How To Make Jai Shri Ram Caller Tune: అయోధ్య రామాలయం(Ayodhya Rama Temple) ప్రతిష్ఠకు మరో రెండు రోజుల సమయం మిగిలి ఉంది. దేశమంతా రామనామ జపంతో ఊగిపోతోంది. అయోధ్య రాముడిని ఎప్పుడెప్పుడు గర్భగుడిలో చూద్దామా అని తనివి తీరా చూస్తోంది. ఏ ఇద్దరూ కలిసినా దీనిపైనే చర్చ నడుస్తోంది. 


ఇలాంటి సందర్భంగా ట్రెండీగా ఆలోచిస్తున్న కొందరు తమ కాల్‌ ట్యూన్‌ను రామ జపంగా మార్చేస్తున్నారు. చారిత్రాత్మక సందర్భంలో మీరు జై శ్రీరామ్(Jai Shr Ram) లేదా రాముడి పాటలను మీ కాలర్ ట్యూన్‌గా పెట్టుకోవాలనుకుంటే ఈ ప్రక్రియను ఫాలో అయిపోండి. 


జనవరి 22న అయోధ్యలో నిర్మిస్తున్న శ్రీరామాలయ ప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించనున్నందున ఈ సమయంలో దేశవ్యాప్తంగా రామమందిరంపై చర్చ జరుగుతోంది. ఈ కారణంగా, భారతదేశంతో సహా ప్రపంచం మొత్తం అయోధ్య రామ మందిరం వైపు చూస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామ భక్తులు జై శ్రీరామ్ నినాదాలు చేస్తున్నారు.


మీరు మీ మొబైల్‌లో జై శ్రీరామ్ లేదా శ్రీరామ్ ట్యూన్ వినాలనుకుంటే, మీకు కాల్ చేసే వ్యక్తులు కూడా వినాలనుకుంటే ఈ ఆర్టికల్ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎయిర్టెల్, జియో వొడాఫోన్-ఐడియాలో శ్రీరామ భజనను మీ కాలర్ ట్యూన్, హలో ట్యూన్ పూర్తిగా ఉచితంగా ఎలా చేయవచ్చో చూడండి. 


వీలో ఎలా కాలర్ ట్యూన్ సెట్ చేసుకోవాలంటే?
వొడాఫోన్-ఐడియా యూజర్లు తమ ఫోన్లలో వీఐ యాప్‌ డౌన్లోడ్ చేసుకోవాలి. దీని తరువాత మీరు కాలర్ ట్యూన్స్ విభాగంలోకి వెళ్లాలి. అక్కడ మీకు ఒక కేటలాగ్ కనిపిస్తుంది. వాటిలో సెర్చ్ చేస్తే శ్రీరాముని శ్లోకాలు కనిపిస్తాయి. అందులో మీకు ఇష్టమైన పాటను కాలర్‌ ట్యూన్‌గా  సెట్ చేయవచ్చు.


ఎయిర్ టెల్ వినియోగదారులకు...
ఎయిర్ టెల్ సిమ్ వాడుతున్నట్లయితే మీ ఫోన్‌లో వింక్ మ్యూజిక్‌ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ మొబైల్ నంబర్‌తో యాప్‌లోకి లాగిన్ అవ్వాలి. మీకు ఎస్‌ఎంఎస్‌ ద్వారా ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేస్తే యాప్‌లోకి వెళ్తారు. యాప్‌లోకి వెళ్లిన సెర్చ్ బాక్స్‌లో శ్రీరామ్‌ ేదలుే అని టైప్‌ చేస్తే రాముడి పాటలు వస్తాయి. వాటిని మీ కాలర్ ట్యూన్ సెట్‌ చేసుకోవచ్చు. అందరికీ ఒకే పాటను సెట్‌ చేయవచ్చు. లేదా ఒక్కో కాలర్‌కు ఒక్కో పాటను కూడా పెట్టవచ్చు. ఇదంతా ఉచితంగానే అందిస్తుందీ వింక్ మ్యూజిక్ యాప్. ఇది నెలరోజులపాటు కాలర్‌ ట్యూన్‌గా ఉంటుంది. ఆ తర్వాత దాన్ని రెన్యువల్ చేసుకోవాలి. మీరు ఫీచర్ ఫోన్ ఉపయోగిస్తుంటే, 543211 కు కాల్ చేయడం ద్వారా మీకు ఇష్టమైన పాటను హలో ట్యూన్ గా మార్చుకోవచ్చు.


జియోలో...
జియో నెట్ వర్క్ సిమ్ వాడుతున్నట్లయితే ముందుగా మై జియో యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ట్రెండింగ్ నౌ అనే విభాగానికి వెళ్లి జియోట్యూన్స్ ఆప్షన్ ఎంచుకోండి. ఆ తర్వాత సెర్చ్ బాక్స్‌లో జై శ్రీరామ్, రామ్ హారతి, రామ్ భజన, శ్రీరామ్ సాంగ్స్‌ ఎంటర్ చేస్తే అందుబాటులో ఉన్న అన్ని ఆప్షన్లు మీకు వస్తాయి. అందులో ఒకదాన్ని మీరు ఎంపిక చేసుకోండి. ఆపై సెట్ జియో ట్యూన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత ఎస్ఎంఎస్ ద్వారా కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. ఇది కాకుండా మీ వద్ద ఫీచర్ ఫోన్ ఉంటే, 56789కు కాల్ చేయడం ద్వారా మీకు ఇష్టమైన రామ్ ట్యూన్ కాలర్ ట్యూన్ చేయవచ్చు.