లెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించిన ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమా శుక్రవారం థియేటర్లో రిలీజైంది. చాలా రోజుల తర్వాత మోహన్ బాబు ఈ సినిమాలో కథానాయకుడిగా కనిపించారు. సమాజం కోసం పోరాడే దేశభక్తుడిగా మోహన్ బాబు నటించారు. ఇది చిన్న చిత్రమే అయినా.. ఇందులోని ఒక పాట చిత్రీకరణకు భారీగా ఖర్చుపెట్టినట్లు మోహన్ బాబు సినిమా ప్రీరిలీజ్ వేడుకలో చెప్పారు. ఇటీవల ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో కూడా ఈ పాట గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. 


ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘ఆ సినిమాలో ఒకే ఒక పాట ఉంది. గ్రాఫిక్స్ కోసం రూ.1.80 కోట్లు వరకు ఖర్చు పెట్టారు. దానికి అంత ఖర్చవుతుందని అనుకోలేదు. విష్ణు కూడా నాకు చెప్పలేదు. తర్వాత చెబుతా అన్నాడు. చాలా ఎక్కువ ఖర్చు పెట్టాడు. అయితే, ఈ సాంగ్‌కు అంత ఖర్చు పెట్టడం అవసరం. ఈ సాంగ్‌ను చూసిన ప్రతి ఒక్కరికీ రోమాలు నిక్కబొడవాలి. అంతటి అద్భుతమైన పాట అది’’ అని తెలిపారు. అయితే, ప్రీ-రిలీజ్ వేడుకలో మోహన్ బాబు ముందుగా కేవలం ఆ ఒక పాట గ్రాఫిక్స్ కోసం రూ.8 లక్షల వరకు ఖర్చు పెట్టినట్లు చెప్పారు. ఆ తర్వాత ఆ సినిమా నిర్మాత మంచు విష్ణు.. రూ.8 లక్షలు కాదు రూ.1.80 లక్షలు ఖర్చయ్యిందని చెప్పడంతో మోహన్ బాబు ఆ విషయాన్ని చెప్పారు. ‘‘ఇది గ్యాసా? డబ్బా కొడుతున్నారా అనుకోవద్దు. ఒక్కోసారి డబ్బా కొట్టుకోవచ్చు. కానీ, మరీ ఎక్కువ కొట్టుకోకూడదు’’ అని అన్నారు. అయితే, ఈ పాట చూసిన తర్వాత నెటిజనుల స్పందన మరోలా ఉంది. అందులోని గ్రాఫిక్స్ చూసి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఈ పాటకు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజ స్వరాలు సమకూర్చడం విశేషం. 


ఆ పాటను ఇక్కడ చూడండి: 



‘సన్ ఆఫ్ ఇండియా’పై వస్తున్న ట్రోల్స్‌ను ఇక్కడ చూడండి:




















గమనిక: సోషల్ మీడియాలో ట్రెండవ్వుతున్న ట్రోల్స్, జోక్స్‌ను యథావిధిగా ఇక్కడ అందించాం. అందులో వ్యక్తులు పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.