Son Of India Kiss Scene | ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమా శుక్రవారం థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం ఈ చిత్రానికి నెగటివ్ పబ్లిసిటీ రావడమే కాకుండా.. రివ్యూలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. ఈ చిత్రాన్ని డిజస్టర్‌గా పేర్కొన్నాయి. టికెట్లు కొనుగోలు చేసేవారు లేకపోవడంతో కొన్ని చోట్ల షోలు నిలిపేశారనే వార్తలు వస్తున్నాయి. ఈ విషయాలు పక్కన బెడితే.. మంచు ఫ్యామిలీ ఈ చిత్రంపై భారీ ఆశలనే పెట్టుకున్నారు. చిత్రానికి ప్రమోషన్లు చేసినా ఫలితం లేకపోయింది. ఈ సినిమా విడుదల సందర్భంగా మోహన్ బాబు ఇటీవల పలు టీవీ, యూట్యూబ్ చానెళ్లకు ఇంటర్వ్యులు ఇచ్చారు. ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 


‘సన్ ఆఫ్ ఇండియా’లో కూడా ముద్దు సన్నివేశాలున్నాయని మోహన్ బాబు ఈ సందర్భంగా తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘కథ నచ్చింది. అందుకే ఈ సినిమా తీశాం. దర్శకుడు కథ ఎలా చెప్పాడో అలా తీశాడు. సినిమా బాగా వచ్చింది. ప్రజల తీర్పు ఎలా ఉంటుందో చూడాలి. ఈ మధ్య తీర్పు గమ్మతుగా ఉంటుంది. ఏ టైపు సినిమాను ఇష్టపడుతున్నారో చెప్పలేం. కానీ, నా సినిమా హిట్ అవుతుందనే నమ్మకం నాకుంది. నేటి యువత ద్వందార్థాల డైలాగులు  కోరుకుంటున్నారు. చెయ్యి ఇక్కడ పెట్టాను తీసేమంటావా, మెడ ఇక్కడ పెట్టాను తీసేమంటావా, కాలు ఇక్కడ వేశాను తీసేమంటావా అనేవి ఇష్టపడుతున్నారు. ముద్దులు ఇష్టపడుతున్నారు. మేము ముద్దులు పెట్టలేదు. బుగ్గల మీద, నుదుటి మీద మాత్రమే పెట్టాం. ఇప్పుడు కిస్ అంటే నోట్లో నోరు పెట్టేయడం. ఈ సినిమాలో కూడా డైరెక్టర్‌ ముద్దులు పెట్టించాడు. నాకు 50 శాతమే ఇష్టం. విష్ణుకు అస్సలు ఇష్టం లేదు. అయితే, నేను ఎవరికీ ముద్దులు పెట్టలేదు. ఇద్దరు అమ్మాయిలు ముద్దులు పెట్టుకుంటారు. ఇందులో బ్యాడ్ క్యారెక్టర్ ఉన్న డాక్టర్ మరో అమ్మాయికి ముద్దు పెడుతుంది. అసభ్యతకు తావులేకుండా ఆ సీన్ తీశారు’’ అని మోహన్ బాబు తెలిపారు. మోహన్ బాబు వ్యాఖ్యలను చూస్తుంటే.. అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’లోని ఓ సీన్ గురించే ప్రస్తావించినట్లుందని నెటిజనులు అంటున్నారు.


Also Read:  'సన్ ఆఫ్ ఇండియా' రివ్యూ: వికటించిన ప్రయోగం! 


ఆ పాటకు రూ.1.80 కోట్లు వెచ్చించారు: ‘‘ఆ సినిమాలో ఒకే ఒక పాట ఉంది. గ్రాఫిక్స్ కోసం రూ.1.80 కోట్లు వరకు ఖర్చు పెట్టారు. దానికి అంత ఖర్చవుతుందని అనుకోలేదు. విష్ణు కూడా నాకు చెప్పలేదు. తర్వాత చెబుతా అన్నాడు. చాలా ఎక్కువ ఖర్చు పెట్టాడు. అయితే, ఈ సాంగ్‌కు అంత ఖర్చు పెట్టడం అవసరం. ఈ సాంగ్‌ను చూసిన ప్రతి ఒక్కరికీ రోమాలు నిక్కబొడవాలి. అంతటి అద్భుతమైన పాట అది’’ అని తెలిపారు.


Also Read: ఆ పాటకు రూ.1.80 కోట్లు, రోమాలు నిక్కబొడిచే అద్భుతమైన సాంగ్ అది: మోహన్ బాబు