Ram Mandir Pran Pratistha Inauguration Invitations: అయోధ్యలో ఈ నెల 22న జరగనున్న రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాటు సాగుతున్నాయి. ఈ వేడుకకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానాలను నిర్వాహకులు అందించారు. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరయ్యే ప్రముఖుల జాబితాలో ప్రముఖ పారిశ్రామిక వేత్త, బిలియనీర్‌ ముఖేష్‌ అంబానీ, అతని కుటటుంబంతోపాటు బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌కు ఆహ్వానాలు అందాయి. వీరితోపాటు మరో ఎనిమిది వేల మంది ప్రముఖులకు ఆహ్వానాలను అందించారు. వీరిలో సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు. 


సినీ ప్రముఖులు ఎందరో..


రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ మహోత్సవానికి అమితాబ్‌ బచ్చన్‌ ప్రైవేటు విమానంలో అయోధ్యకు రానున్నారు. చిత్ర పరిశ్రమ నుంచి అజయ్‌ దేవగన్‌, అక్షయ కుమార్‌, అల్లు అర్జున్‌, మోహన్‌ లాల్‌, అనుపమ్‌ ఖేర్‌, చిరంజీవి, వాయిద్యకారుడు అహ్మద్‌ అలీ, గీత రచయిత మనోజ్‌ ముంతాషీర్‌, అతని భార్య, గీతా రచయిత భన్సాలీ, చంద్రప్రకాష్‌ ద్వివేదీలను ఆహ్వానించారు. 


హాజరుకానున్న పారిశ్రామికవేత్తలు..


దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఈ వేడుకకు ఆహ్వానాలను అందించారు. ముఖేష్‌ అంబానీ, ఆయన తల్లి కోకిలాబెన్‌, భార్య నీతా, కుమారులు ఆకాష్‌, అనంత్‌, కోడలు శ్లోక, కాబోయే కోడలు రాధిక మర్చంట్‌ పేర్లు జాబితాలో ఉన్నాయి. ఆదిత్య బిర్లా గ్రూప్‌ చైర్మన్‌ కుమార్‌ మంగళం బిర్లా, అతని భార్య నీర్జా, పిరమల్‌ గ్రూప్‌ చైర్మన్‌ అజయ్‌ పిరమల్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా సంస్థల చైర్మన్‌ ఆనంద్‌ మహీంధ్ర, టీసీఎస్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ కె కీర్తివాసన్‌ ఉన్నారు. డాక్టర్‌ రెడ్డిస్‌ ఫార్మాస్యూటికల్స్‌కు చెందిన కె సతీష్‌ రెడ్డి, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సీఈవో పునీత్‌ గోయెంకా, లార్సెన్‌ అండ్‌ టూబ్రో చైర్మన్‌, మేనేజింగ్‌ డైరక్టర్‌ ఎస్‌ఎన్‌ సుబ్రహ్మణియన్‌, ఆయన భార్య, ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడడు ఎన్‌ఆర్‌ నారాయణమూర్తి, జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ చీఫ్‌ నవీన్‌ జిందాల్‌, వేదాంత గ్రూప్‌కు చెందిన నరేష్‌ ట్రెహాన్‌కు ఆహ్వానాలు అందాయి.


లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరా కుమార్‌, ప్రణాళికా సంఘం(రద్దు చేయబడింది) మాజీ డిప్యూటీ చైర్మన్‌ మాంటెక్‌ సింగ్‌ అహ్లూవాలియా జాబితాలో ఉన్నారు. మాజీ దౌత్యవేత్త అమర్‌ సిన్హా, మాజీ అటార్నీ జనరల్‌ కెకె, వేణుగోపాల్‌, ముకుల్‌ రోహిత్గీ, భారత మహిళా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌కు ఆహ్వానాలు అందాయి. జాబితాలోని వ్యక్తుల్లో ప్రైవేటు విమానాల్లో ఇక్కడకు చేరుకుంటారు. మరికొందరు సాధారణ విమానాల్లో ఒకరోజు ముందు అయోధ్య, లక్నోకు చేరుకుని ఆలయ ప్రాంగణానికి చేరుకుంటారు.


Also Read