Honey Rose Photos: ఆరెంజ్ డ్రస్‌లో ఫారిన్ బ్యూటీలా హానీ రోజ్ - బాలకృష్ణ సినిమా హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ సరసన 'వీర సింహా రెడ్డి' సినిమాలో ఓ కథానాయికగా నటించిన హానీ రోజ్ గుర్తు ఉన్నారా? ఈ అమ్మాయి ఆవిడే. హానీది మలయాళం. అయితే... రెగ్యులర్ గా డిఫరెంట్ డ్రస్ లలో సందడి చేయడం ఆమె స్టైల్. ప్రతి ఈవెంట్ కు సరికొత్తగా రెడీ అవుతారు. లేటెస్టుగా ఒక ప్రోగ్రాం కోసం ఇలా రెడీ అయ్యారు. (Image Courtesy: honeyroseinsta/instagram)
'వీర సింహా రెడ్డి' ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో బాలకృష్ణకు మరదలిగా... ప్రజెంట్ ఎపిసోడ్స్ లో యంగ్ బాలకృష్ణకు తల్లిగా హానీ రోజ్ నటించారు. రెండు వేరియేషన్స్ ఉన్న రోల్ చేశారు. ఎక్కువ సన్నివేశాల్లో తల్లిగా ఉండటంతో ఆమె గ్లామర్ సైడ్ చూసే అవకాశం ప్రేక్షకులకు రాలేదు. (Image Courtesy: honeyroseinsta/instagram)
వీర సింహా రెడ్డి సినిమాలో 'మా బావ మనోభావాలు దెబ్బ తిన్నాయి' పాటలో హానీ రోజ్ హుషారుగా డ్యాన్స్ చేశారు. అంతకు ముందు ఆవిడ ఎప్పుడో తెలుగు సినిమా చేసినా... మలయాళం సినిమాలు ఎక్కువ చేశారు. మోహన్ లాల్ 'మాన్ స్టర్'లో లక్ష్మీ మంచుతో ఆవిడ చేసిన సీన్లు వైరల్ అయ్యాయి. (Image Courtesy: honeyroseinsta/instagram)
ఆరెంజ్ బాడీకాన్ డ్రస్ లో హానీ రోజ్ ఫారిన్ బ్యూటీలా ఉన్నారని నెటిజనులు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఈ డ్రస్ కోసం హానీ రోజే హెయిర్ స్టైల్ అండ్ కలర్ ఛేంజ్ చేశారు. ఆవిడ కొత్తగా కనిపించారు. (Image Courtesy: honeyroseinsta/instagram)
'వీర సింహా రెడ్డి' తర్వాత తెలుగులో సీనియర్ హీరోల సరసన నటించే అవకాశం హానీ రోజ్ కు వస్తుందని చాలా మంది భావించారు. అయితే... బాలకృష్ణ సినిమా తర్వాత తెలుగులో ఆమె మరో సినిమాకు సంతకం చేయలేదు. (Image Courtesy: honeyroseinsta/instagram)
హానీ రోజ్ గ్లామర్ ఇమేజ్ సోషల్ మీడియాలో ఆమెకు బోల్డంత ఫాలోయింగ్ సంపాదించింది. సినిమాలతో సంబంధం లేకుండా ఆమెను ఫాలో అవుతున్న తెలుగు ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు. (Image Courtesy: honeyroseinsta/instagram)
హానీ రోజ్ కొత్త ఫోటోలు (Image Courtesy: honeyroseinsta/instagram)
హానీ రోజ్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: honeyroseinsta/instagram)
హానీ రోజ్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: honeyroseinsta/instagram)