Ayodhya Ram Mandir Pran Pratishtha: రామాయణం చదవాలనే ఆసక్తి చాలామందిలో ఉంటుంది.అయితే చదివే అవకాశం ఉన్నవారు చదివి ఉంటారు, అవకాశం లేనివారికి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది.  వారికోసమే ఈ ప్రశ్నలు. వీటిలో మీకు ఎన్ని ప్రశ్నలకు సమాధానం తెలుసో చూసుకోండి...


Also Read: రామాయణం గురించి మీకు ఎన్ని విషయాలు తెలుసు - వీటికి సమాధానం చెప్పగలరా!


51. ఖరదూషణాది పదునాలుగు వేల మంది రాక్షసులు ఎక్కడినుండి పంచవటికి వచ్చారు?
 జనస్థానము


52. సీతను అపహరించుటానికి రావణుడు ఎవరి సహాయ కోరాడు?
 మారీచుడు


53. సీత రాముడిని కోరిన మాయా మృగం ఏది?
 బంగారులేడి


54. సీతను తీసుకుపోతున్న రావణునితో యుద్ధం చేసిన పక్షి ఎవరు?
 జటాయువు


55. సీతను అన్వేషిస్తున్న రామలక్ష్మణులకు అరణ్యంలో మృగాలు ఏ దిక్కుకు సంకేతం చూపెను?
 దక్షిణపు దిక్కు


56. సీతాన్వేషణలో వున్న రామలక్ష్మణులు ఏ రాక్షసుని హస్తంలో చిక్కుకున్నెనారు?
 కబంధుని


57. సీతాన్వేషణలో రామలక్ష్మణులు చేరుకున్న శబరి ఆశ్రమం ఏ నదీ తీరాన, ఏ వనంలో వున్నది?
 మతంగ వనం, పంపానదీ


58. సుగ్రీవాదులు ఏ పర్వత ప్రాంతంలో నివశించారు?
 ఋష్యమూక పర్వతం


59. రామలక్ష్మణుల గురించి తెలుసుకొనుటకై వారివద్దకు సుగ్రీవుడు ఎవరిని పంపాడు?
 హనుమంతుడు


60. రామసుగ్రీవుల మైత్రి ఎవరి సాక్షిగా జరిగెను?
 అగ్ని సాక్షిగా


61. రాముడు తన బాణాలు దేనితో తయారు చేసినట్టు సుగ్రీవుడికి చెప్పాడు?
కుమారస్వామి జనించిన వనములోని బంగారు కాండములు


62. సుగ్రీవుని భార్య పేరు?
రుమ


63. వాలి భార్యపేరు?
తార


64. వాలి సుగ్రీవుల రాజ్యము పేరేమిటి?
 కిష్కింధ


65. వాలిని కవ్వించి పారిపోయి బిలంలో దాక్కున్న రాక్షసుడు పేరేంటి?
మాయావి.


66. హిమవంతుని సలహాతో వాలితో యుద్ధానికి వచ్చిన రాక్షసుడు ఎవరు?
దుందుభి


67. వాలి విసిరిన దుందుభి కళేబరం ఎవరి ఆశ్రమంలో పడింది?
మతంగముని


68. వాలి కుమారుని పేరేంటి?
అంగదుడు


69. రాముడు ఒకే బాణంతో ఎన్ని సాలవృక్షాలు భేదించాడు?
ఏడు


70. సుగ్రీవుని రాజ్యాభిషేకము తర్వాత రామలక్ష్మణులు ఎక్కడ నివసించారు?
ప్రసవణగిరి


71. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు తూర్పు దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?
వినతుడు


72. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు దక్షిణ దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?
అంగదుడు


73. సుగ్రీవునికి, సీతాన్వేషణ కోసం పశ్చిమ దిక్కుకు పంపిన సుషేణునికి బంధుత్వం ఏంటి?
మామగారు, తార తండ్రి


74. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు ఉత్తర దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?
శతబలుడు


75. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు వానరులకు ఎంత సమయం గడువిచ్చాడు?
మాసం (ఒక నెల)


76. హనుమంతుడు ఏ దిక్కుకు వెళ్లిన వానరసేనలో ఉన్నాడు?
దక్షిణ దిక్కు


77. సీతకు ఆనవాలు కొరకై రాముడు హనుమంతుడికి ఏమిచ్చాడు?
తన (రామ) పేరు చెక్కి ఉన్న ఉంగరం


78. హనుమంతుడు మొదలైన వానరులు చిక్కుకున్న బిలం (లోయ)లో వున్న తాపసి పేరేమిటి?
స్వయంప్రభ


79. సముద్రం అమవతల వున్న రావణునిని, సీతను చూడగల్గుతున్నానని వానరులకు చెప్పిన పక్షి పేరు?
సంపాతి


80. హనుమంతుడి తల్లి  అంజన అసలు పేరు?
పుంజికస్థల


81. ఆంజనేయుడు సముద్రాన్ని లంఘించుటకు ఎక్కిన పర్వతం పేరు?
మహేంద్రపర్వతం


82. వాయుపుత్రుడు సముద్రం దాటుతున్నపుడు విశ్రమించమంటూ ఆతిధ్యమిచ్చిన పర్వతం ఎవరు?
మైనాకుడు


83. హనుమంతుని శక్తిని పరీక్షించుటకు దేవతలు సముద్రంలో నియమించిన నాగమాత పేరేంటి?
సురస


84. అంజనీ సుతుడి నీడను ఆకర్షించి తనవైపు లాగిన సముద్ర జంతువు పేరేంటి?
సింహిక


85. హనుమంతుడు లంఘించిన సముద్రం పొడవెంత?
నూరు యోజనములు


86. లంకలో హనుమంతుడు దిగిన పర్వతం పేరు?
లంబ పర్వతం


87. హనుమంతుడు సీతను కనుగొన్న వనం పేరేమిటి?
అశోక వనం


88. రావణుడు సీతకు ఎన్ని మాసాలు గడువిచ్చాడు?
రెండు


89. రాముడికి విజయం, రాక్షసులకు వినాశము వచ్చునని కలగన్న రాక్షస స్త్రీ ఎవరు?
త్రిజట


90. హనుమంతుడు చెట్టుపై దాగివుండి సీతకు వినబడినట్లు ఎవరి కథ వినిపించాడు?
రామ కథ


91. రామునికి నమ్మకం కలుగేందుకు  సీత హనుమంతునికి యిచ్చిన ఆభరణం పేరేంటి?
చూడామణి


92. హనుమంతుడు లంకలో ఎంతమంది రావణుని కింకరులను వధించెను?
ఎనభై వేలమంది


93. హనుమంతుడిని ఎవరి అస్త్రంతో బంధించి రావణుని వద్దకు తీసుకెళ్లారు?
ఇంద్రజిత్తు సంధించిన బ్రహ్మాస్త్రం


94. దూతను వధించుట తగదని రావణునికి బోధించినదెవరు?
విభీషణుడు


95. తిరిగి వచ్చిన హనుమంతునితో కలసి వానరులు ఆనందంతో ధ్వంసం చేసిన సుగ్రీవునికి యిష్టమైన వనం పేరేమిటి?
మధువనం


96. వానరులు వనం ధ్వంసం చేస్తున్న విషయం సుగ్రీవునికి చేరవేసిన దెవరు?
మధువన రక్షకుడూ, సుగ్రీవుని మేనమామ ఐన దధిముఖుడు


97. సీతజాడ తెలుసుకుని వచ్చిన హనుమంతునికి రాముడిచ్చిన బహుమతి?
ఆలింగన సౌభాగ్యం


98. సముద్రం దాటుటకు నూరు యోజనములు సేతువు నిర్మించిన వానర ప్రముఖుడి పేరేమిటి
నీలుడు


99. ఇంద్రజిత్తు ఏ ప్రదేశంలో హోమం చేయుచుండగా లక్ష్మణుడు వధించాడు?
నికుంభిల


100. రామునికి ఆదిత్యహృదయం స్తోత్రం ఉపదేశించిన ముని ఎవరు?
అగస్త్యుడు


101. రావణుని వధించుటకు రామునికి రథం పంపినదెవరు?
ఇంద్రుడు


102. రామ రావణ యుద్ధంలో రాముని రథసారధి ఎవరు?
మాతలి


103. రావణ వధానంతరం లంకనుంచి సీతారామ లక్ష్మణ వానరులతో బయలుదేరిన పుష్పకవిమానం అయోధ్య చేరేలోపు ఎక్కడ, ఎవరికోసం ఆగుతుంది?
 కిష్కింధలో, వానరుల భార్యలు కూడా పుష్పకవిమానంలో ఎక్కడం కోసం!


104. గుహునకు, భరతునికి తన రాకను తెలియచేయుటకు శ్రీరాముడు ఎవరిని ముందుగా పంపాడు?
హనుమంతుడు


105. అయోధ్యలో సీతారాముల ఊరేగింపు సమయంలో సుగ్రీవుడు ఎక్కిన ఏనుగు పేరు?
శత్రుంజయం


106. శ్రీరాముడు అయోధ్యలో సుగ్రీవునికి అతిధి గృహంగా ఎవరి భవనము నిచ్చెను?
స్వయంగా తన భవనమునే ఇచ్చాడు


107. పట్టాభిషేక సమయంలో శ్రీరామునికి అలంకరించిన కిరీటం ఎవరు  తయారు చేశారు?
బ్రహ్మ


108. శ్రీరామ పట్టాభిషేకం తర్వాత సీతాదేవి హనుమంతునికిచ్చిన బహుమతి ఏంటి?
తన మెడలోని ముత్యాలహారం


Also Read: 'రామ' ఈ రెండు అక్షరాలు ఎందుకంత పవర్ ఫుల్!


Also Read: అయోధ్యకు రావణుడుని రాజు చేస్తానన్న రాముడు - అదే జరిగి ఉంటే!


Also Read: 'రామో విగ్రహవాన్ ధర్మః' అని ఎందుకంటారు - రాముడు ధర్మం తప్పిఉంటే !