Ayodhya Ram Mandir Pran Pratishtha: రామాయణం చదవాలనే ఆసక్తి చాలామందిలో ఉంటుంది.అయితే చదివే అవకాశం ఉన్నవారు చదివి ఉంటారు, అవకాశం లేనివారికి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది.  వారికోసమే ఈ ప్రశ్నలు. వీటిలో మీకు ఎన్ని ప్రశ్నలకు సమాధానం తెలుసో చూసుకోండి...


1. శ్రీ మద్రామాయణము రచించిన మహర్షి ఎవరు?
 వాల్మీకి


2. వాల్మీకి మహర్షికి రామాయణ గాథను ఉపదేశించిన ముని ఎవరు?
నారదుడు


3. రామకథను విన్న తర్వాత వాల్మీకి మహర్షి..మధ్యాహ్న స్నానానికి ఏ నదికి వెళ్లాడు?
 తమసా నది


4. శ్రీమద్రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలున్నాయి?
 24,000.


5. శ్రీమద్రామాయణాన్ని గానం చేస్తూ మొదట ప్రచారం చేసిందెవరు?
 లవకుశలు


6. అయోధ్యా నగరం ఏ నది ఒడ్డున ఉన్నది?
 సరయూ నది


7. అయోధ్య ఏ దేశానికి రాజధాని?
కోసల రాజ్యం


8. దశరథ మహారాజుకు ఆంతరంగికుడైన మంత్రి ఎవరు?
సుమంత్రుడు


9. దశరుథుని భార్యల పేర్లు?
కౌసల్య, సుమిత్ర, కైకేయి


10. సంతానం కోసం దశరథుడు చేసిన యాగం పేరు?
పుత్రకామేష్ఠి


11. యజ్ఞకుండం నుంచి వచ్చిన  దివ్య పురుషుడు ఇచ్చిన పాయసాన్ని దశరథుడు తన భార్యలకు ఎలా పంచాడు?
కౌసల్యకు 50%, సుమిత్రకు 25%, కౌకేయికి 12.5%, మిగిలిన 12.5% మళ్లీ సుమిత్రకు


12. బ్రహ్మదేవుని ఆవలింత నుంచి పుట్టిన వానరుడెవరు?
 జాంబవంతుడు


13. వాలి ఎవరి అంశతో జన్మించాడు?
  దేవేంద్రుడు ( ఇంద్రుడు)


14. వాయుదేవుడి వలన జన్మించిన వానరుడెవరు?
 హనుమంతుడు ( ఆంజనేయుడు)


15. కౌసల్య కుమారుని పేరేంటి?
 శ్రీరాముడు


16. భరతుని తల్లి ?
 కైకేయి


17. రామలక్ష్మణ భరత శత్రుఘ్నలలో కవలలు ఎవరు వారి తల్లి పేరేంటి?
 లక్ష్మణ, శత్రుఘ్నులు కవలలు- తల్లి సుమిత్ర


18. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు నామకరణం చేసిన మహర్షి ఎవరు?
 వశిష్ఠుడు


19. విశ్వామిత్రుడు అయోధ్యకు వచ్చేసరికి  రాముడి వయస్సు?
 12 సంవత్సరములు


20. విశ్వామిత్రుని యజ్ఞానికి విఘ్నాలను కల్పిస్తున్న రాక్షసులెవరు?
 మారీచ, సుబాహులు


21. రాముడికి అలసట, ఆకలి లేకుండా ఉండేందుకు విశ్వామిత్రుడు ఉపదేశించిన మంత్రం పేరేంటి?
 బల-అతిబల


22. విశ్వామిత్రుని ఆశ్రమం పేరు?
 సిద్ధాశ్రమం


23. తాటకి భర్త పేరు?
 సుందుడు


24. తాటకను శపించిన మహర్షి ఎవరు?
 అగస్త్యుడు


25. గంగను భూమికి తీసుకొచ్చేందుకు తపస్సు చేసిందెవరు?
 భగీరథుడు


26. గంగకు జాహ్నవి అనే పేరు ఎందుకు వచ్చింది?
 జహ్ను మహర్షి  త్రాగివేయడం వల్ల


27. అహల్య భర్త ఎవరు?
 గౌతమ మహర్షి


28. జనక మహారాజు ఆస్థాన పురోహితుడెవరు?
శతానందుడు


29. సీత ఎవరికి జన్మించింది?
 నాగటి చాలున తగిలి భూదేవి గర్భం నుంచి జనకుడి దగ్గరకు చేరింది


30. శివుడు తన ధనుస్సును ఏ మహారాజు వద్ద ఉంచాడు?
 దేవరాతుడు.


31. శివధనుస్సును ఎవరు తయారు చేశారు?
 విశ్వకర్మ


32. భరత శత్రుఘ్నల భార్యల పేర్లు?
 మాండవి, శృతకీర్తి


33. లక్ష్మణుని భార్య ఊర్మిళ తండ్రి ఎవరు?
 జనకుడు


34. జనకుడి తమ్ముడి పేరు ?
కుశధ్వజుడు


35. పరశురాముడు శ్రీరామునికి యిచ్చి ఎక్కుపెట్టమన్న ధనుస్సు పేరేంటి?
 వైష్ణవ ధనుస్సు


36. భరతుని మేనమామ పేరు?
యధాజిత్తు


37. దశరధుని వరాలు కోరమని కైకను ప్రేరేపించినదెవరు?
 మంధర


38. కైక దశరథుణ్ణి వరాలు కోరినపుడు భరతుడు ఎక్కడున్నాడు?
గిరివ్రజపురం, మేనమామ ఇంట్లో


39. రాముని మిత్రుడు గుహుడు వుండే ప్రాంతమేది?
 శృంగిబేరపురం


40. సీతారాములు తమ వనవాసం మొదటిరోజు రాత్రి ఏ వృక్షం క్రింద నిద్రించారు?
 గారచెట్టు


41. శ్రీరాముని వనవాసానిక చిత్రకూట తగినదని సూచించిన ముని ఎవరు?
భారద్వాజ ముని


42. పర్ణశాలకు సమీపములోని నది పేరేమిటి?
మాల్యవతీ నది


43. దశరథుని శవాన్ని భరతుడు వచ్చే వరకు ఏడు రోజులపాటు ఎక్కడ భద్రపరిచారు?
తైలద్రోణంలో


44. శ్రీరామునితో నాస్తికవాదన చేసినదెవరు?
జాబాలి


45. భరతుడు రాముని పాదుకలనుంచిన పట్టణమేది?
నందిగ్రామము


46. అత్రిమహాముని భార్య ఎవరు?
అనసూయ


47. దండకారణ్యంలో రామలక్ష్మణులను ఎదుర్కొన్న మొదటి రాక్షసుడెవరు?
విరాధుడు


48. పంచవటిలో ఉండమని రామునికి సలహా ఇచ్చినదెవరు?
అగస్త్యుడు


49. పంచవటి ఏ నదీతీరంలో ఉది?
గోదావరి


50. లక్ష్మణుడు ఎవరి చెవులు ముక్కు కోశాడు?
శూర్ఫణఖ


Also Read: 'రామ' ఈ రెండు అక్షరాలు ఎందుకంత పవర్ ఫుల్!


Also Read: అయోధ్యకు రావణుడుని రాజు చేస్తానన్న రాముడు - అదే జరిగి ఉంటే!


Also Read: 'రామో విగ్రహవాన్ ధర్మః' అని ఎందుకంటారు - రాముడు ధర్మం తప్పిఉంటే !