Chanakya Niti In Telugu: అప్పటి పరిస్థితులకు అనుగుణంగా చాణక్యుడు చెప్పిన మాటలు, చేసిన బోధనలు ఎప్పటికీ ఆచరణీయంగానే ఉంటాయి. ముఖ్యంగా మనుషుల వ్వవహారశైలికి సంబంధించి చెప్పిన మాటలు ప్రతి ఒక్కరి జీవితానికీ ఎంతో ఉపయోగపడతాయి. ఎలా ప్రవర్తించాలి -ఎలా ప్రవర్తించకూడదో అనే విషయాలపై ఓ స్పష్టతని ఇస్తాయి. ముఖ్యంగా రిలేషన్ షిప్ గురించి చాణక్యుడు చాలా విషయాలు చెప్పాడు. ఆరోగ్యకరమైన రిలేషన్ షిప్ నమ్మకం, నిజాయితీపై ఆధారపడి ఉంటుంది. పారదర్శకత ఆ బంధాన్ని మరింత అందంగా మార్చుతాయి. తన అనుకున్న వ్యక్తితో ప్రతి విషయం పంచుకోవాలి అనుకుంటారు. అయితే ఎంత నమ్మకంగా ఉన్నా...కొన్ని విషయాలు మాత్రం ఇద్దరూ ఒకరి దగ్గర మరొకరు సీక్రెట్ గా ఉంచుతారు. ముఖ్యంగా ప్రతి భార్యా..తన భర్త దగ్గర ఈ 6 విషయాలు దాచిపెడుతుంది. ఇవి దాచిపెడితేనే ఇద్దరి మధ్యా మనస్పర్థలు రాకుండా, ఆ బంధం చెడిపోకుండా ఉంటుందన్నది చాణక్యుడి భావన.
Also Read: చాణక్య నీతి: పెళ్లికి ముందే ఈ నాలుగు విషయాలపై క్లారిటీ తెచ్చుకోవడం మంచిది
రహస్య సంబంధం (Secret Crush)
ప్రతి స్త్రీకి సీక్రెట్ క్రష్ ఉంటుందంటాడు చాణక్యుడు. అది ఏ దశలో అయినా కావొచ్చు కానీ వేరొక వ్యక్తిని ఇష్టపడే సందర్బం ఆమె జీవితంలో తప్పనిసరిగా ఉంటుంది. ఈ విషయాన్ని ఏ భార్యా...భర్తకు చెప్పాలి అనుకోదు. తన సన్నిహితుడికి సంబంధించిన ఏ విషయాన్నీ జీవిత భాగస్వామి దగ్గర ప్రస్తావించే అవకాశం వచ్చినా అస్సలు పంచుకోదు.
ఓకే అంటుంది కానీ..(Agrees (but doesn't agree) on most issues)
చాలా విషయాలపై అంగీకరించినట్టే కనిపిస్తుంది కానీ నచ్చకపోయినా నో అనిమాత్రం చెప్పలేదు. కొన్నిసార్లు భర్త తీసుకునే నిర్ణయాలు ఆమెకు నచ్చకపోయినా కానీ ఆ విషయం చెప్పకుండా ఓకే అనేస్తుంది.
కలయిక తర్వాత నిజం చెప్పరు (Feeling of satisfaction after sex)
శృంగారం తర్వాత కూడా ప్రతి భార్యా భర్తకు అబద్ధం చెబుతుందన్నది చాణక్యుడి భావన. సాధారణంగా మగవారి కన్నా ఆడవారిలో కోర్కెలు ఎక్కువని చెప్పిన చాణక్యుడు...సెక్స్ తర్వాత వారు పూర్తిగా సంతృప్తి చెందకపోయినా కానీ జీవిత భాగస్వామి అడిగితే నిజం చెప్పరు.
Also Read: పడకగది పనులు కూడా బహిరంగం.. కాకిని చూసి ఈ విషయాలు నేర్చుకోవాలన్న చాణక్యుడు
సీక్రెట్ సేవింగ్స్ ( Wives hide savings)
సంపాదించే భార్య అయినా, గృహిణి అయినా కానీ నూటికి నూరుశాతం మహిళలు భర్తకు తెలియకుండా పొదుపు చేస్తారు. అందుకే గృహలక్ష్మి అంటారు. సంక్షోభ సమయంలో ఆదుకునే బ్యాంక్ ఇది. కుటుంబానికి అత్యవసర సమయం వచ్చినప్పుడు ఉపయోగపడేవి ఈ డబ్బులే.
అనారోగ్యం చెప్పరు (Their ailment)
తొందరగా అలసిపోయినా, అనారోగ్యం పాలైనా కానీ ఆ విషయం జీవితభాగస్వామికి చెప్పాలని అనుకోరు. అవే తగ్గుతాయిలే అని సర్దుకుపోతూ కుటుంబ సభ్యులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని అనుకుంటారు.
అభిప్రాయ బేధాలు ( Reveal issues, but not let the man know)
జీవిత భాగస్వామితో ఉండే అభిప్రాయ బేధాలను చాలామంది భార్యలు వారితో కాకుండా మూడో వ్యక్తితో పంచుకుంటారు. భర్త దగ్గర మాత్రం తమ భావోద్వేగాలను దాచుకుని సర్దుకుపోతారు.
Also Read: కింగ్ అవ్వాల్సిన కొడుకుని కురూపిగా మార్చేసిన తండ్రి, కానీ..చాణక్యుడికి అదే వరమైంది..
ఈ రహస్యాలేవీ ప్రమాదకరమైనవి కాదు..ఇలాంటి విషయాలు చెప్పడం వల్ల ఇద్దరి మధ్యా సమస్యలు పెరుగుతాయి. అందుకే ఎంత పారదర్శకంగా ఉండే బంధం మధ్య అయినా కొన్ని రహస్యాలుండడం మంచిదే అన్నది చాణక్యుడి ఉద్దేశం...