ఫిబ్రవరి 21 రాశిఫలాలు

మేష రాశి

ఈ రోజు అనారోగ్య సమస్యలుంటాయి. ఉద్యోగులు పనిలో విమర్శలు ఎదుర్కోవాల్సి రావొచ్చు. ఆర్థిక ఇబ్బందుల వల్ల మీ మనసు పరధ్యానంగా ఉంటుంది. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే అనుభవజ్ఞుల సలహాలు స్వీకరించండి

వృషభ రాశి

ఈ రోజు నూతన కార్యక్రమాలు ప్రారంభించేందుకు మంచిది. అకస్మాత్తుగా ఆర్థిక లాభం పొందుతారు. ఓ గుడ్ న్యూస్ మీలో ఉత్సాహాన్ని పెంచుతుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. వ్యాపారంలో లాభాలు ఆర్దిస్తారు. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి .

మిథున రాశి

ఈ రోజు మీరు ఉద్యోగ ప్రతిపాదనను పొందవచ్చు. మీరున్న రంగంలో మంచి పేరు పొందుతారు. అనవసర వాదనలకు దిగొద్దు. మీ తప్పులను సరిదిద్దుకునేందుకు ప్రయత్నించండి. గొంతుకి సంబంధించిన సమస్యలుంటాయి. విద్యార్థులు వారి కెరీర్ గురించి ఒత్తిడికి లోనవుతారు.

Also Read: విందు భోజనానికి పిలవరు.. విషాహారానికి అగ్రస్థానం ఇస్తారు- ఎట్టాగయ్యా శివా!

కర్కాటక రాశి

దూకుడు వైఖరిని తగ్గించుకోండి. టైమ్ బాలేదంటూ కాలాన్ని నిందించేకన్నా సవాళ్లను గట్టిగా ఎదుర్కొని దూసుకెళ్లండి. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఉత్సాహం పెరుగుతుంది. కొంత ప్రశాంతంగా ఉండండి. ధ్యానం చేయడం మంచిది.

సింహ రాశి

మీరు చేసే పనిపై ఈ రోజు దృష్టి పెట్టండి. ముఖ్యమైన పనులు అసంపూర్ణంగా ఉండిపోతాయి. జీవిత భాగస్వామి భావాలను అర్థం చేసుకుని మెలగండి. కొన్ని సమస్యలు పరిష్కరించుకునేందుకు ప్రయత్నించండి. ‍ఒంటరిగా ఉండేందుకు ఆసక్తి చూపిస్తారు. 

కన్యా రాశి

ఈ రోజు అనారోగ్య సమస్యలుంటాయి. పాత తప్పులకు ఫలితం ఇప్పుడు అనుభవిస్తారు. కోపం, అత్సుత్సాహంతో ఏ విషయంపైనా స్పందించవద్దు. మనసులో ఎలాంటి సందేహాలు రానివ్వవద్దు. ఆస్తి వివాదాలు వెంటాడుతాయి. కష్టమైన పనులపై మరింత శ్రద్ధ పెట్టేందుకు ప్రయత్నించండి. 

Also Read: శివుడు స్మశానంలో ఎందుకు ఉంటాడు .. శివాలయాలు శ్మసానంతో సమానమా!

తులా రాశి

ఈ రోజు మీ గౌరవంగా తగ్గుతుంది. ఏదైనా అత్యవసర పనికి అంతరాయం కలగడంతో ఒత్తిడికి గురవుతారు.  చిన్న పిల్లలు లేదా ఆధ్యాత్మిక సంబంధిత వ్యక్తులతో గడపడం ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు సౌకర్యాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. మహిళలకు అనారోగ్య  సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

వృశ్చిక రాశి

ఈ రోజు వ్యాపారంలో కొత్త ఒప్పందాలు చేసుకోవచ్చు కాని పనులు ప్రారంభించవద్దు. మీ బాధ్యతల విషయంలో చాలా సున్నితంగా ఉంటారు. కుటుంబంలో మీకు ప్రోత్సాహం పెరుగుతుంది. మానసికంగా బలంగా ఉంటారు. కమిషన్ సంబంధిత విషయాలలో ప్రయోజనం పొందుతారు.

ధనుస్సు రాశి

ఈ రోజు ఎక్కువ కష్టపడొద్దు. కష్టానికి తగిన ఫలితం అందుకోవడం సాధ్యం కాదు. చట్టపరమైన సమస్యలలో చిక్కుకుంటారు. అర్థరహితమైన పనుల్లో  సమయం వృధా అవుతుంది. కొన్ని పనులకు సంబంధించి గందరగోళ పరిస్థితి తలెత్తుతుంది. కుటుంబ సభ్యునికి అనారోగ్య సమస్య ఉండవచ్చు.

మకర రాశి

ఈ రోజు మీరు ప్రియమైనవారి నుంచి సలహాలు, సూచనలు పొందుతారు. పిల్లలు తల్లిదండ్రుల అంచనాలకు అనుగుణంగా జీవిస్తారు. ఉద్యోగులకు ఆదాయం పెరుగుతుంది. నూతన ఉద్యోగం కోసం చూసేవారికి ఈ రోజు మంచిది. తెలియని వ్యక్తులపట్ల జాగ్రత్తగా వ్యవహరించండి. 

కుంభ రాశి

ఈ రోజు ఎవరిపైనా డిపెండ్ అవొద్దు. మీ పనిపై మీరు పూర్తిస్థాయిలో శ్రద్ధ వహించండి. పిల్లల గురించి ఆలోచించండి. వ్యాపారంలో పోటీ పెరుగుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. వ్యవసాయ పనులతో సంబంధం ఉన్న ప్రజలకు ఈ రోజు శుభప్రదమైనది.

Also Read: పగలు కనిపించి రాత్రి పూట మాయమయ్యే శివలింగం , అక్కడ క్షణం క్షణం అద్భుతమే

మీన రాశి

ఈ రోజు మీకు అనారోగ్య  సమస్య ఉండవచ్చు. పాత తప్పుల ప్రభావం ఇప్పుడు మీపై పడుతుంది. కోపం, అతి స్పందన నివారించండి. ఆధ్యాత్మిక సంబంధిత విషయాలపై సందేహం ఉండొచ్చు. ఆస్తి వివాదాలు పెరుగుతాయి. కఠినమైన పనులు చేయాల్సి వస్తుంది. 

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.