పడకగది కూడా బహిరంగం అయిపోయిన ఈ రోజుల్లో కాకిని చూసి కొన్ని  విషయాలు నేర్చుకోవాలని అప్పట్లోనే చెప్పిన చాణక్యుడు... సింహం, కుక్క, కాకి, గాడిద నుంచి మనిషి నేర్చుకోవాల్సిన మంచి లక్షణాలేంటో చెప్పాడు. సింహం నుంచి ఒక విషయం గ్రహించాలి, కొంగ దగ్గర్నుంచి రెండు విషయాలు గ్రహించాలి, గాడిద నుంచి మూడు విషయాలు గ్రహించాలి, కోడిపుంజు దగ్గర్నుంచి నాలుగు విషయాలు, కాకి నుంచి ఐదు విషయాలు, కుక్క నుంచి ఐదు విషయాలు గ్రహించాలని చెప్పాడు. ఆ లక్షణాలేంటో చూద్దాం
సింహం
సింహం నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏం చేద్దామనుకున్నా మనకున్న పూర్తి శక్తితో చేయాలి. సగం సగం ప్రయత్నం చేయకూడదు. 
కొంగ
కొంగ దగ్గర్నుంచి నేర్చుకోవాల్సిన రెండు విషయాల్లో మొదటిది ఇంద్రియ నిగ్రహం, రెండు- సమయం, ప్రదేశం, శక్తి విషయంలో అవగాహన కలిగి ఉండడం
గాడిద
గాడిద నుంచి నేర్చుకోవాల్సిన మూడు విషయాల్లో మొదటిది- తనమీద ఎంత బరువు ఎక్కువ అయినప్పటికీ ,ఎంత అలసిపోయినప్పటికీ పని ఆపకుండా కొనసాగించే లక్షణం
రెండు- వాతావరణంలో ఉన్న వేడి, చలి పట్టించుకోకుండా ఉండడం, మూడు- పెట్టిన దాంతో సంతృప్తి చెందడం గాడిదను చూసి నేర్చుకోవాల్సిందే.
Also Read: కింగ్ అవ్వాల్సిన కొడుకుని కురూపిగా మార్చేసిన తండ్రి, కానీ..చాణక్యుడికి అదే వరమైంది.. 
కోడిపుంజు
కోడిపుంజు నుంచి నేర్చుకోవాల్సిన నాలుగు విషయాల్లో మొదటిది-ధైర్యంగా ఉండడం, రెండోది-వేళకి నిద్రలేవటం, మూడోది-ఎప్పుడైనా యుద్ధానికి సిద్ధంగా ఉండడం, నాలుగు- తనకి కావాల్సిన ఆహారాన్ని పోట్లాడి తీసుకోడం
కాకి
కాకి నేర్పించే ఐదు విషయాల్లో మొదటిది- ధైర్యంగా ఉండడం, రెండోది -సంభోగం సమయంలో ఎవ్వరూ చూడకుండా  జాగరూకతతో ఉండడం, మూడోది-ఇతరుల కార్యకలాపాలు గమనిస్తూ ఉండడం, నాలుగోది- ఒక్కసారి భాగస్వామిని ఎన్నుకుంటే జీవితకాలంలో మళ్లీ మార్చవు, ఐదోది-సందర్భాన్ని బట్టి తెలివిగా ఆలోచించడం ( నీళ్లు కావాలంటే గులకరాళ్లు వేసి నీళ్లు పైకి వచ్చాక తాగిన మీకు అందరికీ తెలుసు)
కుక్క
కుక్క నుంచి నేర్చుకోవాల్సిన మొదటి లక్షణం బాగా తినగలిగి ఉన్నా దొరికినదాంతో సంతృప్తి చెందడం, రెండోది- ఎంత నిద్రలో ఉన్నా చిన్న అలికిడికే నిద్రలేవడం , మూడోది- యజమానికి విశ్వాసపాత్రులుగా ఉండడం, నాలుగోది-ధైర్యంగా ముందుకి ఉరకడం, ఐదోది- బాధ్యత నుంచి తప్పించుకోకుండా ఉండడం నేర్చుకోవాలి
ఇలా మనిషి.. సింహం, కొంగ, కుక్క, కోడి, కాకి, గాడిద నుంచి ఈ 20 మంచి లక్షణాలు నేర్చుకుని ఆ ప్రకారం నడుచుకుంటే ఎదురైన ఎలాంటి సమస్యని అయినా అధిగమించవచ్చు.  
Also Read: తెలివైనవాడికి శత్రువులు ఎందుకుండరు?
Also Read: మీ జీవితంలో ఆ ఇద్దరి మీదా ఎప్పుడూ నోరు పారేసుకోవద్దు…ఎవరా ఇద్దరు....చాణక్యుడు ఎందుకలా చెప్పాడు…
Also Read:  వైవాహిక జీవితం - లైంగిక సంబంధాలు.. చాణక్యుడు చెప్పిన ఆసక్తికర అంశాలు
Also Read: సమస్యల వలయంలో ఉన్నారా… బయపడే మార్గాలను ఇలా అన్వేషించండి 
Also Read: అప్సరసలంటే ఎవరు.. మొత్తం ఎంత మంది ఉన్నారో తెలుసా..!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి