Chanakya Neeti Telugu:  ప్రతి ఒక్కరి జీవితం లో పెళ్లి ముఖ్యమైన ఘట్టం. అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళ జీవితంలోకి వచ్చే భాగస్వామిని ఏరికోరి ఎంపిక చేసుకుంటారు. తనతో జీవితాంతం సంతోషంగా ఉండాలని, కష్టం, సుఖం, సంతోషంలో అన్నింటా తనతో కలసి నడవాలని ఆరాటపడతారు. కుటుంబంలో సంతోషాలొచ్చినా, ఇబ్బందులొచ్చినా ఒకరికొకరు అండగా నిలవాలనుకుంటారు. మరీ ముఖ్యంగా కన్నవారిని వదులుకుని తన చేయి పట్టుకుని అడుగుపెట్టే భార్య..తన కుటుంబంలో అందరికో బాగా కలసిపోవాలని, అందర్నీ కలుపుకుని పోవాలని, అన్నింటా భాగం కావాలని...  ఈ కుటుంబమే సర్వశ్వం అనుకునేలా ఉండాలని ఆశించని అబ్బాయిలుండరు. అయితే చాలామంది జీవితం పెళ్లికి ముందు ఒకలా ఉంటే పెళ్లైన తర్వాత ఉన్నపాటుగా మారిపోతుంది. ఆనందంగా ఉంటామని, అందమైన జీవితాన్ని ఊహించుకున్న జంటలను చిన్న చిన్న సంఘటనలు కలవరపెడతాయి. చిన్నగా మొదలైన మనస్పర్థలు పెరిగి ఏకంగా విడిపోయేవరకూ పరిస్థితులు వెళ్లిపోతాయి. నీ గురించి అలా అనుకున్నా అలా అనుకున్నా అంటూ ఒకరిపై మరొకరు అభాండాలు వేస్తూ గోటితే పోయేదాన్ని గొడ్డలివరకూ తెచ్చుకుంటారు...చిన్న చినుకులను తుఫానుగా మార్చేసుకుంటారు. అందుకే పెళ్లిచేసుకునే ముందే అమ్మాయిలో ఈ నాలుగు లక్షణాలను గమనించాలని చెప్పాడు ఆచార్య చాణక్యుడు. ఆ విషయాన్ని చిన్న శ్లోకం ద్వారా తెలియజేశాడు.


Also Read: ఓదార్పు అంటే ఇదీ - ద్రౌపదీ వస్త్రాపహరణం తర్వాత శ్రీకృష్ణుడు-ద్రౌపది మధ్య జరిగిన సంభాషణ అత్యంత ఆసక్తికరం


ప్రతి అబ్బాయి పెళ్ళికి ముందు ఒక అమ్మాయి గురించి ఈ నాలుగు విషయాలను తెలుసుకోవాలని తన నీతిశాస్త్రంలో ఓ శ్లోకం ద్వారా చెప్పాడు ఆచార్య చాణక్యుడు.


వారయేత్  కులజాం  ప్రగ్యో  విరూపమ్పి  కన్యకం 
రూపశిలం  న  నీచస్య  మ్యారేజ్ :  సదృశే  కులే 


పైన శ్లోకం ప్రకారం..పెళ్ళికి ముందు ఆకారాన్ని కాకుండా గుణం చూసి పెళ్లిచేసుకోవాలని చెప్పిన చాణక్యుడు..ముఖ్యంగా నాలుగు విషయాలు గమనించాలన్నాడు. అవేంటంటే


అందం కాదు గుణం చూడాలి
అందంగా కనిపిస్తోంది..ఆకట్టుకునేలా ఉంది..సిగ్గుతో చక్కగా మెలికలు తిరుగుతోందని అమ్మాయి అందం చూసి ఎంపిక చేసుకుంటే ఆ తర్వాత జరిగే పరిణామాలకు మీరే బాధపడాల్సి ఉంటుందని చెప్పిన చాణక్యుడు..మాట్లాడేవిధానం, మంచి గుణం కలిగిన అమ్మాయిని ఎంచుకుంటే జీవితం సంపూర్ణంగా సంతోషంగా ఉంటుందని సూచించాడు చాణక్యుడు. ఇలాంటి అమ్మాయి అయితే కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు పంతాలు, పట్టింపులు పట్టించుకోకుండా తనవంతు సహాయం అందించడంలో ముందుంటుంది


Also Read: పద్మవ్యూహం అనే మాట పదే పదే వాడేస్తుంటాం కానీ.. పద్మవ్యూహం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే.. 


ఓర్పు సహనం ఉండాలి
కుటుంబాన్ని నడిపే మహిళకు ముఖ్యంగా ఉండాల్సింది ఓర్పు, సహనం..ఆ రెండూ లేనప్పుడు వాతావరణం ఎప్పటికీ ఇబ్బందికరంగానే ఉంటుంది. ఓర్పు సహనం మనిషిని చూడగానే అర్థమవుతాయా ఏంటి అని అడగొచ్చు..నిజమే కానీ.. మాట్లాడే విధానం, కొన్ని విషయాలపై స్పందించే తీరుని బట్టి ఆ వ్యక్తికి సహనం, ఓర్పు ఉందో లేదో తెలుసుకోవచ్చంటాడు చాణక్యుడు


సంస్కృతి, సంప్రదాయాలు
ట్రెండ్ కి తగినట్టు ఎలా ఉన్నా, ఎలా మారినా..కుటుంబంలో పాటించాల్సిన కొన్ని పద్దతులుంటాయి. వాటిని పాటించగలదో లేదో ఎలా తెలుసుకోవాలంటే ఆమె పెరిగిన కుటుంబ వాతావరణం గమనించాలి. సంప్రదాయమైన కుటుంబం నుంచి వచ్చినంత మాత్రాన అన్నీ పాటించేస్తారని కాదు..పెరిగిన వాతావరణం ప్రబావం కొంతైనా ఉంటుందన్నది చాణక్యుడి అభిప్రాయం


కోపం
కోపం అమ్మాయిలకు మాత్రమే కాదు ఎవ్వరికైనా ప్రధమ శత్రువు. తన కోపమె తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని ఊరికే చెప్పలేదు. మీ జీవితంలోని అమ్మాయిని ఆహ్వానిస్తున్నప్పుడు ఇదే విషయాన్ని గమనించాలని సూచించాడు చాణక్యుడు. చీటికి మాటికీ కోపం, ఆవేశం ప్రదర్శించే మహిళ ఆ కుటుంబాన్ని ముందుకు నడిపించడంలో విఫలం అవుతుంది.