Lord Shiva - Interesting Facts and His Avatars: దశావతారాలు అంటే శ్రీ మహావిష్ణువు ధరించినవే అనుకుంటారంతా..అయితే పరమేశ్వరుడికి కూడా దశానతారాలున్నాయి. ఈ అవతారాల గురించి తెలుసుకుని..నిత్యం ఆ అవతారాలను స్మరించినా చాలు సకల శుభాలు కలుగుతాయని శివపురాణంలో ఉంది.
శంకరుడి దశావాతారాలు ఇవే
మహాకాళి అవతారం
భోళా శంకరుడి దశావతారాల్లో మొదటిది ఇది. ఇందులో పార్వతీదేవి మహాకాళిగా ఉండి భక్తులను అనుగ్రహిస్తుంది. శివుడు మహా కాలుడిగా భక్తులకు ముక్తిని కల్పిస్తాడు
తార్ - తార
శివుడి దశావతారాల్లో రెండోది తార్. ఇందులో అమ్మవారు తారా పేరుతో శివయ్యను అనుసరిస్తుంది. అయ్యవారు అమ్మవారితో కలసి తమ సేవకులకు భక్తిని, ముక్తిని ప్రసాదిస్తారు
బాలభువనేశుడు - బాలభువనేశ్వరి
ఇది శివుడి మూడో అవతారం. ఈ అవతారంలో పార్వతీమాత..బాలభువనేశ్వరిగా పూజలందుకుంటుంది. అమ్మకు అండగా ఉంటూ భక్తులను అనుగ్రహిస్తాడు శివుడు.
షోడశశ్రీవిద్యేశుడు - షోడశశ్రీవిద్యేశ్వరి
పరమేశ్వరుడి నాలుగో అవతారం షోడశశ్రీవిద్యేశుడు. ఈ అవతారంలో స్వామివారి పక్కనుండే అమ్మవారిని దర్శించుకుని , పూజిస్తే భక్తి ముక్తి లభిస్తుంది
భైరవుడు - భైరవి
పరమేశ్వరుడి ఐదో అవతారం భైరవుడు..భైరవిగా దర్శనమిస్తుంది పార్వతీదేవి. ఉపాసకులను అన్ని కాలాల్లోనూ అనుగ్రహిస్తుంది పార్వతీ మాత.
చిన్న మస్తకుడు - చిన్న మస్తకి
చిన్న మస్తకుడిగా శివుడు అవతారమెత్తితే..చిన్న మస్తకిగా కనిపిస్తుంది పార్వతీదేవి.
ధూమవంతుడు - ధూమవతి
ఏడో అవతారంలో శివుడు ధూమవంతుడు..అమ్మవారు ధూమవతి రూపంలో పూజలందుకుంటారు. ఈ అవతారాన్నే ఆదిదంపతులు అని పిలుస్తారు.. పూజిస్తారు
Also Read: విందు భోజనానికి పిలవరు.. విషాహారానికి అగ్రస్థానం ఇస్తారు- ఎట్టాగయ్యా శివా!
బగలాముఖుడు - బగలాముఖి
శివుడు ఎనిమిదో అవతారం బగలాముఖుడు అయితే..అమ్మవారు బగలాముఖి, మహానంద పేరుతో పూజలందుకుంటుంది.
మాతంగుడు - మాతంగి
శంకరుడి తొమ్మిదో అవతారం మాతంగుడు..పార్వతీదేవి మాతంగిగా దర్శనమిస్తుంది.
కమలుడు - కమల
శివుడి దశావాతారాల్లో ఆఖరిది అయిన కమలుడు. స్వామి ఈ అవతారంలో ఉన్నప్పుడు పార్వతీదేవి కమలగా పూజలందుకుంటుంది.
ఈ అవతారాలాన్నీ విడివిడిగా కన్నా తంత్రశాస్త్రంలో ఎక్కువగా కనిపిస్తాయి. అందులో అమ్మవారు అపరకాళిలా భక్తులను సంహరించడం, దుష్టులను శిక్షించడం చేస్తుంటుంది. ఆయా సమయంలో అమ్మవారికి వెన్నంటే ఉంటూ ఆమె ఆగ్రహజ్వాలలను తగ్గిస్తుంటాడు శివుడు. తంత్రశాస్త్రంలో ప్రతి అవతారానికి విడివిడిగా మంత్రాలు, ఉపాసనా విధులున్నాయి.
Also Read: శివుడు స్మశానంలో ఎందుకు ఉంటాడు .. శివాలయాలు శ్మసానంతో సమానమా!
శ్రీ మహేశ్వర పంచరత్న స్తోత్రం (Maheshwara Pancharatna Stotram )
ప్రాతః స్మరామి పరమేశ్వరవక్త్రపద్మం
ఫాలాక్షికీలపరిశోషితపంచబాణమ్ |
భస్మత్రిపుండ్రరచితం ఫణికుండలాఢ్యం
కుందేందుచందనసుధారసమందహాసమ్ ||
ప్రాతర్భజామి పరమేశ్వరబాహుదండాన్
ఖట్వాంగశూలహరిణాహిపినాకయుక్తాన్ |
గౌరీకపోలకుచరంజితపత్రరేఖాన్
సౌవర్ణకంకణమణిద్యుతిభాసమానాన్ ||
ప్రాతర్నమామి పరమేశ్వరపాదపద్మం
పద్మోద్భవామరమునీంద్రమనోనివాసమ్ |
పద్మాక్షనేత్రసరసీరుహ పూజనీయం
పద్మాంకుశధ్వజసరోరుహలాంఛనాఢ్యమ్ ||
ప్రాతః స్మరామి పరమేశ్వరపుణ్యమూర్తిం
కర్పూరకుందధవళం గజచర్మచేలమ్ |
గంగాధరం ఘనకపర్దివిభాసమానం
కాత్యాయనీతనువిభూషితవామభాగమ్ ||
ప్రాతః స్మరామి పరమేశ్వరపుణ్యనామ
శ్రేయః ప్రదం సకలదుఃఖవినాశహేతుమ్ |
సంసారతాపశమనం కలికల్మషఘ్నం
గోకోటిదానఫలదం స్మరణేన పుంసామ్ ||
శ్రీపంచరత్నాని మహేశ్వరస్య
భక్త్యా పఠేద్యః ప్రయతః ప్రభాతే |
ఆయుష్యమారోగ్యమనేకభోగాన్
ప్రాప్నోతి కైవల్యపదం దురాపమ్ ||
ఇతి శ్రీమచ్ఛంకరాచార్య కృతం మహేశ్వర పంచరత్న స్తోత్రమ్ |
పరమేశ్వరుడి దశావతారాలు , స్తోత్రాలు నిత్యం పఠించినా లేకున్నా మహాశివరాత్రి రోజు స్మరించుకుంటే సకల శుభాలు కలుగుతాయి
ఈ ఏడాది ఫిబ్రవరి 26 మహాశివరాత్రి
Also Read: ఈ అష్టకం అష్ట దరిద్రాలను నాశనం చేస్తుంది, ఎందుకంత పవర్ ఫుల్ అంటే