడు.
నయని: అక్క గాయత్రీ, గానవిలకు టీకా వేయించుకొని వస్తావా.. నాకు బాబుగారు ఫారిన్ డెలికేట్స్‌తో వీడియో కాన్ఫిరెన్స్ ఉంది.
హాసిని: సరే..
వల్లభ: వచ్చి చూసే సరికి నగలు కనిపించవు. మమ్మీ మమ్మీ అని అరుస్తూ.. మమ్మీ చిన్న మరదలు ఇచ్చిన క్లాత్ మాత్రమే ఉంది.
సుమన: బావగారు ఆ క్లాత్‌తో నా నగలు పెట్టి ఇచ్చాను కదా.
విక్రాంత్: ఏంట నగలు పోయాయా వెరీ గుడ్.
ఎద్దులయ్య: ఏం జరిగింది పొడుగు మాతా..
ధురందర: బంగారు పోయింది నీ చేతి వాటం ఉందేమో అని..
నయని: పిన్ని ఎద్దులయ్యని కలలో కూడా అనుమానించకు.
తిలోత్తమ: నగలు మా బ్యాంక్ లాకర్‌లో భద్రంగా దాచమని అడిగింది. సరే అని మేం సంతకాలు పెట్టిన పేపర్ కూడా ఇచ్చాం.
హాసిని: మరి ఇంకేం మీరే దానికి డబ్బులు ఇవ్వండి.
సుమన: మూడు కోట్లు ఇస్తే కొత్త నగలు కొనుకుంటా.
విశాల్: ముందు ఆ నగలు ఎవరు తీశారో తెలుసుకోండి.
సుమన: నా నగల సంగతి ఏంటి ఎవరూ ఇవ్వకపోతే ఎలా.
విశాల్: సుమన ఎవరూ ఇవ్వకపోతే ఎలా అన్నయ్య, అమ్మ ఇస్తారు. కానీ కాస్త టైం ఇవ్వు. ఈ లోపు నీ నగలు తీసినవారు ఎవరో తెలిస్తే ఈ సమస్యే ఉండదు.
తిలోత్తమ: ఎవరికి వాళ్లు మీ పనులు చేసుకుంటే సుమన మమల్ని బ్లేమ్ చేస్తుంది. నగలు దొరికిన వరకు ఎవరూ కాలు గడప దాటడానికి వీలు లేదు. ఎద్దులయ్య నువ్వే బయటకు వెళ్లి వచ్చావు నగలు ఇంట్లో దొరకకపోతే నిన్నే అనుమానించాల్సి వస్తుంది.
ఎద్దులయ్య: నేను తీయలేదు మాత గడ్డితిందును గానీ. నా బుద్ధి గడ్డి తినదు.
తిలోత్తమ: ఎద్దులయ్య ఇటురా పోలీస్ కంప్లైంట్ ఇస్తే నీ పని అయిపోతుంది.
ఎద్దులయ్య: నేను ముట్టలేదు అంటే వినరా మాతా.
తిలోత్తమ: నీ నోటి నుంచి నిజం మేం వింటాం కదా ఇప్పుడు. చేయి చాచు. ప్రమాణం చేస్తున్నట్లు తిప్పు. గారడీ పాప మీద ఒట్టు వేసి చెప్పు ఆ నగలు నువ్వు చూడనే లేదు అని..
ఎద్దులయ్య: అంత మాట ఎందుకు మాతా ఆ నగలు నేను చూశాను. ఒకరు తీయడం చూశాను. ఎలా చెప్పాలి.. ఏ విధంగా చెప్పాలి.. ఎవరో కాదు మాతలు గాయత్రీ అమ్మ తీసింది. అని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: నాగపంచమి సీరియల్ జనవరి 25th: మోక్షని చీదరించుకున్న పంచమి.. ఫణేంద్రకు ఓ అవకాశం ఇచ్చిన నాగదేవత!