Ramayana: రామ రావణ యుద్ధం ముగిసింది. రావణుడిని రాముడు సంహరించాడు. భర్త మరణ వార్తను విన్న మండోదరి యుద్ధభూమికి పరుగుతీసింది. రావణుడు చనిపోవడం ఏంటి..అది కూడా మానవుడు అయిన రాముడి చేతిలో...ఇది ఆమె నమ్మలేని కఠోరనిజం. ఎందుకంటే ముల్లోకాలను గెలిచిన తన భర్తని అల్పుడైన మానవుడు చంపడం సాధ్యమా అంటే అక్కడ సాధ్యమైంది..ఇది నిజం తెలిసినా మండోదరి జీర్ణించుకోలేని స్థితిలో ఉంది. అదే ఆలోచనతో ఆమె విడన కొప్పును కూడా ముడివేసుకోలేదు. సరైన వస్త్రధారణ కూడా లేదు..అయినా భర్త రావణుడి మరణవార్త విని యుద్ధభూమికి పరుగుతీసింది. మనసులో రాముడిపై కోపం, రాముడిని నిందించాలనే ఆత్రుత.. ఎందుకంటే ఆమె అంతకుముందెప్పుడూ రాముడిని చూడలేదు, రాముడి గురించి వినలేదు. అందుకే అంత ఆక్రోశం, ఆక్రోశంతో కూడిన ఆవేదన.
Also Read: భరతుడు వచ్చి పిలిచినా రాముడు అయోధ్యకు ఎందుకు వెళ్లలేదు!
నీడ చూసి తప్పుకున్న రాముడు
రావణ వధ జరిగింది. ఇరువైపులా మిగిలిన సైన్యం యుద్ధం ఆపేసి ఎక్కడివారక్కడ నిల్చుని ఉండిపోయారు. రాముడు కూడా ఒక బండ రాయిపై కూర్చున్నాడు. సూర్యకిరణాలు పడడం వల్ల తన నీడ దూరంగా కనిపిస్తోంది. అదే సమయంలో దూరం నుంచి వస్తోన్న మరో నీడ కనిపించింది. ఆహార్యం చూస్తే అది స్త్రీమూర్తి నీడ అని శ్రీరామచంద్రుడికి అర్థమైంది. ఆ నీడ..తన నీడకు దగ్గరగా వస్తోందని గమనించి...అది స్త్రీమూర్తి నీడ కావడంతో ఠక్కున లేచి పక్కకు తప్పుకున్నాడు రాముడు. అంత బాధలో యుద్ధభూమిలో అడుగుపెట్టిన మండోదరి..రాముడి చర్యను గమనించింది. తన వ్యక్తిత్వం చూసి ఆశ్చర్యపోయింది. రాముడి ఆత్మ సౌందర్యాన్ని అర్థం చేసుకుంది. అప్పటివరకూ రాముడిపై ఉన్న కోపం, ఆగ్రహం, ఆవేశం అన్నీ ఆ ఒక్క చర్యతో మాయమైపోయాయి.
Also Read: విగ్రహం కళ్లకు గంతలు ఎందుకు - ఓ రాయి దేవుడిగా ఎలా మారుతుంది!
అధమాః ధనమిచ్ఛంతి,
ధనం మానంచ మధ్యమాః
ఉత్తామాః మానమిచ్ఛంతి
మానోహి మహాతాం ధనం!
ధనం కోసం ఏమయినా చేసేందుకు వెనుకాడని వారు, ధనం మానం రెంటికై , యత్నించే వారు, మానం కోసమే జీవించే వారు ఈ మూడు రకాలయిన వ్యక్తులు సమాజంలో మనకు కనిపిస్తారు. మొదటి రకం అధములు, రెండవ రకం మధ్యములు మూడవ రకం ఉత్తములు అని అర్థం. జయం అపజయం ఎప్పటికీ ఎవ్వరికీ శాశ్వతం కావు. విజయాన్ని నిర్వచించేందుకు కావలసింది వ్యక్తిత్వ వికాసం మాత్రమే. డబ్బు, హోదా, పలుకుబడి, అధికారం ఇవన్నీ మత్తు నిచ్చేవే. మానవతతో కూడిన అంతరంగ వికాసం మాత్రమే నిజమైన విజయం అంటుంది రామాయణం. అందుకే రాముడు ఎప్పటికీ ఆదర్శనీయుడే.
Also Read: ప్రాణ ప్రతిష్ఠ అంటే ఏంటి? సనాతన ధర్మంలో దీనికి అంత ప్రాధాన్యత ఎందుకు?
శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్న దీపం
ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి
అర్థం: రఘువంశంలో పుట్టినవాడు దశరథుని పుత్రుడు,అప్రమేయుడు,సీతకు పతి యైన వాడు,రఘువంశమనే సముద్రానికి చంద్రుని వంటి వాడు,ఆజాను బాహుడు,పద్మపు రేకులవంటి విశాలమైన కన్నులు కల్గినవాడు,రాక్షసులను సంహరించు వాడైన శ్రీ రామునకు నమస్కరించు చున్నాను.
రాముని రూపు కళ్ళకు కట్టినట్లు వర్ణించే పద్యమిది. మోకాళ్ళవరకుచేతులుకలవాడట,పద్మమే విశాలంగా వుంటుంది.దాని ఆకులు ఇంకా విశాలంగా వుంటాయి.అలాంటి కన్నులున్నవాడు శ్రీరాముడు అన్నది కవిభావన.
Also Read: రామ రావణ యుద్ధంలో రాముడి రథ సారధి ఎవరు - రామాయణం గురించి ఈ విషయాలు తెలుసా!