Ram Mandir: అయోధ్య రామయ్య దర్శనమిచ్చాడు చూశారా - ఎంత చూసినా తనివి తీరదు
జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ రోజున దర్శనమివ్వాల్సిన అయోధ్య రాముడు ముందే దర్శనమిచ్చాడు. ఇప్పటి వరకూ ముఖాన్ని కప్పేసి ఉన్న విగ్రహం ఫొటోలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు బాల రాముడి పూర్తి రూపం కనిపించాక ఈ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపూర్తిగా కృష్ణ శిలతో తయారు చేసిన బాల రాముడి విగ్రహం చూపు తిప్పుకోనివ్వడం లేదు. చిరు నవ్వులు చిందిస్తున్న ఈ విగ్రహం అందరినీ కట్టి పడేస్తోంది.
బంగారు విల్లు, బాణం పట్టుకున్న ఐదేళ్ల రాముడి విగ్రహాన్ని మైసూరుకి చెందిన అరుణ్ యోగిరాజ్ తయారు చేశాడు. ఈ విగ్రహం ఎత్తు 5 అడుగులు.
ఇప్పటికే బాల రాముడి విగ్రహం గర్భ గుడిలోకి చేరుకుంది. గర్భ గుడిలోకి రాముడి విగ్రహాన్ని తీసుకొచ్చినప్పుడు అంతా జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు.
జనవరి 22న అభిజిత్ ముహూర్తంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ విగ్రహాని ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా కేవలం కొంత మంది అతిథులకే ఆ రోజు ఆలయంలోకి అనుమతి ఉంటుందని ట్రస్ట్ వెల్లడించింది.
గర్భ గుడిలోకి రాముడి విగ్రహాన్ని తీసుకొచ్చినప్పుడు అంతా జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. ప్రాణ ప్రతిష్ఠకు ముందు జరగాల్సిన క్రతువులు కొనసాగుతున్నాయి.
అయోధ్య ఉత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇప్పటికే యోగి ఆదిత్యనాథ్ ఆలయాన్ని సందర్శించారు. పనులపై ఆరా తీశారు. మొత్తం 8 వేల మంది అతిథులకు ఆహ్వానం పంపారు. వీళ్లలో బిలియనీర్ ముకేశ్ అంబానీ, బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ ఉన్నారు.
ఈ ఉత్సవానికి హాజరయ్యే అతిథులు ఇన్విటేషన్ కార్డుతో పాటు తప్పనిసరిగా విజిటింగ్ పాస్‌ని తీసుకురావాలని ట్రస్ట్ వెల్లడించింది. దానిపై ఉన్న QR కోడ్‌ని స్కాన్ చేస్తేనే లోపలికి అనుమతినిస్తారని స్పష్టం చేసింది. కేవలం ఇన్విటేషన్ కార్డు మాత్రమే సరిపోదని వివరించింది.