కార్తీకదీపం ఫిబ్రవరి 18 శుక్రవారం ఎపిసోడ్
దీప నీతో ఏదో అందని నువ్వు పట్టించుకోవద్దు బాబాయ్ అంటుంది మోనిత. కార్తీక్ మనకు సాయం చేస్తాడా అంటే.. కార్తీక్ నీ అల్లుడు, నేనంటే ప్రేమ ఉంది కానీ బయటపడడం లేదు, కార్తీక్ తో నీకు ఆపరేషన్ చేయిస్తాను, నువ్వు ఆరోగ్యంగా ఉంటావ్ అని చెబుతుంది. ఇన్ని గొడవల మధ్య నాకు ఆపరేషన్ చేస్తాడా అంటే..నువ్వు ప్రశాంతంగా ఉండు అంతా నేను చూసుకుంటాను, నీకు ఆపరేషన్ జరుగుతుంది నేను చేయిస్తానంటుంది. 


సౌందర్య ఇంట్లో: అంతా భోజనానికి రండి అని పిలుస్తుంది శ్రావ్య. నానమ్మ ఈ రోజు వంటలు ఏం చేశారు అని శౌర్య అడుగితే మీకు ఏం ఇష్టమో అన్నీ చేయించా పదండి, అందరం కలసి తృప్తిగా తిందాం అంటుంది సౌందర్య. రా దీపా అని కార్తీక్ అంటే నేను తర్వాత తింటాను మీరు వెళ్లండని చెబుతుంది దీప. ఏమైంది అని సౌందర్య అడిగితే..ఏం లేదు నేను చూసుకుంటా మీరు వెళ్లండని చెబుతాడు కార్తీక్. మోనిత బాబాయ్ కి ఆపరేషన్ చేసేస్తే ఆ తలనొప్పి పోతుందిలే అని నేను ఆలోచిస్తుంటే దీప ఎందుకు అర్థం చేసుకోవడం లేదు అనుకుంటాడు కార్తీక్. 


Also Read:   డాక్టర్ గా కార్తీక్ లైసెన్స్ రద్దు వెనుక మోనిత కుట్ర ఉందని దీప కనిపెట్టేసిందా, కార్తీకదీపం గురువారం ఎపిసోడ్
హాస్పిటల్లో: ఈ మందులు వాడండి, రెండు మూడు రోజుల్లో సర్జరీ ప్లాన్ చేద్దాం అంటాడు కార్తీక్.  నన్ను కొన్ని రోజులు బతకించండి అంటాడు మోనిత బాబాయ్. అలా మాట్లాడకండి మీకు ఏం కాదని చెబుతాడు. బాబాయ్ మీరు బయట కూర్చోండి నేను వస్తానని పంపించేసిన మోనిత.. పాపం భయపడుతున్నాడు అంటుంది. ఆపరేషన్ తర్వాత నువ్వు మాటపై నిలబడతావా అని క్వశ్చన్ చేస్తాడు. అంటే ఆపరేషన్ తర్వాత నన్ను వదిలించుకుందామని ఫిక్సైపోయావా అని అడిగితే..నువ్వు చెప్పిన మాటే గుర్తుచేస్తున్నా అంటాడు కార్తీక్. రాసిపెట్టి ఉంది కాబట్టే మనిద్దరం కలిశాం.. మనిద్దరం డాక్టర్స్, మన బాబుని కూడా డాక్టర్ ని చేద్దాం అంటుంది. షటప్ మోనిత అని లేచిన కార్తీక్..నాపై నిజంగా ప్రేమ, గౌరవం ఉంటే నన్ను, నా కుటుంబాన్ని వెంటాడకు, ప్రశాంతంగా బతకనీ అంటాడు. నిజమైన ప్రేమని ఈ సమాజం అర్థంచేసుకోదు అనుకుంటూ బయటకు వెళ్లిన మోనిత... బాబాయ్ ఆపరేషన్ తోనే మనం కలిసే ఆపరేషన్ నేను ప్లాన్ చేసుకున్నాగా అనుకుంటూ వెళ్లిపోతుంది. 


ఆలోచనలో దీప-ఆగ్రహంతో ఆనందరావు: కట్ చేస్తే కార్తీక్ డాక్టర్ లైసెన్స్ రావడానికి మోనిత కారణం అన్న డాక్టర్ రవి మాటలు గుర్తుచేసుకుంటుంది. రావడానికి కాదు పోవడానికి కూడా మోనితే కారణం అయిఉండొచ్చు. బాబాయ్ పై మోనితకి అంత ప్రేమ ఉందా, ఏదేమైనా తన ప్లాన్ తెలుసుకోవాలి అనుకుంటుంది. మరోవైపు హాస్పిటల్లో ఉన్న కార్తీక్ కి దగ్గరకు కోపంగా వస్తాడు ఆనందరావు. ఏంటి సీరియస్ గా ఉన్నారు, ఇన్నాళ్లకు కలిసాం కదా అంటాడు కార్తీక్. తనదగ్గరున్న పేషెంట్ ని బయటకు పంపించేసి..ఏంటి డాడీ చెప్పకుండా వచ్చారని అడిగితే, నువ్వు చెప్పకుండా వెళ్లలేదా అని రిప్లై ఇస్తాడు. మీకు ఏమైంది, ఎందుకింత కోపంగా ఉన్నారు, ఇంటికెళ్లాక కోపం పోయేవరకూ తిడుదుగానివి అన్న కార్తీక్ తో...ఇప్పుడే వెళదాం అంటాడు. నువ్వు ఇకపై ప్రాక్టీస్ మానేసెయ్, కావాల్సినంత డబ్బు ఇస్తా బిజినెస్ పెట్టుకో, మోనిత బాబాయ్ కి ఆపరేషన్ చేస్తానని ఎందుకు ఒప్పుకున్నావ్, తనేదో వలపన్నింది, ఏదో చేస్తుంది, నువ్వు బాధపడతావ్ మళ్లీ ఇల్లు వదిలేసి వెళ్లిపోతావ్, ఇవన్నీ తట్టుకునే ఓపిక నాకు లేదు అంటాడు. మీరు పదండి డాడీ అంటూ తీసుకెళ్లిపోతాడు కార్తీక్


Also Read: వసు-రిషి మధ్యలో గౌతమ్, ట్రయాంగిల్ లవ్ స్టోరీలో కీలక మలుపు, గుప్పెడంతమనసు గురువారం ఎపిసోడ్
బాబాయ్ పై మోనిత కుట్ర ఆలోచన: నా ఆపరేషన్ జరుగుతుందా అని మళ్లీ డౌట్ వ్యక్తంచేసిన బాబాయ్ తో.. మీరు అస్సలు టెన్షన్ పడొద్దు, కార్తీక్ మీ అల్లుడు, మోనిత మీరు టెన్షన్ పడొద్దని చెబుతుంది. ( నిన్ను అసలు ఆపరేషన్ థియేటర్ వరకే తీసుకెళ్లను, అసలు నువ్వు బతకవు అనుకుంటుంది). హాస్పిటల్లో ఎన్నిరోజులు ఉండాలి అని అడిగితే ( అసలు నువ్వు బతికితే కదా ఎన్నిరోజులు హాస్పిటల్లో ఉండేదో తెలిసేది,  దీపం-శాపం అని నా స్కెచ్ నాకుంది అనుకుంటుంది) ఆపరేషన్ అవనీయండి ఎన్ని రోజులు అవసరం అయితే అన్నిరోజులు ఉందాం అంటుంది. నువ్వు ఎన్ని చెప్పినా ఏదో టెన్షన్ తగ్గడం లేదన్న బాబాయ్ తో మై హూనా అంటుంది మోనిత.


సౌందర్య ఇంట్లో: మోనిత బాబాయ్ ఆపరేషన్ గురించి మీ నాన్నతో చెప్పి తప్పుచేశానేమో అని ఆదిత్యతో సౌందర్య అంటుంది. ఇంతలో కోపంగా దీపా అని కోపంగా అరుచుకుంటూ వస్తాడు కార్తీక్. ఏమైందని సౌందర్య అడిగితే ఇంట్లో అందరిపై తన అభిప్రాయాన్ని రుద్దేసిందని ఫైర్ అవుతాడు. ఏమైందని సౌందర్య అడిగితే... నేను చెబుతా అంటూ ఆనందరావు ఎంట్రీ ఇచ్చి అసలు విషయం చెబుతాడు. తను మన కుటుంబాన్ని ఎంత ఇబ్బంది పెట్టిందో తెలిసి కూడా ఎలా ఒప్పుకున్నావ్ అని ఆదిత్య అడిగితే... అందుకే ఒప్పుకున్నా అంటాడు కార్తీక్. ఇకపై అన్నీ వదిలేస్తానంది, ఆపరేషన్ చేస్తే మనల్ని ఇబ్బంది పెట్టను అని చెప్పింది అందుకే చేస్తున్నా...అయినా దీప మాటకిచ్చిన విలువ నాకివ్వడం లేదు..ఈ ఇంట్లో నా స్థానం ఏంటి అని క్వశ్చన్ చేస్తాడు కార్తీక్. నీ స్థానం, సపోర్ట్ గురించి మాట్లాడుతున్నావా...నీకు కష్టం వస్తే మేం అంతా నిలబడలేదా, కట్టుబట్టలతో తీసుకెళ్లిపోతే నీకు అండగా నిలబడింది చూడు అదీ సపోర్ట్ అంటే...అయినా మోనిత నీకు ఫేవర్ చేసిందంటే ఎలా నమ్ముతున్నావ్ అని క్వశ్చన్ చేస్తుంది సౌందర్య. కార్తీక్ ఆలోచనలో పడతాడు. ఎపిసోడ్ ముగిసింది....