Maha Shivaratri 2022: ఈ అష్టకం అష్ట దరిద్రాలను నాశనం చేస్తుంది, ఎందుకంత పవర్ ఫుల్ అంటే

శివుడి ఆరాధనలో లింగాష్టకం తప్పనిసరిగా చదువుతూ ఉంటారు. మరి లింగాష్టకంలో ప్రతి పదానికి ఎంత అర్థం ఉందో తెలుసా...

Continues below advertisement

బ్రహ్మ మురారి సురార్చిత లింగం (బ్రహ్మ , విష్ణు , దేవతలతో పూజలందుకున్న లింగం)
నిర్మల భాషిత శోభిత లింగం ( నిర్మలమైన మాటలతో అలంకరించిన లింగం)
జన్మజ దుఃఖ వినాశక లింగం ( జన్మ వల్ల పుట్టిన బాధలను నాశనం చేసే లింగం)
తత్ ప్రణమామి సదా శివ లింగం ( సదా శివ లింగమా నీకు నమస్కారం !)

Continues below advertisement

దేవముని ప్రవరార్చిత లింగం (దేవమునులు , మహా ఋషులు పూజించిన లింగం)
కామదహన కరుణాకర లింగం ( మన్మధుడిని దహనం చేసిన , అపారమైన కరుణను చూపే శివలింగం)
రావణ దర్ప వినాశక లింగం ( రావణుడి గర్వాన్ని నాశనం చేసిన శివ లింగం)
తత్ ప్రణమామి సద శివ లింగం ( సదా శివ లింగమా నీకు నమస్కారం !)

సర్వ సుగంధ సులేపిత లింగం ( మంచి గంధాలు లేపనాలుగా పూసిన లింగం)
బుద్ధి వివర్ధన కారణ లింగం (మనుషుల బుద్ధి వికాసానికి కారణ మైన శివ లింగం )
సిద్ధ సురాసుర వందిత లింగం (సిద్ధులు , దేవతలు , రాక్షసులు కీర్తించిన లింగం)
తత్ ప్రణమామి సదా శివ లింగం (సదా శివ లింగమా నీకు నమస్కారం !)

కనక మహామణి భూషిత లింగం (బంగారం , మహా మణులతో అలంకరించిన శివ లింగం)
ఫణిపతి వేష్టిత శోభిత లింగం ( నాగుపాముని  అలంకారంగా చేసుకున్న శివలింగం)
దక్ష సుయజ్ఞ వినాశక లింగం (దక్షుడు చేసిన మంచి యజ్ఞాన్ని నాశనం చేసిన శివ లింగం)
తత్ ప్రణమామి సదా శివ లింగం (సదా శివ లింగమా నీకు నమస్కారం !)

కుంకుమ చందన లేపిత లింగం (కుంకుమ , గంధం పూసిన శివ లింగం)
పంకజ హార సుశోభిత లింగం (కలువ దండలతో అలంకరించిన లింగం)
సంచిత పాప వినాశక లింగం (సంక్రమించిన పాపాలని నాశనం చేసే శివ లింగం)
తత్ ప్రణమామి సదా శివ లింగం ( సదా శివ లింగమా నీకు నమస్కారం !)

దేవగణార్చిత సేవిత లింగం (దేవ గణాలతో పూజలందుకున్న శివలింగం)
భావైర్ భక్తీ భిరేవచ లింగం (చక్కటి భావంతో కూడిన భక్తితో పూజలందుకున్నశివ లింగం)
దినకర కోటి ప్రభాకర లింగం (కోటి సూర్యుల కాంతితో వెలిగే మరో సూర్య బింబం లాంటి లింగం)
తత్ ప్రణమామి సదా శివ లింగం (సదా శివ లింగమా నీకు నమస్కారం !)

అష్ట దలోపరి వేష్టిత లింగం (ఎనిమిది రకాల ఆకుల మీద నివాసముండే శివ లింగం)
సర్వ సముద్భవ కారణ లింగం (అన్నీ సమానంగా జన్మించడానికి కారణమైన శివ లింగం)
అష్ట దరిద్ర వినాశక లింగం (ఎనిమిది రకాల దరిద్రాలను నాశనం చేసే శివ లింగం)
తత్ ప్రణమామి సదా శివ లింగం (సదా శివ లింగమా నీకు నమస్కారం !)

సురగురు సురవర పూజిత లింగం (దేవ గురువు (బృహస్పతి), దేవతలతో పూజలందుకున్న శివ లింగం)
సురవన పుష్ప సదార్చిత లింగం (నిత్యం పారిజాతాలతో పూజలందుకున్న శివలింగం)
పరమపదం పరమాత్మక లింగం (ఓ శివ లింగమా, నీ సన్నిధి ఏ ఒక స్వర్గము)
తత్ ప్రణమామి సదా శివ లింగం (సదా శివ లింగమా నీకు నమస్కారం !)

లింగాష్టక మిదం పుణ్యం యః పట్టేత్ శివ సన్నిధౌ 
శివ లోక మవాప్నోతి శివేన సహమోదతే 
(ఎప్పుడైతే శివుడి సన్నిధిలో లింగాష్టకం చదువుతారో వారికి శివుడిలో ఐక్యం అయ్యేందుకు మార్గం దొరుకుతుంది)

Also Read: సృష్టిలో మొదటి సైంటిస్ట్ శివుడేనా..!
Also Read: పగలు కనిపించి రాత్రి పూట మాయమయ్యే శివలింగం , అక్కడ క్షణం క్షణం అద్భుతమే

Continues below advertisement