Ayodhya Ram Lalla: ఉత్తర్‌ప్రదేశ్‌ లో ఈ నెల 22న జగరనున్న అయోధ్య రామమందిర (Ayodhya Ram Mandir) ప్రారంభోత్సవానికి దేశవిదేశాల నుంచి ప్రముఖులు హాజరుకానున్నారు. ఇప్పటికే దేశంలోని పలువురు రాజకీయ నాయకులు, సినీ తారలు, వ్యాపారవేత్తలకు ఆహ్వానాలు ఇచ్చిన ఆలయ కమిటీ  సభ్యులు... విదేశాల్లోని ప్రముఖులకు సైతం ఆహ్వానం అందించారు. ఈ నేపధ్యంలో మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగానూ శ్రీరామనామస్మరణ వినిపిస్తోంది. ఇక మన పొరుగు దేశం పాకిస్థాన్‌లో కూడా రాముని ప్రేమించేవారు ఎందరో ఉన్నారు.


పాకిస్తాన్‌ జట్టు మాజీ క్రికెటర్, వెటరన్ లెగ్ స్పిన్నర్ డానిష్ కనేరియా కూడా కాషాయ జెండా పట్టుకుని జై శ్రీరామ్ అని నినాదాలు చేస్తూ రామమందిరాన్ని సందర్శించడానికి ఉత్సాహంగా ఉన్నానన్నాడు. అంతే కాదు. గురువారం, రామాలయంలోని గర్భగుడిలో కొత్త రాంలాలా విగ్రహాన్ని ఉంచగా దానిని డానిష్ కనేరియా  తన సోషల్ మీడియా ప్లాట్ఫాం ఎక్స్ లో ఆ ఫోటోని  షేర్ చేశారు.  రామమందిరం ప్రాణ్ ప్రతిష్ఠా వేడుక రోజున ప్రత్యేక సెలవును మంజూరు చేసినందుకు మారిషస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. 


దశాబ్దాల కల ఈ రామ మందిరం 
దశాబ్దాల సమస్య తీరిపోయి అయోధ్యలో దివ్యమైన రామ మందిర నిర్మాణం శరవేగంగా నిర్మాణం జరిగింది. అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరాన్ని సందర్శించే భక్తులు 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న జన్మభూమి కాంప్లెక్స్‌లో మరో 7 ఆలయాలను దర్శించుకోవచ్చు. ఇక్కడ హనుమంతుడు, అన్నపూర్ణ, మాతా శబరి, మహర్షి వాల్మీకి, మహర్షి వశిష్ఠ, మహర్షి విశ్వామిత్ర, అగస్థ్య ముని నిషాద్ రాజ్, జటాయువు ఆలయాలు ఉంటాయి. ప్రధాన ఆలయం చుట్టూ.. కోటలా గోడ నిర్మించనున్నారు. అలాగే  ఈ ఆలయంలో గర్భగుడితో పాటు ఐదు మండపాలు ఉంటాయి. గుధ్ మండపం, రంగ మండపం, నిత్య మండపం, ప్రధాన మండపం, కీర్తన మండపం ఉంటాయి.   అంతే కాకుండా స్తంభాలు, గోడలపై దేవతా విగ్రహాలను తయారు చేస్తున్నారు.


రాముడిపై కుల్‌దీప్‌ అభిమానం
మైదానంలో దిగాడంటే ప్రత్యర్థి బ్యాటర్లను గింగిరాలు తిరిగే బంతులతో ముప్పు తిప్పలు పెట్టే టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కు సంబంధించిన ఓ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కొన్ని రోజుల్లో అయోధ్యలో రామ మందిరం ప్రారంభం కానుండగా.. కుల్దీప్ యాదవ్ టాలెంట్ వైరల్ అవుతోంది. టీమిండియా స్టార్ బౌలర్ కుల్దీప్ యాదవ్.. శ్రీరాముడు, ఆంజనేయుడి పెయింటింగ్స్ వేశాడు. రే అనే నెటిజన్ కుల్దీప్ పెయింటింగ్స్ ను ట్విట్టర్ (ఎక్స్) లో పోస్ట్ చేశాడు. ప్రొఫెషనల్ పెయింటర్స్ తరహాలో కుల్దీప్ వేసిన శ్రీరాముడు, అంజనీ పుత్రుడు హనుమాన్ చిత్రాలు ఉన్నాయని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మైదానంలో ఈ చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ టాలెంట్ మాకు తెలుసునని, ఆఫ్ ద ఫీల్డ్ కుల్దీప్ ఇలా దేవుడి బొమ్మల్ని ఎంతో శ్రద్ధగా గీస్తాడని.. ఇది దేవుడు తనకు ఇచ్చిన గొప్ప టాలెంట్ అని కామెంట్ చేస్తున్నారు.


తరలిరానున్న అతిరథ మహారథులు
అమెరికా, బ్రిటన్, అర్జెంటీనా, ఆస్ర్టేలియా, ఫ్రాన్స్‌, జర్మనీ, దక్షిణాఫ్రికా, ఫిన్‌లాండ్‌, హాంగ్‌ కాంగ్‌, కెనడా,ఇటలీ, ఐర్లాండ్‌, మెక్సికో, న్యూజిలాండ్‌... సహా మెుత్తం 55 దేశాలకు చెందిన ప్రతినిథులు హాజరుకానున్నట్లు..... విజ్ఞానానంద తెలిపారు. దేశాధినేతలు కూడా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. జనవరి 20న లఖ్‌నవూకు చేరుకొనున్న విదేశీ అతిథులు... జనవరి 21న ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి హాజరు అవుతారని వివరించారు. పొగ మంచు, వాతావరణ పరిస్థితులు కారణంగా అతిథులు..... ముందుగానే కార్యక్రమానికి చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు. పెద్దసంఖ్యలో విదేశీ అతిథులను పిలవాలని అనుకున్నామని కానీ అయోధ్య చిన్న నగరం కావడంతో పరిమిత సంఖ్యలో ఆహ్వానాలు ఇచ్చినట్లు వెల్లడించారు.