తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు(KCR Birthday) సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కడియం(Kadiyam) మండలం కడియపులంక గ్రామంలో గ్రీన్ లైఫ్ నర్సరీలో కూరగాయలు, పువ్వులు, నవధాన్యాలతో కేసీఆర్ చిత్రాన్ని(KCR Photo) అలంకరణ చేశారు. గ్రీన్ లైఫ్ నర్సరీ యజమాని తిరుమలశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ రైతుల కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న కృషికి కృతజ్ఞతగా ఆయన ముఖ చిత్రాన్ని కూరగాయలు, పువ్వులతో అలంకరణ చేశామని తెలిపారు. హరితహారం(Haritharam) కార్యక్రమం ద్వారా కడియం మండలంలో రైతుల వద్ద నుంచి మొక్కలను కొనుగోలు చేస్తూ ఆర్థికంగా సహకరిస్తున్న సీఎంకి ఈ విధంగా కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు.
తిరుమలలో సీఎం కేసీఆర్ బర్త్ డే వేడుకలు
తెలంగాణ సీఎం కేసీఆర్ జన్మదినం పురస్కరించుకుని తిరుమల అలిపిరి నడక మార్గం వద్దకు కల్వకుంట్ల కవిత(Mlc Kavita) చేరుకున్నారు. అలిపిరి వద్ద కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని నిరుపేదలకు అన్నదానం చేశారు. అనంతరం సప్తగోప్రదక్షిణ మందిరాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సందర్శించారు. అనంతరం గోపూజలో కవిత, అనిల్ దంపతులు పాల్గోన్నారు. గోమందిరంలో శ్రీ కృష్ణునికి ప్రత్యేక పూజలు చేశారు. గోమందిరంలో రుద్రాక్ష మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తిరుమల శ్రీవారి(Tirumala Srivari)ని దర్శించుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నామని, తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తానని తెలిపారు. అలిపిరి వద్ద వాతావరణం ఆహ్లాదకరంగా ఉందని, పాదాల మండపం వద్దకు చేరుకోగానే మనలు భక్తిభావంతో నిండిపోయిందని ఆమె తెలిపారు.
సత్తుపల్లిలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు(Kcr Birthday Celebrations) అంగరంగ వైభవంగా నిర్వహించారు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య(Mla Sandra Venkata Veeraiah). స్వరాష్ట్రం కోసం అలుపెరుగని పోరాటం చేసిన ఉద్యమ వీరుడు, బంగారు తెలంగాణ కోసం పాటుపడుతున్న అవిశ్రాంత శ్రామికుడు సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. సత్తుపల్లి రూరల్ మండలం కిష్టారం గ్రామంలో తెలంగాణ ఉద్యమకారులు, టీఆర్ఎస్ నాయకులు(TRS Leaders), కార్యకర్తలు, పిల్లల ఆనందోత్సహల మధ్య అంగరంగ వైభంగా కేసీఆర్ బర్త్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సత్తుపల్లి పట్టణంలో కృష్ణ మందిరం వద్ద పూజలు నిర్వహించి, పట్టణంలో కేసీఆర్ చిత్రపటాన్ని చిత్రీకరించి, తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను చిత్రలేఖనం ద్వారా రంగురంగుల ముగ్గులతో అలంకరించారు. సర్వమత ప్రార్థనలతో కేక్ కట్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి మొక్కలు నాటారు. గిఫ్ట్ ఏ స్మైల్(Gift A Smile) లో భాగంగా వికలాంగులకు ట్రై సైకిల్(Tri Cycle) పంపిణీ చేశారు.