అండమాన్‌కు సమీపంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై ఉండదు. ఇది బలహీనపడుతూ బర్మా వైపు కదులుతోంది. మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం పొడిగా ఉంటుంది.పొడి గాలులు కారణంగా మూడు రోజుల పాటు పగటి పూట వేడిని పెంచేస్తాయి. రాత్రి పూట చలిపెట్టిస్తాయి. 21న జరగబోయే రాష్ట్రపతి ఫ్లీట్ రివ్యూకు వాతావరణ ప్రభావం ఉండబోదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఉత్తర, దక్షిణ కోస్తా, యానాం, రాయలసీమలో వాతావరణంలో పెద్ద తేడా ఉండదని వాతావరణ శాఖ వెల్లడించింది.
తెలంగాణలో వాతావరణం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఉదయం కాసేపు పొగమంచు పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణగ్రత 31డిగ్రీల సెల్సియస్, కనిష్ఠ ఉష్ణోగ్రత 19 డిగ్రీలు ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఆగ్నేయ దిశ ఉపరితల గాలులు గంటకు ఎనిమిది నుంచి పది కిలోమీటర్ల వేగంతో వీచే ఛాన్స్ ఉంది.
కొన్ని ప్రాంతాల్లో చిన్నపాటి వర్షం పడొచ్చని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములతో కూడిన జల్లులు పడే ఛాన్స్ ఉంది. ఇవాళ రేపు చిరుజల్లులు పడొచ్చు. ఎల్లుండి నుంచి రెండు రోజులు వాతావరణం పొడిగానే ఉంటుంది. అత్యధిక ఉష్ణోగ్రత నల్లగొండలో 33 డిగ్రీలు నమోదు కానుంది. అతి తక్కువ ఉష్ణోగ్రత అక్కడే నమోదయ్యే ఛాన్స్ ఉందని వాతవరణ శాఖ ప్రకటించింది.